గురువు గారి ఆధ్వర్యంలో యుద్ధ విద్య నేర్చుకుంటున్న శిష్యులు
పశ్చిమ నుంచి వచ్చిన ఎడారి దేశాల వ్యక్తి సహజంగా వీరు గుర్రాల్ని అమ్మకం లు చేసేవారు. వీరి యొక్క ప్రస్తావన మహాభారతంలోనూ రామాయణంలోనూ చూడవచ్చు సహజంగా వీరి దేశాల గుర్రాలు చాలా బలిష్టంగా ఎత్తుగా వేగంగా ఉండేటివి. కాబట్టి అరేబియన్ గుర్రం అనే నానుడి ఉండేది.
ఆ మధ్యలో మనిషి దేహం నెమలి వెనక భాగం లాంటి జీవినే కిన్నెరులు అందరు వీరు వాద్య పరికరాలతో గానం చేసేవారు అని పురాణాలలో ఉంది. రాను రాను అప్పటిలో వేట వల్ల వీరి యొక్క సంతతి తగ్గిందని వీరు చాలా బలహీనంగా ఉండేవారని మూలం. ఆ పక్కనే ఉండే జీవుల గురించి కూడా మనం రాను రాను మాట్లాడుకుందాం. పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని సగం మనిషి సగం జంతువుగా ఉండే జీవులు చాలానే కనిపిస్తాయి ఉదాహరణలు వ్యాగ్రపాదుడు, పతంజలి, అశ్వినీ దేవతలు వీరంతా వీరి గురించి కూడా వచ్చే కాలంలో మాట్లాడుకుందాము. బహుశా దేవతలు గాని దేవతల యొక్క వైద్యులు గాని ప్రయోగాల ద్వారా సృష్టించి ఉండవచ్చు. అశ్వినీ దేవతలు ఒకసారి ఒక మహర్షి తల తీసి గుర్రం తలని తర్వాత ఆ గుర్రం తల తొలగించి తిరిగి అదే మనిషి తలని అతికించడం మన పురాణాల్లో ఒక చోట గమనించవచ్చు.
ఒక ఆధునిక ఆయుధం పట్టుకొని ఉన్న యోధుడు. అది రెండు వైపులా తెరుచుకో గల ఆయుధం. జీవి గురించి తర్వాత మాట్లాడుకుందాం
యాజి అనబడు పురాతన జంతువు బహుశా ఇది అంతరించిపోయి ఉండవచ్చు ఇది సింహం యొక్క శరీరం ఏనుగు యొక్క తలతో ఉండును
శ్రీ హనుమంతుల వారు ఇది గమనిస్తే పురాతన హనుమంతుని విగ్రహాల్లో ఏ చోట గాని ఏ గద గాని మరే ఇతర ఆయుధం గాని కనబడదు ఎందుకంటే అతని యొక్క చెయ్యే ఒక పెద్ద ఆయుధం.
దాని కింద వెన్న చిలుకుతున్నా శ్రీ యశోద అమ్మవారు దాని తింటున్న చిన్ని కృష్ణుడు.
దాని కింద మురళి వాయిస్తున్న కృష్ణుడు.
దాని ప్రక్కన వేటకు వెళ్లి జంతువుల్ని కొట్టి తెస్తున్న అటవీ స్త్రీలు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే స్త్రీలు కూడా అప్పట్లో యుద్ధము మరియు వేట చేసేవాళ్ళు వారు ఏమాత్రం పురుషులకి తక్కువ కాదు పురుషులు ఎప్పుడూ వారిని తక్కువగా చూడలేదని బొమ్మ సాక్ష్యం
దాని పక్కన గాక పక్కన వేటకు వెళ్ళినప్పుడు గుచ్చుకున్న ముల్లును తీసుకుంటున్న స్త్రీ
మరికొన్ని రెఫరెన్సెస్ తర్వాత పోస్టులో....
Temple : ahobilam
Coordinates: 15°08'01"N 78°40'27"E
No comments:
Post a Comment