Tuesday, September 5, 2017

Story

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన #గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది #మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ #అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.

ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు. ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత #ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.

రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, #హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.

హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?
“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా #సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం) రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు. మన భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. #అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, #oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

ఒకానొకప్పుడు అంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు అక్కడ వున్న తెగను దునుమాడి, వారిని హతమార్చి,  అక్కడ శిధిలాల నిర్మితమైన నవ శకం నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరకా. ఇత:పూర్వం నివశించేవారిని నేటివ్ ఇండియన్స్ అని, ఇండియన్ అమెరికన్ అని, నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. ఇప్పటికీ #హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. చరిత్రలో మరొక ఐతీహ్యం కూడా చెప్పబడుతూ వున్నది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. #Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు(sorcism ) నమ్ముతారు చేస్తారు. #ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది.) . అలాగే అర్జున, పాతాళ యువరాణి ఉలుపివృత్తాంత౦ కూడా వారి వాంగ్మయంలో చిల్లి పెప్పర్ man గా కనబడుతుంది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్యవలసిన అవసరం వున్నది.

ఒకసారి నడిచే దేవుడు కంచి #పరమాచార్య వారు ఒక israel దేశస్తుడిని ఉద్దేశించి వారి మంత్రాలకు మన మంత్రాలకు వున్న సంబంధం వివరిస్తారు. వారు అన్నారు ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. అప్పుడు సంస్కృతానికి పూర్వం వున్న దేవభాష గురించి చెబుతారు. అప్పుడు వారన్నారు మీకందరికీ తాళం కనబడుతోంది. కేవలం మా ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా వున్నాయి అని. ఎంత సత్యమో కదా !!!

No comments:

Post a Comment

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...