Tuesday, May 1, 2018

Health tips telugu

*_వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి!!_*

         _మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!_

*_1. వాకింగ్_* రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

*_2. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

*_3. నిత్యం_* ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

*_4. వాకింగ్_* చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

*_5. డ‌యాబెటిస్_* ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

*_6. నిత్యం_* క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

*_7. నిత్యం_* 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

*_8. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

*_9. బ్యాక్ పెయిన్‌తో_* స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

*_10. నిత్యం_* వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

Health tips telugu

పక్కింటి నుంచి తెచ్చి మరీ కూరలో వేస్తాం... తినేటప్పుడు మాత్రం ఏరేస్తాం...

కరివేపాకు లేకపోతే పక్కింటి నుంచి రెండు రెమ్మలు తెచ్చి మరీ కూరలో వేసి చేస్తాం... తినేటప్పుడు మాత్రం కూరలో నుంచి ఏరేసి మరీ తీసేస్తాం. కరివేపాకు అంత తీసిపారేయదగ్గది కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి.
 
1. ప్రతి ఇంట్లో వేప చెట్టు వుండాలని పెద్దలు చెబుతారు. వేప చెట్టు నుండి వీచే గాలి ద్వారానే పలు రోగాలు నయం అవుతాయంటారు. అలానే కరివేపాకు చెట్టు నుండి వీచే గాలి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతవరణం కాలుష్యభరితం అయినపుడు ఆ ప్రదేశాలలో కరివేపాకు చెట్టు నాటితే వాతవరణం శుభ్రపడుతుంది. 
 
2. కరివేపాకు చెట్టులో ఆకులు, బెరడు, వేరు, గింజలు, పూలు అన్నీ ఔషధ గుణాలు కలిగివున్నాయి. కరివేపాకు పేగులకు, ఉదరమునకు బలాన్నివ్వడమే కాక శరీరానికి కాంతిని కలిగిస్తుంది, రంగునిస్తుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమేకాక, అజీర్తిని నివారించి ఆకలిని పుట్టిస్తుంది.
 
3. ఎలర్జీని కలిగించే వ్యాధులనూ, ఉబ్బసం, ఉదయాన్నే లేచిన వెంటనే తుమ్ములు ప్రారంభం అవుతున్నప్పుడు జలుబుతో తరచుగా బాధపడుతున్నవారూ, ప్రతిరోజ ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తినడం వలన ఎంతో ఉపయోగం వుంటుంది.
 
4. గర్భ ధారణ జరిగిన తరువాత కడుపుతో వున్న తర్వాత కడుపుతో వున్న తల్లికి, బిడ్డకు తగినంత రక్తం అందాలంటే మందులతో పాటు కరివేపాకు పొడిని కూడా యివ్వాలి. బాలింతలకు కూడా ఇది వాడవచ్చు. ఎలాంటి పథ్యము లేదు. రక్త విరేచనాలు, జిగట విరేచనాలు అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వట్టిది వాడటం కంటే మజ్జిగలో కలుపుకొని రెండు లేక మూడుసార్లు వాడితే మంచి ఫలితం వుంటుంది. 
 
5. గ్యాస్ ట్రబుల్ వున్నవారు, కడుపు ఉబ్బరంగా వుండి వాయువులు వెలువడుతుంటే వారు ఆహారంలో తరచుగా వాడుతుండాలి. మొలలు వ్యాధితో బాధపడే వారికి ఈ ఆకు బాగా పనిచేస్తుంది. 
 
6. వేసవి కాలంలో వేడిని తట్టుకునేందుకు, వడదెబ్బ తగలకుండా ఉండేదుకు మజ్జిగలో అల్లం, కరివేపాకు కలిపి తీసుకుంటారు. కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యమునకు పనికివస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు వున్నప్పుడు వాటిపై వ్రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే తగ్గుతాయి. కరివేపాకు కేన్సర్ వ్యాధిలో ఎంతో ఉపయోగకారి అని నవీన పరిశోధనలు చెబుతున్నాయి.
 
కరివేపాకు కారం తయారు చేసే విదానం...
కరివేపాకు ఎక్కువ పాళ్ళు వుండే విధంగా వుంటే మంచి ఫలితం వుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఈ మూడింటినీ విడివిడిగా నేతిలో వేయించాలి. వీటిని మెత్తగా దంచి, మెత్తగా అయిన తర్వాత ఉప్పును తగినంత వేసి భద్రపరుచుకోవాలి. ఏదైనా అల్పాహారం, అన్నములోను ఈ పొడిని కలుపుకొని తినవచ్చు.

Health tips telugu

❇️❇️❇️❇️❇️❇️

💥💥 *Summer* *Health* *tips**

🛑🌞 *వేసవిలో వడదెబ్బ.. చిట్కాలతో నయం* 🌞🛑
🌞 *వేసవి వచ్చిందంటే వడదెబ్బ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ వడదెబ్బకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య మాయమవుతుంది*.

*అవేంటో ఒకసారి చూద్దాం.*

*నీరుల్లిపాయల రసాన్ని కణతలకు, గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగ్గుతుంది.*

*పండిన చింతకాయలను నీటిలో పిసికి ఆ రసంలో ఉప్పు కలిపి త్రాగించవలెను.*

*చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ త్రాగిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.*

*మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది*.

🛑 *బయటకు వెళ్లేముందు:*

*ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఎక్కువ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే ముందు నిమ్మరసం తాగడం ఉత్తమం. లేదా ఒక టీ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా 200 ఎమ్ఎల్ నీటిలో కలుపుకుని తాగడం మంచిది.*

🛑 *మజ్జిగ:*

* మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.*

🛑 *కొబ్బరినీళ్లు:*

*మంచినీళ్లు ఎక్కువగా తాగలేనప్పుడు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.*

🛑 *చింతపండు రసం:*

* చింతపండులో విటమిన్స్, మినరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వేడినీటిలో చింతపండు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిలో పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.*

🛑 *ఆనియన్ జ్యూస్:*

*వడదెబ్బ నివారించడానికి ఆనియన్ జ్యూస్ చక్కటి హోం రెమిడీ. అనేక అధ్యయనాలు, నిపుణులు సన్ స్ట్రోక్‌కి చక్కటి పరిష్కారంగా దీన్నే సూచిస్తారు. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు ఆనియన్ జ్యూస్‌ని చెవుల వెనక భాగం, చెస్ట్ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సలాడ్స్, చట్నీలలో ఉల్లిపాయలు కలుపుకుని తీసుకోవడం మంచిది*

Health tips telugu

🥓🥐 *మన ఆరోగ్యం* 🥐🥓

*🥓జ్ఞాపక శక్తి పెరగాలంటే...*

🥓🥐కొందరు పిల్లలు ఎంత చదివిన గుర్తుంచుకోరు. చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వరకు మతిమరుపు లేని వారు లేరు.  పిల్లలను మంచి ప్రతిభ వంతులను చేయాలని మంచి చదువులు చదివించాలని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటారు.

🥓🥐 చాలా మంది తల్లితండ్రులు మా బాబు సరిగ్గా చదవటం లేదని బాధపడుతుంటారు. మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి.

🥓🥐 *వస,*
🥓🥐 *శొంఠి*
🥓🥐 *మిరియాలు*
🥓🥐 *సరస్వతీ ఆకు చూర్ణం.*

🥓🥐 ఒక్కొక్కటి   10 గ్రాముల చొప్పున తీసుకుని ఇందులో  40 గ్రాముల  పటిక బెల్లం (నవొద్) పోసి, 100 గ్రాముల తేనె కలిపి పాకం కాచి చల్లార్చి రోజు ఒక స్పూన్  చొప్పున తింటూ ఉంటే 40 దినములలో అపారమైన జ్ఞాపక శక్తి

🥓🥐 నోరు రుచి లేకపోవటం (లేదా వాంతులు అయ్యాక నోరు రుచి లేకపోవటం) అనిపిస్తే, ఈ క్రింద చిట్కా ఉపయోగపడుతుంది:

🥓🥐 ఒక చిన్న కప్పుడు నిమ్మకాయ రసంలో సరిపోయినంత (మునిగేంత)  జీలకర్ర, అల్లం ముక్కలు చిన్నవి, సైంధవ లవణం వేసి ఇవన్ని పీల్చుకునేదాక నానపెట్టాలి. అంతే!

🥓🥐 కొద్దిగా నోట్లో వేసుకుని చప్పరిస్తూ తినాలి.

🥓🥐🥓🥐🥓🥐🥓🥐🥓🥐🥓

Health tips telugu

*నేటి తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి తొడ కండరాలు పట్టేయడం. లేదంటే కాలి పిక్కలు కూడా కొందరికి పట్టేస్తుంటాయి. సాధారణంగా చాలా మందికి నిద్రలో ఇలా జరుగుతుంది. ఇక కొందరికైతే రోజులో ఇతర సమయాల్లో కూడా ఈ సమస్య వస్తుంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. వయస్సు మీద పడడం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండడం,*_                          _*వ్యాయామం చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల కూడా తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటాయి. అలాంటి సమయాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ కింద తెలిపిన విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
_*👉మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!*

1. *తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డలు కలిగిన ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.*
2. *కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెలను సమభాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి. నొప్పి తగ్గుతుంది.*

3. *కొబ్బరినూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. అనంతం ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.*

4. *సాధారణంగా చాలా మందికి డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. నీరు తగినంతగా తాగకపోతే ఇలా జరుగుతుంది. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తాయి. అలాంటప్పుడు తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.*
5. *శరీరంలో తగినంతగా పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది.* *మి నవీన్ నడిమింటి*
 
ఆరోగ్యాన్ని పెంపొందించే సబ్జా గింజ‌లు.... అవి ఏం చేస్తాయో తెలుసా...?

వీటి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నింటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవి ఇవే కాబట్టి..! చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయి ఉంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి, జెల్‌లా తయారవుతాయి సబ్జ గింజలు. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట.. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి చూద్దాం..!

* ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు.

* జిగురులా ఉండే ఈ సబ్జ గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.

* కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

* తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.

* రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!

* శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

* క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి..

* గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్నాయా..? ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

* బీపీ మాటిమాటికీ పెరుగుతోందా..? అయితే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది..

* వీటిలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

* బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచ

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది...