Wednesday, September 10, 2025

శ్రీ గరుత్మంతుని కదా అందులోని అర్థం

పురాణాల్ని ఎలా అర్థం చేసుకోవాలి "పురానేతి నవం" అంటే పురాణం ఎప్పుడూ చదివినా సరే సరికొత్తగా ఉంటుంది అని అర్థం. పురాణాలు జరిగాయా అంటే అవును. అలాగే! తత్వ పరంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మనలో! అది అర్థం చేసుకున్ననాడు పురాణం మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా అందులో మంచి తీసుకోవడమే పరమాహంసల లక్ష్యం. అందుకు ఒక ఉదాహరణ. 

ధర్మరాజు “వేదాల ప్రనక్తిని భీష్ముని ప్రవచనంలో విని గరుత్మంతుని జ్ఞావకం చేసికొన్నాడు. గరుత్మంతుడనే మాటకు వేదమార్గమనే అర్థంకూడ ఉంది. అందుకని గరుత్మంతుని కథ వినాలని ఉంది - చెప్పవలసిందంటాడు.

వ్యాసుడు ఆదిపర్వంతో సౌపర్ణోపాఖ్యానం భారతంలో చేర్చినా మళ్ళీ, ఇక్కడ గరుత్మంతునికథ వివరిస్తున్నాడు. ఏదో అంతరాంతరమైన అర్థం ఈ కథలో ఉందికనుక వ్యాసుడు దాన్ని అంత ప్రేమించి ఉంటాడు. గరుత్మంతుడు సాక్షాత్తు విష్ణుమూర్తికి వాహనమే అయినాడని చెప్పి అతడి గొప్పతనాన్ని గూర్చి వాక్రుస్తాడు.
 భీష్ముడు చెప్తున్నాడు : “కశ్యపుడికి ఇద్దరు భార్యలు. వినత, కద్రువ వారిద్దరికీ వారుకోరిన ట్లుగా సంతానం కలిగే వరాన్నిచ్చాడాయన. కశ్యపుడనేమాట ‘పశ్యకు' డనే అర్ధానికిగాను వాడారు. ఆయనకు నమస్తమైన నిజమూ అవుపడుతుందని ఆ అర్థం! మనిషి ప్రధానుడు పుణ్యం-పాపం అనేవి అతడికి సహాయకాలు. ఈ కథలోని ఇద్దరు భార్యలూ మనిషికి పుణ్యపాపాల్లాటివారు.

వినతకు రెండు గ్రుడ్డులూ కద్రువకు వేయి గ్రుడ్డులూ పుట్టినయి. వాటిని కుండల్లో నేతిలో పెట్టి వాటినుంచీ రావాల్సిన జీవాలకోసం ప్రతీక్షిస్తున్నారీ ఇద్దరు స్త్రీలు. పుణ్య పాపాల ఫలం వెంటనే కలుగనూవచ్చు వేయేండైనా పట్టనూవచ్చు. వారు అలా వేచి ఉన్నారు. ముందు కద్రువకు పుట్టిన వేయి ॥గ్రుడ్లూ ఒకొక్కటే విచ్చి జీవాల్ని ప్రసవించినయి. అవన్నీ పాములరూపంలో ఉన్నయి. బలంగా ఉన్నయి. పొడుగ్గా ఉన్నయి. వినతకు పుట్టిన గ్రుడ్లు ఇంకాపిల్లల్ని ప్రసాదించలేదు. వినత మత్సరాన్నిపొంది, ఒక గ్రుడ్డును చిదిపింది. "పుణ్యపరుడైనా" ఈ మనో వికారాల్ని జయించడానికి సాధన కావాల్సిందే. అది లేక ఇలాటి పిచ్చిపని ఆమెచేసింది.

ఆ గ్రుడ్డులోంచీ "అనూరుడనే" పక్షి పెద్ద శరీరంతో ఉద్భవించినా క్రింది భాగం పూర్తిగా పెరగని కారణంచేత కుంఠితత్వం అతడి శరీరానికి కలిగింది. అతడు తల్లిని మందలించి నీకు పాముల తల్లి అయిన కద్రువకు దాస్యం చేయాల్సిన గతిపట్టుతుంది అన్నాడు. ఆ రెండో గ్రుడ్డును జాగ్రత్తగా కాపాడితే అందులో పుట్టేవాడు నీ దాస్యాన్ని వదిలిస్తాడన్నాడు. ఈ గ్రుడ్డు విచ్చడానికి ఇంకా ఐదువందల ఏండ్లు పట్టుతుందనికూడ చెప్పాడు. ఏండ్లు అయింతరువాత ఆ గ్రుడ్డులోంచీ మహాకాయుడైన "గరుత్మంతుడు" పుట్టాడు. అనూరుడు సంతోషించి సూర్యలోకానికి వెళ్ళిపోతాడు. పుణ్యఫలాలు రెండు విధాలు అనిపిస్తుంది. ఐహిక ఫలాన్ని అనుభవించి సుఖపడటం ఒకటి. ఆముష్మికోన్నతికి దోవదొరకడం రెండు. అనూరుడు మొదటి సుఖం ఇచ్చాడు. గరుత్మంతుడు పుట్టంగానే అనూరుడు సూర్యలోకా నికి వెళ్ళాడంటె పుణ్యఫలం మెట్టునెక్కిందనుకోవాలి, వినతకు గరుత్మంతుని వల్ల ఆ ముష్మికఫలం కలుగబోతోంది.అనూరుడు వెళ్ళినప్పుడే, - గరుత్మంతుడు బ్రహ్మదేవునిచేత కల్పితమైన భోజనం చేయడానికి వెళ్ళాడు. అది తిని శరీరం చక్కగా పెంచుకొన్నవాడై సిద్ధ సాధ్యగణాలచేత ముద్దు చేయబడి ఆడుకొంటూ ఉండేవాడు. బ్రహ్మ కల్పించిన భోజనం యేదో అది! పుణ్యఫలితంగా మనిషికి కలిగే "ధర్మబుద్ధి" ఆ భోజనమై శరీరమనోబుద్ధులకు వికాసాన్ని కలిగిస్తూ సిద్ధులూ చారణులతో సమానమైన శక్తులు కలిగింపజేస్తూండటమయి ఉండవచ్చు.

ఈ కథలో పూర్వమే కద్రూ వినతలు సముద్రతీరానికి వాహ్యాళికి: వెళ్తారు. సముద్ర–అంటే బ్రహ్మా ఆనందమని అర్థం. దాన్ని చేరారంటె "బ్రహ్మా నందం" తీరానికి వెళ్ళారు. అదే "శుద్ధ సత్త్వస్థితి". దూరంగా వారికి శుద్ధ సత్వమన దగిన "ఉచ్ఛైశ్రవము" కనుపడింది. “దానితోక, తెల్లగాలేదు నల్లగా ఉన్నదం టుంది కద్రువ”—కాదు సర్వమూ తెలుపేను ఆ గుఱ్ఱమంటుంది వినత. పుణ్య వశంచేత సత్వాన్ని పొందినా మనిషికి సాత్వికాహంకారం ఉదయించకుండా ఉండాలి. కాని ఇక్కడ "వినతకు" అహంకారం కలిగినదై, కద్రువ మాటను కాదని ఎదిరించింది. నిజానికి ఆరంగు ఎలాఉంటేనేంగాక! ఇద్దరూ వాదించు కొని పందెం కట్టారు. వెళ్ళి చూడాలి. ఎవరు ఓడిపోతె వారు రెండోవారికి దాస్యం చేయాలన్నారు ఆనాడు ప్రొద్దుగ్రుంకి మర్నాటికి ఆ పనిని వాయిదా” వేశారు.

మరునాడు కద్రువ దుర్వ్యూహంచేసి, కొడుకుల్ని వెళ్ళి ఆ గుఱ్ఱపు తోకను నల్లగా చుట్టుకొని ఉండుమంటుంది, ఆ కుమారులంతా ధర్మానికి వ్యతిరేకం చేయమంటారు. ఆమె శపిస్తుంది. మీరంతా జనమేజయ యాగంలో హోమగుండంలో నశిస్తారని. ఒక్క "కర్కోటకుడనేవాడు" మాత్రం ఆమె అజ్ఞను ఇష్టం లేకుండానె ఒప్పుకొని మొత్తంమీద నెరవేరుస్తాడు. వినత మరు నాడు తన పందెం ఓడిపోయింది. నవతికి దాశీ అయింది.సాత్వికాహంకారంవల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ‘మనిషి పుణ్య పరుడైనా ఈ అహంకారం కలుగకుండా చూచుకోవాలి. అది కలిగిందంటే: పెద్ద పతనం కలుగుతుంది. ఆ సాత్త్వికాహంకారం పోవాలంటె మంచికో-చెడుకో-ఇతర్లకు దాన్యం చేయడానికి సిద్ధంకావాలి. దాస్యం చేస్తేనే ఆయహ కారం పోయినట్లు! పుణ్యంవల్ల కలిగిన అధ్యాత్మతత్త్వం కారణంగా భగవంతుడి అనుగ్ర హం కలుగుతుందంటారు. అలాగే నారదుడు గరుత్మంతుడికి అతడి తల్లికి కలిగిన దాస్యం ఐహికంగా వదిలించి వేయరాదా అని, దానికి సంబంధించిన పై జరిగిన కథను చెప్తాడు. గరుత్మంతుడు వెంటనె నవతితల్లివద్దకు చేరి నమ స్కరించి “మా తల్లి దాస్యం నీకు చేయాల్సిందె. ఆది న్యాయమా అన్యాయమా అని నేను వివాదం చేస్తున్నాననుకొనకు. ఈ దాస్యం ఇప్పుడు బయట పడలాలంటే నీకేంకావాలో చెప్పునే తెచ్చిస్తానన్నాడు.ఆమె “అమృతం తెచ్చియివ్వు-మీ అమ్మకు ధాన్యం వదలిపోతుంది. నీపు ఆమెను తీసికొనిపోదువుగాని!”-అంటుంది. బహుశ ఈ పని ఇతడు చేయ లేడనుకొని యుండచ్చు. లేదా బ్రహ్మ దగ్గరకు వెళ్ళగలిగినవాడుగనుక ఇతడే అమృతం తేగలడనుకొని ఉండచ్చు. ఏదైనా మేలేనని అలా చెప్పింది. కొడు కుల్ను తాను శపించినా అమృతం తెస్తే తానూ వారూకూడ శాశ్వతంగా ఐహి కంలో బ్రతుకుదామనుకొంది కావలె. కాని కొడుకులు వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ పుణ్యపాపాల విధానాన నడుపుకొంటున్నారు జీవితాల్ని. అమృతం తెస్తే పాపా నికి ప్రతీక అయిన ఈ కద్రువకే లాభం బహుశ! వాసుకీ మొదలైన కుమారులు అప్పటికే పరమాత్మ నాశ్రయించి అమృతమయులైనారు.గరుత్మంతుడాలోచించాడు- ఏం చేయాలని. వెంటనే వెళ్ళి తండ్రిని శక్తి రావాలి! ఎలాగ ? ” కలిసి "అమృతం తేవాలి నాకు దేవతల్ని జయించే శక్తి అన్నాడు.
 కశ్యపుడు పశ్యకుడేననన్నాముకదా! అంటే నిజం చూడగలవాడు. చూశాడు. మానవలోకంలో వారికి ద్వంద్వాలుంటయి. ఆ ద్వంద్వాలు నశిస్తే గాని దేవతలంతటివారు కాలేరు; అందుకని, ఆ ద్వంద్వాల్ని నశింపజేయుమనే భావం కడుపులో పెట్టుకొని, ఇలా అన్నాడు.

'తూర్పు సముద్రానికి దగ్గరె ఒక పర్వతముంది. అక్కడొక పెద్ద సరన్సు ఉంది. మధుకైటభులు పూర్వమెప్పుడో అప్సకకోసం పోట్లాడుతూ చచ్చినవాళ్ళై ఒక గజమూ ఒక కచ్ఛపముగా ఆ పర్వతం, సరోవరంలలో జన్మించి పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఆ యిద్దర్నీ ఒక్కసారిగా పట్టి నాశనం చెయ్యాలి. ద్వంద్వాలైన ఆ రెంటినీ ఒకేసారి నాశనం చేస్తేగాని దేవతల్ను జయించటం కుదరదన్నాడు పెళ పెళమంది. వైనతేయుడు క్షణంలో ఎగిరి వెళ్ళాడు. అక్కడ ఏనుగును నరసిలోని 'నీళ్ళు తాగనీయకుండా తాబేలు అడ్డుకొంటోంది. ఏనుగు దాన్ని తొక్కు తోంది. పక్షీంద్రుడు వాటి వివరణ పశ్యకునిద్వారా తెలిసికొన్నవాడు కావటం చేత, తన రెండు కాళ్ళ గోళ్ళతో రెంటినీ గ్రుచ్చి ఎత్తి ఆకాశమార్గానికెగిరి ఒక పెద్ద చెట్టుమీద పెట్టి తినబోయినాడు. ఆ చెట్టుకొమ్మ విరిగి క్రిందపడితే దాన్ని పట్టుకొని ధ్యానసమాధుల్లో ఉన్న బొటనవేలు పరిమాణంలో ఉన్న "వాలఖిల్యులనే" మునులు చచ్చిపోతారు అని తెలసికొన్నాడు. తండ్రి ద్వంద్వాల్నేనాశం చేయా లన్నాడని, దయ మొదలగు వాటిని కూడ నాశంచేశాడా యీ గరుత్మంతుడు? లేదు. దయాదులను నాశం చేయలేదు. ఆ మునులను రక్షించాలనే, తన నోటితో ఆ విరిగి పోయిన కొమ్మను పట్టుకొని వారిని రక్షించాడు, దీనితో గరుత్మంతునికి పుణ్యం, తత్పలం కలుగుతోంది. ఎక్కడో పర్వతంమీద నిల్చి ఆ రెంటినీ నశింప జేశాడు, అమృతంకోసం దేవలోకం వెళ్ళాడు.ద్వంద్వాల్ని గుర్తించాలి ముందు. సుఖం కలుగుతుంది. దానివెంట అని తెలియాలి. కలిగే దుఃఖం-ఓహో-ఇది సుఖానికి ప్రత్యర్థిగా వచ్చింది. అందుకె గరుత్మంతుడు ముందు ఏనుగను చూచి అది నీళ్ళకు వెళ్ళుతున్నప్పుడు దాన్ని తాను అనుసరించి వెళ్ళి తాబేలుతో పోట్లాడే ఆ తాబేలును గుర్తించటం కూడ వ్యానమహర్షి కథలో వర్ణించాడు! 

  అమృతభాండాన్ని ఒకచోట దాచి దానిచుట్టూ మంటలు పెట్టి ఉన్నారు దేవతలు. అందుకని ముందు బ్రహ్మను తలచి ఆయన్ను ప్రసన్నుని చేసి కొన్నాడు గరుత్మంతుడు. బ్రహ్మను గత్యంతరమడిగాడు. అప్పుడు బ్రహ్మ అంటాడు "ఆలమందలుండేచోటికి వెళ్ళు. అక్కడ నుంచి అంతులేనంత "వెన్న" తెచ్చి ఆ మంటలకున్న శిఖలకు వెయ్యి. ఆ అగ్ని జిహ్వలు మోయలేనంత వెయ్యి. అవి తగ్గుతాయి. అప్పుడు లోపలకు వెళ్ళి అమృతాన్ని పొందు" అని! ఆలమందలంటే సాధులోకం. అక్కడికి వెళ్ళుమంటే "నీపు సాధుపు కావలసిందని అర్థం. వెన్న అంటే ప్రేమ, దయ! వీటిని పుష్కలంగా కలిగిఉండు. ఆ "దయను" ఆ క్రోధరూపమైన అగ్ని భరింపలేనంతగా ప్రసరింపజెయ్యి. అతడు తగ్గిన క్షణాన అమృతభాండాన్ని నీవు చేరగలవని బోధ.

ఇది సాధన. ఇంతసాధనవల్లనే అమృతం చిక్కుతుంది. అమృతమంటే "వరమాత్మ అనుగ్రహం" అని అర్థం! దాన్ని గడించడానికి ఇంతపని తప్పదని బోధ. మామూలు మనుషులకు సందేహం వస్తూ ఉంటుంది పురుషకారము... మోక్షం గొప్పదా? దైవానుగ్రహమా? అని, సాధనలో పురుషకారం కావాలి. అది రూపాయలు సంపాదించడానికికాదు! భగవంతుని అనుగ్రహం పొందడానికి. గాను చేయాలి. అలాటి పురుషకారంవల్ల భగవదనుగ్రం కలిగితె మోక్షం పొందచ్చు. ఏదిగొప్ప? పురుషకారమె మనమున్న స్థితిలో కర్తవ్యం, గొప్పా కూడ! దానివల్లనే ‘అనుగ్రహం' పొందాలి కనుక చిట్టచివరిదిగా అనుగ్రహమె . గొప్ప! 

గరుత్మంతుడు అలాచేసి లోపలకు వెళ్ళి అమృతభాండం ఐందుకొని దేవతల్ని ఇంద్రుణ్ణి ఎదిరించి జయించి "కద్రువ" ఎదుట పెట్టాడు. కద్రువ అమృతాన్ని పొందడానికి తగిన వ్యూహం అంతా తన లౌకికంగా చేసింది. ఇక మరి ఫలితం కలుగుతుందా! ఎలా కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంకోసం ఏ ప్రయత్నం చేయలేదే! గరుత్మంతుడు అమృతభాండాన్ని చూపి అక్కడుంచి, తల్లి దాస్యం వదిలిపోయింది అని చెప్పి ఆమెను తనపై నెక్కించుకొని దేవలోకం వెళ్ళిపోయినాడు. దేవతలు ఆతడి... వేనుకనే వచ్చియున్నవారై కద్రువకు అది దక్కకుండా తీసికొనిపోయినారు. 

ఇదీ గరుత్మంతుని కథలో అంతరాంతరమైన భావం.

గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనమయినాడు. ఇంద్రునకు స్నేహితు డై నాడు. గరుత్మంతుడంటే వేదాలనెరిగి తత్ప్రకారం నడుచుకొనేవాడని అర్థం. వేదాలు ఎన్నో యజ్ఞాలు చేయుమని చెప్పటం ఒక్కటే మనకు తెలును అవి “ఆకర్మ”గా చేస్తే చిత్తశుద్ధియై ఉపనిషద్భావం ఉప్పొంగి, ఐకాంతి. కత్వం కలిగితె మోక్షం పొందడానికి మానవునికి వీలు. అందుకు పరమేశ్వ రుని ఎరిగి భ క్తిచేస్తూ శరీరంతో అకర్మ చేయాలి అన్నాడు భీష్ముడు! అప్పుడు. ధర్మరాజంటాడు ——

No comments:

Post a Comment

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...