Tuesday, May 1, 2018

Health tips telugu

పక్కింటి నుంచి తెచ్చి మరీ కూరలో వేస్తాం... తినేటప్పుడు మాత్రం ఏరేస్తాం...

కరివేపాకు లేకపోతే పక్కింటి నుంచి రెండు రెమ్మలు తెచ్చి మరీ కూరలో వేసి చేస్తాం... తినేటప్పుడు మాత్రం కూరలో నుంచి ఏరేసి మరీ తీసేస్తాం. కరివేపాకు అంత తీసిపారేయదగ్గది కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి.
 
1. ప్రతి ఇంట్లో వేప చెట్టు వుండాలని పెద్దలు చెబుతారు. వేప చెట్టు నుండి వీచే గాలి ద్వారానే పలు రోగాలు నయం అవుతాయంటారు. అలానే కరివేపాకు చెట్టు నుండి వీచే గాలి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతవరణం కాలుష్యభరితం అయినపుడు ఆ ప్రదేశాలలో కరివేపాకు చెట్టు నాటితే వాతవరణం శుభ్రపడుతుంది. 
 
2. కరివేపాకు చెట్టులో ఆకులు, బెరడు, వేరు, గింజలు, పూలు అన్నీ ఔషధ గుణాలు కలిగివున్నాయి. కరివేపాకు పేగులకు, ఉదరమునకు బలాన్నివ్వడమే కాక శరీరానికి కాంతిని కలిగిస్తుంది, రంగునిస్తుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమేకాక, అజీర్తిని నివారించి ఆకలిని పుట్టిస్తుంది.
 
3. ఎలర్జీని కలిగించే వ్యాధులనూ, ఉబ్బసం, ఉదయాన్నే లేచిన వెంటనే తుమ్ములు ప్రారంభం అవుతున్నప్పుడు జలుబుతో తరచుగా బాధపడుతున్నవారూ, ప్రతిరోజ ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తినడం వలన ఎంతో ఉపయోగం వుంటుంది.
 
4. గర్భ ధారణ జరిగిన తరువాత కడుపుతో వున్న తర్వాత కడుపుతో వున్న తల్లికి, బిడ్డకు తగినంత రక్తం అందాలంటే మందులతో పాటు కరివేపాకు పొడిని కూడా యివ్వాలి. బాలింతలకు కూడా ఇది వాడవచ్చు. ఎలాంటి పథ్యము లేదు. రక్త విరేచనాలు, జిగట విరేచనాలు అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వట్టిది వాడటం కంటే మజ్జిగలో కలుపుకొని రెండు లేక మూడుసార్లు వాడితే మంచి ఫలితం వుంటుంది. 
 
5. గ్యాస్ ట్రబుల్ వున్నవారు, కడుపు ఉబ్బరంగా వుండి వాయువులు వెలువడుతుంటే వారు ఆహారంలో తరచుగా వాడుతుండాలి. మొలలు వ్యాధితో బాధపడే వారికి ఈ ఆకు బాగా పనిచేస్తుంది. 
 
6. వేసవి కాలంలో వేడిని తట్టుకునేందుకు, వడదెబ్బ తగలకుండా ఉండేదుకు మజ్జిగలో అల్లం, కరివేపాకు కలిపి తీసుకుంటారు. కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యమునకు పనికివస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు వున్నప్పుడు వాటిపై వ్రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే తగ్గుతాయి. కరివేపాకు కేన్సర్ వ్యాధిలో ఎంతో ఉపయోగకారి అని నవీన పరిశోధనలు చెబుతున్నాయి.
 
కరివేపాకు కారం తయారు చేసే విదానం...
కరివేపాకు ఎక్కువ పాళ్ళు వుండే విధంగా వుంటే మంచి ఫలితం వుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఈ మూడింటినీ విడివిడిగా నేతిలో వేయించాలి. వీటిని మెత్తగా దంచి, మెత్తగా అయిన తర్వాత ఉప్పును తగినంత వేసి భద్రపరుచుకోవాలి. ఏదైనా అల్పాహారం, అన్నములోను ఈ పొడిని కలుపుకొని తినవచ్చు.

No comments:

Post a Comment

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...