Friday, June 30, 2017
Wednesday, June 28, 2017
Health benefits
*భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు*.
*వాటిలో వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి*...
*మట్టికుండలో .... 100%*
*కంచు పాత్రలో ......97%*
*ఇత్తడి పాత్రలో .........93%*
*అల్యూమినయం*
*ప్రెషర్ కుక్కర్ లో...7% లేక 13%*
*కావున మన మందరము ఇత్తడి లేక మట్టి పాత్రలను వాడి తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుగలము*. ...
*మట్టి పాత్రల విశిష్టత*
*వాగ్బటాచార్యులు* చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . అది ఆహారము కాదు విషముతో సమానము . ఈ విషము నిదానముగా పని చేస్తుంది . అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది .
*ప్రెషర్ కుక్కర్* లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగలదు . కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము . అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ* వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్ఛేసింది .
ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది . కానీ ఉడుకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు .
ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏగింజ పండడానికి ఎక్కవకాలం పడుతుందో అదేవిధంగా ఆగింజ వండడానికి ఎక్కవ సమయం తీసుకుంటుంది . గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి . మెత్తబడితే సరిపోదు . ఇది ప్రకృతి ధర్మం , ఆయుర్వేద సిద్ధాంతం .
ప్రాచీన కాలంనుండి భారత దేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి , మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు . ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది . మన శరీరం అంతటా ఉండేది మట్టియే . మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో వున్నాయి . మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్ధాంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు . ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి . 93% లేక 87% న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి , లోపించాయి అని తేలింది . *మట్టిపాత్ర* లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి . ఈ పదార్ధినికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది .
మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు . జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . జీవితాంతం మన శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . అదీ ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు . ఆనందంగా జీవిస్తారు .
మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . ఈ పద్ధతికి అత్యుత్తమైనది *మట్టి పాత్ర* .
*మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం* .
Monday, June 26, 2017
Sunday, June 25, 2017
Saturday, June 24, 2017
Wednesday, June 21, 2017
Friday, June 16, 2017
Thursday, June 15, 2017
Wednesday, June 14, 2017
Monday, June 12, 2017
Thursday, June 8, 2017
Sampoorna mahabharatam telugu pdf
Download sampoorna mahabharatam telugu pdf download
...download here...
Peaceful thoughts
నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడాఅర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే...లోకా సమస్తా స్సుఖినోభవ౦తు....🙏🏼🙏🏼🙏🏼
Peaceful thoughts
*'ఆడ'పిల్ల*
*చాలా బాగుంది*
*ఖచ్చితంగా చదవండి*
అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున!
అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించాడు. పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది.
పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాలసివస్తుంది.
అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరునితరఫువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు.
కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది. శర్మగారికి మధు మేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.
అయితే మగపెళ్ళివారింటిలో శర్మగారు మొమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.
మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాల కులపొడి వేశారు.
మాఇంటిపధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.
మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.
వెంటనే ఏం బయలు దేరుతారు, కొంచెంవిశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు.అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది. కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.
బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు.....'నేను ఏం తింటాను, ఎం తాగుతాను, నా ఆరోగ్యానికి ఏది మంచిది.....
ఇవన్నీ మీకెలాతెలుసు?' అని.
అమ్మాయి అత్త గారు ఇలా అంది....'నిన్నరాత్రి మీఅమ్మాయి ఫోన్ చేసి మీ గురించి అన్నీ చెప్పింది. మా నాన్నగారు మొహమాట పడతారు. వారిగురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది.'
శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.
*అమ్మాయికి కాబోయే అత్తగారువాళ్ళనీ వాళ్ళ మంచి మనసులని కూడా* మెచ్చు కున్నారు.
శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...'లలితా, మా అమ్మ చనిపోలేదు.'
'ఏవిటండీ మీరు మాటాడుతున్నది'
'అవును లలితా, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది......నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్ళతో. మన అమ్మాయి కూడ
వాళ్ళ ఇంట్లొ సుఖంగా వుండవచ్చు
*అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము, మన ఇల్లు వదిలి పోతుందని. తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది. తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకుని.*
*ఆడ పిల్లను బతకనిస్తే ..... అమ్మను గౌరవించినట్లే.....*
~~~~Forwarded~~~~
కూతుళ్ళను గురించి ఒక మంచి ఆర్టికిల్. మీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి
వేద విజ్ఞానం
3. వేద విజ్ఞానం వేదాలలో చాలా విజ్ఞాన విషయాలు గోచరిస్తాయి. కాని పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం విచ్ఛిత్తి పొందడం వల్ల చాలా విషయాలలో వినియోగ ...
-
#story గజపతుల నాటి కథలు కాంట్రాక్టర్ సోమన్న అనే ఈ గజపతుల నాటి కథ. 80 ఏళ్ల ముందు ముద్రించిన పుస్తకంలోనిది. ఇది మిలియన్ బుక్స్ ప్రాజెక్టు నుంచ...
-
ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం... వీలైనంత ఓపికగా చదవండి... ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. అ...
-
Download sampoorna mahabharatam telugu pdf download ... download here ...