Friday, January 27, 2023

గజపతుల నాటి కథలు

#story
గజపతుల నాటి కథలు
కాంట్రాక్టర్ సోమన్న అనే ఈ గజపతుల నాటి కథ. 80 ఏళ్ల ముందు ముద్రించిన పుస్తకంలోనిది. ఇది మిలియన్ బుక్స్ ప్రాజెక్టు నుంచి సేకరించి టెక్స్ట్ రూపంలోకి మార్చి అందించడం జరుగుతుంది. ఈ కథ అప్పటి సంస్కృతి వారి యొక్క నిజాయితీ తెలుపడంలో మనకు దోహదపడుతుంది.
కచ్చితంగా చదివి తీరవలసిన కథ....
6. కాంట్రాక్టరు సోమన్న....
దివాను జగన్నాధరాజుగారు తన దగ్గర నున్న కాగితా
లను చూచుకుంటూచే, ఎదుట కొంచెం దూరంలో
చేతులు కట్టుకుని నించుని వన్న దరఖాస్తుదారుని మనవిని వింటూ వున్నాడు,

“మహాప్రభువులు కరుణించాలి! చాలా బీద బ్రాహ్మణుడిని పెద్ద కుటుంబం, ఏమి అధారమూ లేదండి, (పభువుల
అనుగ్రహాంతప్ప ! ఏదన్నా ఉద్యోగం యిప్పించి యీ
కుటుంబాన్ని పోషించాలని ప్రార్థన..

అని ఎదుట నించుని వున్న సోమనాధం వినయ విధేయ
తలతో మనవిచేశాదు,

దివాను సోమనాధం వైవు దృష్టీ మరల్చి “ఏమయినా
ఖాళీలుంకే.. నువ్వింత బతిమాల నక్క న్లేదయ్యా ! మా
సంస్థానం పనీ జరగవలసిందేగా ! అయితే కేమీ! ఇప్పుడే
మిన్నీ ఖాళీలు లేవ” అని అన్నాడు.

సోమనాథం. చేతులు నులువుకుంటూ “చిత్తం,
చిత్తం! ప్రభువులు తలుచుకుంటే ఏ ఖాళీ అన్నా వస్తుంది,
ఈ బీదకుటుంబం వొక్కటి పోషించడం ప్రభువులకి ఒక
'లెక్కలోనిది కాదు' అన్నాడు,

దివాను నిదానించి చూస్తూ “నీ గోడు నువ్వు చెప్పడం
 సబబుగానే ఉంది కానీ నేను తలుచుకుంటే ఏ కాళీ అయినా వస్తుందం సరిగా లేదు. నీకు ఖాళీ కావాలంటే ఎవరినైనా భర్తరఫు (remove) చేయాలన్నమాట నీలాంటి బీదవాడి కుటుంబ పొట్ట మీద కొట్టాలన్నమాట కదూ! విజయనగర సంసారంలో అటువంటి పని ఎన్నటికీ జరగదు అన్నాడు. సోమనాదం గడగడలాడిపోయాడు చిత్తం చిత్తం మరొకరిని భక్తులకు చేసి ఆ పని నాకు పెంచాల్సిన నేను కోరలేదు ప్రభు. సర్వేజనా సుఖినోభవంతు! ధర్మ సంస్థానంలో అలాంటి పని ఎన్నటికీ జరగదు అని తెలుసు. ప్రభువు తమ తెలిస్తే ఏదో ఒక పని కల్పించగలరని ధర్మసంస్థానం ఒక బీద కుటుంబం మలమల మాడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోదని ధైర్యంతో అలా అన్నాను. ప్రభు జగన్నాధ రాజు గారు కొంచెం ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఏమీ కాయంగా ఉండే నౌకరీలు లేవు అయినా ఆలోచిస్తాం. నువ్వు ఏమి చేయగలవో చెప్పు.
 
 చిత్తం చిత్తం నేను కొంతకాలం ఒక కోమటికు గుమస్తాగా పనిచేశాను. చీఠా ఆవర్జాలు (accounting) బాగా వ్రాయగలరు. ఎలాంటి లెక్కలైనా సులభంగా చేయిస్తాను తికమకల్లో ఉన్న లెక్కల్లో శీఘ్రముగా చిక్కు విడదీయగలను. ఆ కోమటి తన కుమారునికి తరిఫీది ఇవ్వమని చెప్పి వాడు. 
అన్నీ చాగా (గ్రహించాక నాకు ఉద్వాసన
ఇెప్పాడండీ!”

*ఏవయినా ఇళ్లు కట్టించే అనుభవం వుండా? ఏపని
వాళ్లకి ఎంత యిస్తే గిట్టుబాటు అవుకుందో-పని లోటూ,
లొసుగూ లేకుండా జరుగుతుందో తెలుసా!”

“చిత్తం, చిత్తం. చాగా తెలుసునండి, మా సెట్టి
గారు కట్టించిన భవంతిపని నా చేతిమిదుగా నే జరిగింద డి!

అణా, పైసలుతో కూడా లెక్కలు సమంగా అప్పగించే
చాడిని, ఆయన చాలా సంతోషించి నాకు పట్టుశాలీ పంచెలచాపు బహుమానంగా యిచ్చారండి, పని పసందుగా వుందంటూ కితాబు యచ్చారండి.”

“సరే! యిప్పుడు సంస్థానంవారు భీముని పట్నంలో (bheemili)
సముద్రపువొడ్డున_ ఒక బంగళా కట్టించదలచుకని
వున్నారు. ఆ పని చేయించే పూచీ పడితే పని అప్పగిస్తాను,
శావలసిన వస్తువులూ, కలపా మొదలయినవి తగిన ఖరీదుకి సులభంగా సప్లయి అయేటట్లు మేం తాఖీదులు యిస్తాం, ఆరు నెలలు. దాటకుండా బంగళా పసందుగా తయారు కావాలి”
“చిత్తం, చిత్తం, తప్పకుండా తమ ఆజ్ఞ నెర
'వేరుస్తానండి, (ప్రభువులు మెచ్చుకు నేటట్లు చేయిస్తాను.”
“నువ్వు ఆరు నెలలపాటు ఆ పనిని చూడవలసి
వుంటుంది, అహోరాత్రాలు దానిమీదనే కన్ను వుంచాలి,

యాభై వేలు (50,000) దాటకుంకా అయేటట్లు కూడాలి, ఇది నచ్చినట్లు అయితే పని పారంభించవచ్చు”

“చిత్తం. చిత్తం. ప్రభువుల అజ్ఞకి వ్యతిరేకంగా
చెప్పడానికి ఎవరికి సాధ్యమండి; ఏలినవారు. ఎలాతో స్తే అలా అజ్ఞాపించవచ్చు.”

“సరే! సాయంకాలం కనపడు ; అక్కడి ఠాణేడారుకి
'తాఖీదు వ్రాయించి ఉంచుతాము. నువ్వు అడిగినప్పుడల్లా అవసరమైనంత సొమ్ము అతను నీకు ఇస్తూ వుంటాడు, అక్కడి
నౌకర్లు కూడా నీకు సహాయంగా ఉండేటట్టు ఏర్పాటు
చేయిస్తాము.


భీముని పట్నంలో విజయనగరం మహారాజావారి
బంగళా పని సోమనాధం యాజమాన్యం కింద చాలా చురుకుగా జరుగుతున్నది.

.. సోమనాథం తన కుటుంబంతో
కూడా భీముని పట్నంవచ్చి ఒక చిన్నయిల్లు అద్దెకు నిర్ణ
యించుకుని కావురం పెట్టాడు.

రమారమి "రెండు నెలలు గడచాయి.

సోమన్న యిలా శ్రద్ధగా పని చేయిస్తున్నాడు.

దివానుగారి. అజ్ఞ ప్రకారం అతడు. పనికి కుదురు
కున్నాడు; కాని ఈ పనివల్ల తన కెటువంటి లాభమో అత
నికి తెలియదు. ఇంత జీతం యిస్తామని దివానుగారూ చెప్పను లేదు. ఇంత ఇవ్వాలంటూ సోమన్న అడగలేదు. రెండు నెలలు కావచ్చిన ఒక నెల జీతమైనా అందక చాలా ఇబ్బంది పడుతున్నది ఆ బీద కుటుంబం. 
బంగాళా పని నిమిత్తం సోమన్న చేతిలో వేలకొద్దీ డబ్బు ఆడుతూ ఉండేది కానీ అందులో నుంచి ఒక దమ్మిడి కూడా అతను ముట్టడు అలా తీసుకోవడం ద్రోహం అని అతని భావన.
రెండు నెలల జీతము ఒక్కసారిగా వస్తుందని ఆ విషయమై దివాను గారికి దరఖాస్తు పంపడం మర్యాద కాదని సోమన్న అనుకున్నాడు.
 కుటుంబం అవసరాల కోసం చిల్లర అప్పులు చేయవలసి వచ్చింది. రోజులపై రోజులు వారాల మీద వారాలు నెలల మీద నెలలు గడిచి పోతున్నాయి. బంగాళా పని చాలా చురుకుగానే జరిగిపోతున్నది కానీ సోమన్నకు మాత్రం జీవితంలో ఒక దమ్ముడి కూడా అందలేదు. అతను మనసులో చాలా కష్టపడ్డాడు అయినా ఎవరితోని ఈ సంగతి చెప్పడం లేదు బంగాళా పూర్తి అయ్యాక మొత్తంమీద లెక్కలు ఒక్కసారిగా ఇవ్వవచ్చని అనుకున్నాడు. ఇంటి ఖర్చులకోసం అతడు తన దర్భ ముడి ఉంగరానే కాకుండా భార్య మెడలోని మంగళసూత్రాల దగ్గర నుంచి అమ్మ వలసి వచ్చింది ఆ ఇల్లాలు పసుపు కొమ్మ మెడలో కట్టుకోవాల్సి వచ్చింది. బంగాళా పసందుగా తయారైంది.
  ఆ సంగతి సోమన్న దివాన్జీ గారికి తెలియజేశాడు ఐదు నెలలకే అంత పెద్ద బంగళా పూర్తి కావడం దివాను గారికి చాలా సంతోషం కలిగించింది. ఆ మరునాడే ఆయన బంగళాను చూడడం కోసం భీమునిపట్నం వచ్చాడు. సోమనాదం దివాను గారికి బంగళా నాలుగు మూలలకి తీసుకువెళ్లి తాను ఏవిధంగా పని చేయించినది వివరించి చెప్పాడు. దివాను గారు మనసులో చాలా సంతోషించిన బయటికి ఏమి చెప్పడం లేదు. ఆమామ్ బాపతులు ఎంత అయ్యింది ఆయన సోమన్నను అడగను లేదు. సోమన్న తనంతట చెప్పడానికన్నా ఆయన అవకాశం ఇవ్వలేదు.
   రెండు మూడు రోజుల లెక్కలతో పాటు విజయనగరం రావలసింది అంటూ ఆయన తాకీదు మాత్రం ఇచ్చాడు. తన జీతం సంగతి ఏమి చెప్పలేదు అది సోమన్నకు చాలా కష్టం అనిపించింది. విజయనగరం వెళ్లిన మీదట తన సంగతి అంతా మనవి చేద్దామని మనసులో నిశ్చయించుకున్నాడు. దివాను గారు వెళ్లిపోయారు ఆయన ముభావం సోమనాధినికే కాకుండా అతని మీద అభిమానం ఉన్న మరి కొంతమందికి కూడా కష్టమని అనిపించింది. అప్పటికప్పుడే ఆ ఊరిలో కొన్ని వదంతులు పుట్టి నాలుగు మూలలకి అల్లుకున్నయ్. సోమనాదం తగిన మర్యాదలు జరపడం లేదని అందుకనే దివాను గారు ముభావంగా ఉన్నారని కొందరు అనుకున్నారు. బంగళా పని ఆయన సుతారామూ నచ్చలేదని అందుకోసమే తగిన సంజాయిషీ ఇవ్వడానికి విజయనగరం రావాలిసిందంటూ తాఖీదు చేశాడని మరోపక్షం వారి అభిప్రాయం.
    సోమనాదం చాలా డబ్బు కాజేశాడని దివాను గారి అనుమానమని అందుకోసమే లెక్కలతో హాజరుకావాలని అన్నారని మరికొందరి ఊహాగానం.
     ఇవన్నీ సోమనాదం చెవి సోకినాయి అతని ధైర్యం కొంత సడలింది మనసు పరిపరి విధాలుగా పోయింది. ఏమీ నిశ్చయించుకోవడానికి సాధ్యం కాలేదు ఇంతకు తనకు రావలసిన జీతం రాదేమో అని పెద్ద అనుమానం. అతని మనసులో ప్రవేశించింది తాను తన కుటుంబం మలమల మాడుతూ ఎంతో విశ్వాసంతో పనిచేసే వచ్చిన ప్రతిఫలం ఇదా అంటూ మనసులో సోమనాదం కృంగిపోయాడు!
      సోమనాథం జంకుతూ జంకుతూ దివాను గారి కచేరి నావిట్లో ప్రవేశించాడు అక్కడ దివాన్ గారు ఒక్కరూ ఏవో కాయితాలు చూసుకుంటున్నారు సోమనాధాన్ని చూసి అతడు వణుకుతున్న చేతులతో చేసిన నమస్కారాన్ని అందుకొని కూర్చోమని ఆజ్ఞ చేశారాయన కానీ. సోమనాదం కూర్చోకుండా నిలిచి ఉండి దివాను గారి నోటు నుంచి ఏ వాక్యాలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దివాన్ గారు సోమనాదం వైపు నిదానించి చూశారు ఇన్నాళ్ళ నుంచి అతను పడుతూ ఉండి కష్టము అతనిలో కనబడుతూ ఉంది చాలా చిక్కిపోయాడు. అతని మొఖం మీద నిరాశ తాండవిస్తున్నది. దివాను జగన్నాథ రాజు గారు సంగతంతా గ్రహించారు. ఇది వరకు కూడా ఇతరుల వల్ల సోమనాదం స్థితులు గతులన్నీ విని ఉన్నాడు. సోమనాదం ఆ లెక్కల కాగితాలు ఇలా ఇచ్చి నువ్వు అబ బెంచి మీద కూర్చుని కాస్త విశ్రాంతి తీసుకో..
       చిత్తం చిత్తం అంటూ సోమనాదం కాగితాలు అందించే జంకుతూ బెంచ్ మీద కూలబడ్డాడు ఆ లెక్కలు చూసి దివాను గారు ఆశ్చర్యపడ్డారు 50 వేలు పైచిలుకు ఖర్చు కాగలదనుకున్న మంగళ పాతిక వేళలోపే తయారు అయినట్లు లెక్కలు స్పష్టంగా కనబడుతున్నాయి. సోమనాదం బంగాళా ఎంతో కావాలని మొదట చెప్పి ఉన్నాము జ్ఞాపకం ఉందా...
        చిత్తం చిత్తం 50,000 అన్నట్లు గుర్తు అయితే ఈ లెక్కలు ఏమిటి పిచ్చి బ్రాహ్మణుడా... అంటూ ఆ కాగితాలన్నీ పర పర అనే చింపి వేశారు సోమనాధానికి ఏమీ అర్థం కాలేదు నువ్వు బంగాళాలు చాలా బాగా కట్టించినందుకు చాలా సంతోషిస్తున్నాం ..
        50,000 ఖర్చుపెట్టిన అలా కట్టించలేరు.
         చిత్తం చిత్తం అది ఏలిన వారి కటాక్షం నువ్వు చాదస్తపు బ్రాహ్మణుడైతే ఇలా పిచ్చిపిచ్చిగా లెక్కలు వేశావు. మరొకరు అయితే 50వేలకి కిట్టించి ఉందురు. సోమనాదం ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఒక్క దమ్మిడి అయినా ముట్టుకోకుండా నానా కష్టాలు పడి కాలం గడిపావు. మేము జీతం ఏదైనా ఏర్పాటు చేసి ఉంటామని బ్రాంతిపడి ఉంటావు. ఇలాంటి వాటికి జీతం పద్ధతి ఏర్పాట్లు లేదు....
          సోమనాదం నిలువునా నీరసం ఐపోయాడు దివాన్ ఏమి అంటున్నది అతనికి అర్థం కాలేదు అయినా నువ్వు నిరుత్సాహ పడవద్దు ఇలా పని చేయించినందుకు నీకు తగిన ప్రతిఫలమే ముడ్తుంది.
           50వేల పనిని పాతిక వేళలో ముగించి సంస్థానం వారికి లాభం చూపించినందుకు నీకు 5000 కట్టడం గా ఇస్తున్నాము సోమనాదం ఆనందం పట్టలేకపోయాడు. నిజమే నిజమే అతని నోటి నుంచి అప్రయత్నంగా రెండుమూటలు వెలుపడ్డాయి ...
           నిజమే ఇందులో అబద్ధం ఏమీ లేదు నువ్వు కాంట్రాక్టర్ అనుకో నీకు ఈ బంగాళా కట్టించడానికి 30000 కి గుత్త కిచ్చినామనుకో నువ్వు ఎంత ఖర్చు పెట్టినది మాకు అనవసరం. మా కోరిక పని పసందుగా ఉండడమే మాకు కావాలి. నువ్వు పాతికవేలే ఖర్చు చేస్తే మిగిలినది 5000 నీకు లాభం అన్నమాట. సోమనాదం ఏదో చెప్పబోయాడు మరి నువ్వు మాటలాడకు. నీ వంటి చాదేస్తుంది నేనెక్కడ చూడలేదు రేప్పొద్దురా 30 వేలకి లెక్కలు కిట్టించి తీసుకురా 30000 కి నీకు కాంట్రాక్టుకు ఇచ్చినట్లు వ్రాసి ఉన్న ఈ అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం చెయ్యి. నువ్వు పని ప్రారంభించిన తేదీ వెయ్యి. రేపు పొద్దున వచ్చి ఆ కాయితాలు ఇచ్చి ఐదు వేలు తీసుకువెళ్ళు. సోమనాదం కృతజ్ఞతతో చిత్తం చిత్తం ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదండి ప్రభువు అని మనవి చేశాడు.. ఇంతే కాదో నీకు రేపటి నుంచి ఇంజనీరు డిపార్ట్మెంట్లో నెలకొన్న 40 రూపాయల ఉద్యోగం ఏర్పాటు చేయబడింది.. సోమనాదం ఆనందంతో ఆకాశం అందుకున్నాడు....

Wednesday, January 18, 2023

story behind ancient indian temple sculptures

గురువు గారి ఆధ్వర్యంలో యుద్ధ విద్య నేర్చుకుంటున్న శిష్యులు
పశ్చిమ నుంచి వచ్చిన ఎడారి దేశాల వ్యక్తి సహజంగా వీరు గుర్రాల్ని అమ్మకం లు చేసేవారు. వీరి యొక్క ప్రస్తావన మహాభారతంలోనూ రామాయణంలోనూ చూడవచ్చు సహజంగా వీరి దేశాల గుర్రాలు చాలా బలిష్టంగా ఎత్తుగా వేగంగా ఉండేటివి. కాబట్టి అరేబియన్ గుర్రం అనే నానుడి ఉండేది.
యుద్ధంలో సింహంని కుమ్ముతున్న ఏనుగు. 
గానం మరియు గీతంలో తాళం వేస్తున్న యువతి
ఆ మధ్యలో మనిషి దేహం నెమలి వెనక భాగం లాంటి జీవినే కిన్నెరులు అందరు వీరు వాద్య పరికరాలతో గానం చేసేవారు అని పురాణాలలో ఉంది. రాను రాను అప్పటిలో వేట వల్ల వీరి యొక్క సంతతి తగ్గిందని వీరు చాలా బలహీనంగా ఉండేవారని మూలం. ఆ పక్కనే ఉండే జీవుల గురించి కూడా మనం రాను రాను మాట్లాడుకుందాం. పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని సగం మనిషి సగం జంతువుగా ఉండే జీవులు చాలానే కనిపిస్తాయి ఉదాహరణలు వ్యాగ్రపాదుడు, పతంజలి, అశ్వినీ దేవతలు వీరంతా వీరి గురించి కూడా వచ్చే కాలంలో మాట్లాడుకుందాము. బహుశా దేవతలు గాని దేవతల యొక్క వైద్యులు గాని ప్రయోగాల ద్వారా సృష్టించి ఉండవచ్చు. అశ్వినీ దేవతలు ఒకసారి ఒక మహర్షి తల తీసి గుర్రం తలని తర్వాత ఆ గుర్రం తల తొలగించి తిరిగి అదే మనిషి తలని అతికించడం మన పురాణాల్లో ఒక చోట గమనించవచ్చు.
నాట్యము వాయిద్యము మరియు వివిధ కళలు.
ఒక ఆధునిక ఆయుధం పట్టుకొని ఉన్న యోధుడు. అది రెండు వైపులా తెరుచుకో గల ఆయుధం. జీవి గురించి తర్వాత మాట్లాడుకుందాం
యాజి అనబడు పురాతన జంతువు బహుశా ఇది అంతరించిపోయి ఉండవచ్చు ఇది సింహం యొక్క శరీరం ఏనుగు యొక్క తలతో ఉండును
శ్రీ హనుమంతుల వారు ఇది గమనిస్తే పురాతన హనుమంతుని విగ్రహాల్లో ఏ చోట గాని ఏ గద గాని మరే ఇతర ఆయుధం గాని కనబడదు ఎందుకంటే అతని యొక్క చెయ్యే ఒక పెద్ద ఆయుధం.
శ్రీ లక్ష్మీ అమ్మవారు చెంచు రూపంలో ఉన్నప్పుడు నరసింహ వారు బుజ్జగిస్తున్న దృశ్యం
ఇందులో ఎడవైపు పై భాగంలో వృద్ధ గురువుగారిని శిష్యుడు తీసుకు వెళ్తున్న దృశ్యం.
దాని కింద వెన్న చిలుకుతున్నా శ్రీ యశోద అమ్మవారు దాని తింటున్న చిన్ని కృష్ణుడు.
 దాని కింద మురళి వాయిస్తున్న కృష్ణుడు.

దాని ప్రక్కన వేటకు వెళ్లి జంతువుల్ని కొట్టి తెస్తున్న అటవీ స్త్రీలు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే స్త్రీలు కూడా అప్పట్లో యుద్ధము మరియు వేట  చేసేవాళ్ళు వారు ఏమాత్రం పురుషులకి తక్కువ కాదు పురుషులు ఎప్పుడూ వారిని తక్కువగా చూడలేదని బొమ్మ సాక్ష్యం
దాని పక్కన గాక పక్కన వేటకు వెళ్ళినప్పుడు గుచ్చుకున్న ముల్లును తీసుకుంటున్న స్త్రీ
మరికొన్ని రెఫరెన్సెస్ తర్వాత పోస్టులో....

Temple : ahobilam
Coordinates: 15°08'01"N 78°40'27"E

Thursday, January 5, 2023

Mahabharatam and behind science

*🧬శాస్త్రవేత్తలకే అంతుచిక్కని🤷🏻‍♂️ సైన్స్ మహాభారతంలో*
 *ఏంటో 🤔చూద్దాం పదండి*

👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

 *5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంసృుతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.*

👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి *5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏదీ రాకపోవడం విచిత్రం.*

👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ కనుక్కోని విషయాలను ఎన్నో మనకు మహాభారతం చెపుతుంది. 

వాటిలో కొన్ని:

*👉మహాభారతంలోని ఆదిపర్వంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.*

👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు *నియోగ ధర్మం* ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి *విదురుడు జన్మించడం.*

*👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా.?*

👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది. మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.
*1974లో  అయోవ యూనివర్సిటీలో *డోనాల్డ్ లాకె* అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, *స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితులే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.*

👉నేడు మనం వాడే *స్పెర్మ్ డొనేషన్* ఆనాటి
 *నియోగపద్ధతి ఒకటే.*

గాంధారి కుంతిపై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది.
👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ ప్రేమ; స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.

*👉 వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.*

 పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.*స్లైసింగ్ ఎంబ్రియో*

2.*ఆర్టిఫిషియల్ యూటర్నెస్* కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 

3. *మదర్ టచ్*

*👉 టెస్ట్ ట్యూబ్ బేబీలుగా పుట్టిన వారు - వశిష్ఠుడు, అగస్త్యుడు, ద్రోణాచార్యుడు, క్రుతుడు, కృపి. 

అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి, గర్భాశయం బయట చుట్టూ పోషకాలనుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా.!

*👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు* అంటే ప్రత్యేకమైన కుండలో పుట్టినవాడు అని అర్థం.

ఇక శిఖండి పాత్ర :-
 *Transgender*  *Trans sexual* *లింగ మార్పిడి*
మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముడిని చంపేందుకు అంబ శిఖండిగా మారింది. మొదటి ఆడ పిల్లగా పుట్టి; మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే *Transsexualism* ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు *సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది.* అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.

*బృహన్నల పాత్ర :-
*Temporary Trans-sexualisum* ఇప్పటి మోడర్న్ సైన్స్ లో *hermaphroditism*
అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.

*ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు :-
యోగ మాయ ద్వారా *రోహిణి గర్భం లోకి మార్పు  చేయ బడిన ఎంబ్రీయో ద్వారా ఇది సాధ్య పడింది.

దీనికి నేటి సైన్సు వివరణ :-
*Effortless reciprocal IVF* అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ *3 నవంబర్ 2018 ఈనాడు పేపర్* తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ ఇద్దరు యువతులే కదా ఎలా కంటారు, ప్రకృతి ఒప్పుకోదు కదా.! 

కాని దీనిని *Bedford hospital in Texas* వాళ్ళు చేశారు.
IVF ద్వారా ఎంబ్రియో - కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో; మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో; పెరిగిన బిడ్డను కన్నారు.

*జరాసంధుడు పాత్ర*-
 జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.

ఈమధ్య మోడ్రన్ మెడిసిన్ లో *Replantation surgery* యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.

*1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని అతికించారు, award కూడా పొందాడు.*

*అర్జునుడు ప్రయోగించిన "సమ్మోహనాస్త్రం" మరొక విచిత్రం. దీనిని ఉత్తర కుమారుడితో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయంలో తను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. (నర్తనశాల సినిమాలో మనకు చూపించారు).
 
ఇలాటిదే మనకు 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, (ఆంధ్రప్రదేశ్), PC సర్కార్ లాంటి వాళ్ళు చేసి చూపారట.

*మహాభారత యుద్దం సమయంలో ఇలాటివే అనేక అస్త్ర, శాస్త్రాలూ ఉపయోగించారన్నది మనం చదివాము. 
ఉదా:- బ్రహ్మాస్త్రం,  నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం etc*

ఇలాటిదే  world war-02 లో 06-Aug-1945 హీరోషిమా; నాగసాకిపై జరిపిన అణు విస్ఫోటనం*

👉  Physics సూత్రాలు 
*నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః* అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాన్ని  పుట్టించలేం.

👉పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. E=mc2

*👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే, గీతలో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.*
 ఆటంబాంబ్ విస్ఫోటనంతో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం. అంధుడైన  ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపాన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అంధులకు కూడా కనిపించేంత శక్తి అదీ. 

మహాభారతంలో *భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు.  

ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది వేల సం॥ క్రితమే మన పూర్వులు చేసారు.

*AA Garbosky అనే scientists* హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు
ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. *మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు. కానీ, వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు, అని చెప్పారు.*

*👉 మాక్రో, మైక్రో  వైజేశన్ -- శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల (పెద్ద), సూక్ష్మ (చిన్న) రూపం.*

*ఎందరో విదేశీయులు మహాభారతంలో గుర్తించిన విషయాలను మన దేశంలోని ప్రస్తుత తరం వారు  గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్; టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.*

*ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, అని చెప్తారు. ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.*

*మన దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కనుక్కున్నాము అని నమ్మిస్తే మనం కూడా వారికి జైజైలు కోడుతున్నాము.*

*ఇప్పటికైనా  ఆలోచిద్దాం భావితరాలకు మన పురాణ ఇతిహాసాల లోని గొప్పదనాన్ని వివరిద్దాము.*

                    *🚩జై హింద్🤝జై భారత్🇮🇳*
                               శుభోదయం
పిల్లాడి రుద్రయ్య
      
                   🌹🙏🌹🪔🪔🪔🌹🙏🌹

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది...