Wednesday, January 3, 2024

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది తెలుసుకోవాలని వశిష్ట మనుషుల వారు మేరు పర్వత స్థానమైన భూలోకంలో ఆయన్ని కలవగా ఆయన ఈ సృష్టి రహస్యాన్ని అతడు ఎప్పటినుంచి చూస్తాడో అన్ని వివరాలను ఈయనకు తెలియజేశాడు. ఆ కాకుబుషుండ ఎవరో తర్వాత తెలిసుకుందాం.  కానీ ఆయన చెప్పిన విశేషాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది కొంచెం ఎక్కువ  ఉంటుంది కాబట్టి వివిధ భాగాలుగా వస్తుంది. ఇది  యోగా వాసిష్టంలోని గ్రంథంలోని సారాంశం.
[04/01, 11:26 am] Siva Kumar: _Introduction story skipped_
[04/01, 11:26 am] Siva Kumar: Part 1
వసిష్ఠ - భుశుండ సమాగమం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! యోగమార్గము గురించి, తద్వారా సంకల్పశమము గురించి, కాలముయొక్క అతి విచిత్రమైన 'గతి' గురించి, సృష్టిపరంపరల చమత్కారం గురించి విశదీకరించగల ఒక సంవాదమును నీకు వివరిస్తాను. ఈ సంవాదము నాకు 'భుశుండుడు' అను పేరుగల కాకి జాతివాడగు యోగితో జరిగింది. ఆ మహానుభావుని అనుభవములేమిటో చెబుతాను విను.
'పరబ్రహ్మము' (universe) అనబడే మహాసాగరంలోని జలకణము వంటి ఒక అల్పవిభాగంలో ఈ జగత్తులన్నీ వెలయుచున్నాయి. ఈ సృష్టికి కారణస్వరూపుడుగా కమల సంభవుడగు బ్రహ్మదేవుడు వెలయుచున్నారు. అట్టి బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మానస పుత్రుడను నేను. తపోధ్యానముల బలం చేత సప్తర్షిమండలంలో స్థానం (star of Mizar) సంపాదించాను. వైవస్వత మన్వంతరం వరకు నేను ఇట్లే ఉండబోవుచున్నాను.(18,57,60,000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి ఈ మన్వంతరానికిఅంటే ఆ యొక్క ఒక్క నక్షత్రం లేదా ఆ యొక్క మహర్షి ఇన్ని సంవత్సరాలు ఇంకా ఉంటారని అర్థం చేసుకోవచ్చు తర్వాత ఫార్మేషన్ మారుతుంది అది వేరే సంగతి years left for vaivaswatha manu)
అట్టి నేను ఒకానొకనాడు ఏదో సందర్భంలో స్వర్గంలోని ఇంద్రసభకు వెళ్లాను. అక్కడి సభలో ఈ నారదుడు మొదలైన మహర్షులందరూ ఉన్నారు. అప్పుడు జరిగిన ప్రసంగంలో ‘చిరంజీవత్వం’ గురించి సంభాషించుకోవటం జరిగింది. అప్పుడు శతతాపుడు అనే పేరుగల ముని లేచి నిల్చున్నారు. ఆయన “మాననీయుడు, ప్రమాణకుశలుడు, అవసర మాత్ర ప్రసంగి" అని ప్రసిద్ధి. సభంతా నిశ్శబ్దమైనది. శతతాపముని ప్రసంగించటం ప్రారంభించారు.
శతతాపముని : ఓ సభికులారా! మీరంతా 'చిరంజీవత్వం' గురించి అనేక విశేషాలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రత్యక్షసాక్షియగు ఒక చిరంజీవుని గురించి చెబుతాను వినండి.


.సుదీర్ఘ సృష్టి చమత్కారం
శ్రీవసిష్ఠ మహర్షి : అత్యంత దీర్ఘాయువు కలిగి, మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ, యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములను పొంది, అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తు న్నారు. సర్వమూ కాలయమునకు 'ఎర' (birth and death) అగుచుండగా మీరు మాత్రం మీ ధారణా శక్తిచే కాలముచే బంధింపబడకుండా ఉన్నారు. పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషయములు చెప్పుటకు సమర్థులు. ఓ మంగళహృదయా! అనేక విధములగు సృష్టులను(orgin for universe), ప్రతిసృష్టులను(clusters), సామాన్య ప్రళయములను , అవాంతర ప్రళయములను, మహాప్రళయములను చూచిఉన్నారు కదా! ఆ సృష్టులలో ఏఏ ప్రత్యేక విషయములు సందర్భోచితమో... అవి చెప్పమని నా విన్నపం. 

భుశుండుడు : మహాత్మా! వినండి - ఈ సుమేరుపర్వతం క్రిందగల భూమి అంతా వృక్షములు గాని, గడ్డిగాని, శైలము (Rock) గాని లేక, కేవలం శూన్యంగా ఉండటం చూచాను (gas formation). భూమి 11000 సంవత్సరాల కాలం భస్మరాశితో (lava) నిండి ఉన్నది. అప్పుడు భూమిపై సూర్యుడు గాని, చంద్రుడు గాని లేకపోవటం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు (gas clouds). కాలమునకు కొలతబద్ద లేకపోయినా (time) నేను నా విజ్ఞానదృష్టితో సూర్యచంద్రుల కంటే విశిష్టమైన కాలగమనాన్ని గమనించాను.
భూమి సగం పగలు, సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది. దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలోని అంతర్భాగంలో దాగి ఉండుటచే ఈ భూమి కొంతకాలం జన శూన్యమైపోయింది. (No  living species)

Tuesday, July 11, 2023

ధ్రువ నక్షత్రం సైన్స్

ఖగోళశాస్త్రంలో "ఎవరు ముందు?" అనేది ఒక చిక్కు ప్రశ్న? ముఖ్యంగా "ప్రాచ్యులు ముందా? పాశ్చాత్యులు ముందా?" అన్న ప్రశ్న వచ్చేసరికల్లా, "అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయి" అని మనవాళ్ళంటారు, "మీ మొహం మీకేమీ తెలియదు" అని మనని మన ప్రజ్ఞని పాశ్చాత్యులు కించపరుస్తూ ఉంటారు. ఈ తగవు రివాజు అయిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఆధారాలు చూపించకుండా మాట్లాడే మన అలవాటు కావచ్చు.

ఈ తగవుని నేను పరిష్కరించలేను కాని, మహీధర నళినీమోహన్ "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" లో ఉదహరించిన ఆధారం ఒకటి ముచ్చటిస్తాను. మహాభారతం వ్యాస ప్రణీతం. అది లిఖితరూపం లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని, భారతయుద్ధం తరువాత జనమేజయుడు చేసిన సర్పయాగంలో సూతుడు ఈ కథ చెబుతాడు. ఇది కలియుగపు ప్రారంభంలో జరిగింది. అంటే దరిదాపు 5000 సంవత్సరాల కిందట. కనుక మహాభారత కాలం ఉరమరగా, కొంచెం ఇటూ అటూ గా, 5000 ఏళ్ళ క్రితం నాటిది.

ఈ సంస్కృత భారతంలో IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో ధ్రువుడికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.

"వేదాహంతే వ్యవసితం హృదిరాజన్య బాలక!

యత్రగ్రహార్ష తారాణాం, జ్యోతిషాం చక్రమాహితం

మేధ్యాం గోచక్రవత్‌స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం

ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః

చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః

షడ్వింశద్వర్ష సాహస్రం, రక్షితా వ్యాహతేంద్రియః

ఈ శ్లోకాన్ని ఆంధ్ర భాగవతంలో బమ్మెర పోతన ఈ విధంగా తెలిగించేడు.

"క. ధీరవ్రత! రాజన్యకు

మారక! నీ హృదయమందు మసలిన కార్య

బారూఢిగా నెరుంగుదు

నారయనది పొందరానిదైనను నిత్తున్

వ. అది యెట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తఋషులును తారకా సమేతులై ప్రదక్షణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారువేల యేండ్లు సనం బ్రాపింతువు."

దీన్ని మనందరికీ అర్ధం అయేలా చెప్పుకోవాలంటే రాట (మేధి) చుట్టూ ఆవు తిరిగిన మాదిరి ఆకాశంలో ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండే నక్షత్రాలు వలయాకారంలో తిరగటానికి 26,000 ఏండ్లు పడుతుందని వ్యాసుడు చెపుతూనట్టు నాకు అర్ధం అయింది. ఈ 26,000 ఏండ్ల వలయం భారతంలో ఉందంటే కనీసం 5000 ఏండ్ల క్రితమే ఈ విషయం మనవాళ్ళకి తెలుసన్నమాట. అంటే సాధారణ శకానికి 3000 సంవత్సరాల క్రిందట అన్న మాట.
భూ  అక్షం స్థిరంగా ఉండదనిన్నీ, అంటే భూ అక్షం ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపే చూపిస్తూ ఉండకుండా, ధ్రువ నక్షత్రం చుట్టూ 26,000 ఏళ్ళకో ప్రదక్షిణం చొప్పున వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గ్రీకు శాస్త్రవేత్త హిపార్చస్ సాధారణ శకానికి పూర్వం 143 లో కనుక్కున్నాడు. ఈ చలనాన్ని సంస్కృతంలో విషువచ్చలనం అనిన్నీ, ఇంగ్లీషులో precession of the equinoxes అనిన్నీ అంటారు. భారతంలోని శ్లోకాన్ని బట్టి ఈ విషయం పాశ్చాత్యులకంటె కనీసం రెండు సహస్రాబ్దాల ముందే మనవాళ్ళకి తెలిసిందని ఋజువు అవటం లేదూ?

విషువచ్చలనం అతి స్వల్పం. అంటే ఏడాదికి ఉరమరగా ఒక నిమిషం (భాగ లేదా డిగ్రీలో 60 వ వంతు). ఇంత స్వల్పమైన కదలిక యొక్క ప్రస్తావన కవిత్వంలోకి వచ్చేసిందంటే దీన్ని గమనించి, నమోదు చెయ్యటం అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటుంది.

Sunday, April 30, 2023

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది...