❇️❇️❇️❇️❇️❇️
💥💥 *Summer* *Health* *tips**
🛑🌞 *వేసవిలో వడదెబ్బ.. చిట్కాలతో నయం* 🌞🛑
🌞 *వేసవి వచ్చిందంటే వడదెబ్బ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ వడదెబ్బకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య మాయమవుతుంది*.
*అవేంటో ఒకసారి చూద్దాం.*
*నీరుల్లిపాయల రసాన్ని కణతలకు, గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగ్గుతుంది.*
*పండిన చింతకాయలను నీటిలో పిసికి ఆ రసంలో ఉప్పు కలిపి త్రాగించవలెను.*
*చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ త్రాగిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.*
*మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది*.
🛑 *బయటకు వెళ్లేముందు:*
*ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఎక్కువ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే ముందు నిమ్మరసం తాగడం ఉత్తమం. లేదా ఒక టీ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా 200 ఎమ్ఎల్ నీటిలో కలుపుకుని తాగడం మంచిది.*
🛑 *మజ్జిగ:*
* మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.*
🛑 *కొబ్బరినీళ్లు:*
*మంచినీళ్లు ఎక్కువగా తాగలేనప్పుడు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.*
🛑 *చింతపండు రసం:*
* చింతపండులో విటమిన్స్, మినరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వేడినీటిలో చింతపండు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిలో పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.*
🛑 *ఆనియన్ జ్యూస్:*
*వడదెబ్బ నివారించడానికి ఆనియన్ జ్యూస్ చక్కటి హోం రెమిడీ. అనేక అధ్యయనాలు, నిపుణులు సన్ స్ట్రోక్‌కి చక్కటి పరిష్కారంగా దీన్నే సూచిస్తారు. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు ఆనియన్ జ్యూస్‌ని చెవుల వెనక భాగం, చెస్ట్ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సలాడ్స్, చట్నీలలో ఉల్లిపాయలు కలుపుకుని తీసుకోవడం మంచిది*
No comments:
Post a Comment