లైగరు చిత్రముపై నా యొక్క సమీక్ష....
లైగరు చూని నా పొగరు అణిగినది. రక్తకన్నీరు కారినది...
ఈసారి పూరన్న. పూరి మాడగొట్టిండు...
మరి విషయమునలోకి వచ్చెదము...
ట్రింగ్..ట్రింగ్..
అఖిల భారత పూరి అభిమాన సంఘ అథ్యక్షుడు: అయ్యా పూరి గారు ఏంటి అండి ఈ మధ్య ఖళాఖండములు
తీయుట లేదు తమరు!
పూరి : లేదు లేదు... నాలో చిత్ర దర్శకుడు ఇంకను చావలేదు. ఈసారి ఒక గొప్ప ఖళాఖండముతో వచ్చెద...
కాచుకొనుము:
అ.భా.పూ.అ.న.అ: బాగు బాగు ఈసారి మాకు పండగే అన్నమాట. ఇంక సెలవు. 100 రోజుల విజయ నభలో
కలిసెదము.
పూరి:నా అభిమానులను అలరించని ఈ బ్రతుకు వ్యర్థము. వెంటనే ఒక ముత్యమునకు శ్రీకారము చుట్టెద.
వెంటనే నేను ధాయిలాండు అను ప్రదేశమునకు వెళ్ళి సముద్ర ఓడ్డున ఓక కథను వండెదను.
కావున భార్య దగ్గరకు వెళ్ళి ధనమును సమకూర్చెదను.
ఓ..శ్రీమతి నేను మరియొక కళాఖండమునకు
తీయుట సంకల్పించితిని.
కావున నాకు ధనము ఇవ్వుము.
భార్య: బాగు బాగు ఇంకను మీరు తీసిన చిత్రములు చాలు. వెళ్ళుము...
పూరి: హకటా! ఎంత కష్టము వచ్చినది. భార్య..పుత్రుడు నన్ను ఛీ..కొట్టిరి..ధనము లేదు కావున ఈసారి
బ్యాంకాక్ లో .. కాకుండా... బ్యాంక్ ప్రక్కన ఉన్న సత్రము గది లో ఉండి. రాసెద....
కథ: కధానాయకుడిది ఓక కరీంనగరులోని ఓక కుగ్రామము. వారి పూర్వికులు ఉన్న ఆస్తిని కష్టపడి కరిగించిరి.
దానిని చూచి వారి నాన్న కాలము చేసిరి.
కథానాయకుడి అమ్మ
మంచి సంప్రదాయ వ్యక్తి కుమారుడికి మంచి మాటలు చెప్పి చక్కగా పెంచెను. అతనికి అన్ని శతకములు కంఠస్థము. పెద్దవాడయ్యెను అలాగే ఆమె మంచి తెనుగింటి సంప్రదాయబద్ద
అమ్మాయిని చూచి పెళ్ళి చేసినది.
కొడుకు మరియు కోడలు చక్కగా ఉండును. ఆమె కోడలు వచ్చిన అతిధిలను సేవించుకొని దానము ధర్మమును చక్కగా నిర్వర్తించుకొను చక్కటి ఇల్లాలు.
ఇంక కొడుకు ఉద్యోగ నిమిత్తము వారు అందరూ కుటుంబముతో సహా భాగ్యనగరమునకు విచ్చేసిరి. కథానాయకుడికి అన్ని కోరికలు తీరినవి కాని అతనికి చిన్ననాటి కోరిక మాత్రము తీరలేదు అది బాక్సింగ్ చేయాలని
అందులో ఉత్తీర్ణుడు కావాలని. దానిని చూచిన వారి అమ్మ కడు ఆవేదనకు లోను అయ్యెను. దానితో ఆమె దగ్గర ఉన్న బంగారము తనఖా పెట్టి ఆ సొమ్ముతో అతనికి తగు అభ్యాసమును ఇప్పించి కుమారుడిని బాక్సింగు రింగు లోకి పంపించి అతను మహామహులనే ఓడించి అతని జీవిత కాల కోరికను నెరవేర్చుకొని మరియు అతని కుటుంబమునకు మరియు తాను పుట్టిన గ్రామమునకు మంచి పేరొసెంగెను. ఇది సంయుక్తము గా కథ.
పాటలు కొన్ని : 1.అక్కడా ..ఇక్కడా..జన్మభూమి గొప్పను చాటించు...
2.కొకిలమ్మ ఇచ్చెను కొండంత అండ...
3.వాన లాగ దూసుకుపో...
కథ పూర్తి అయినది. ఇక నటీ నటులు కావాలి. దానికి ఈమద్య ప్రాచుర్యం పొందిన విజయ్ దేవరకొండను పరిగణలోకి తీసుకొంటా...కధా నాయకి పల్లవి సాయి బహు ముచ్చటగా
ఉండును. అమ్మ పాత్రకు అన్నవూర్ణమ్మ అయితే బాగుంటుంది.
ఇక కథను చర్చించెదము....
తరువాతి వారము....ఒక హోటల్ గదిలో
పూరి: ఇది కధ విజయ్ ఎలా ఉన్నది
విజయ్: బాగానే ఉన్నది కాని ఇది ఇప్పటి కాలమునకు చెందినది లాగా లేదు. అలాగే మానవతా విలువలు కూడా ఉన్నవి లాగ కనిపించుచున్నది. కావున ఇది ఇవ్పూటి కుర్రకారుకి నచ్చేది లాగ లేదు.
పూరి:లేదు లేదు.. మంచి కథని ప్రజలు ఎవ్పుడూ స్వీకరించెదరు. ఇందులో మంచి కథ.. సమాజమునకు ఉపయోగపడు సంభాషణలు అలాగే జీవితంలో కష్టపడి పైకివచ్చే వ్యక్తిత్వం
ఉన్న పాత్రలు మరియు ఎన్నో మంచి విషయములు ఉన్నవి కావున ఇది నాకు కూడా విరుద్ధం అయినా కూడా నేను ఈ విథంగా వ్రాసితిని. కాబట్టి మనము దీనిని తెరక్కెక్కించెదము.
విజయ్:ఎంతో అనుభవం ఉన్న మీరు చెప్తున్నారు కాబట్టి నేను కాదనగలనవాడినా? కాని నా కోరిక ఒకటి ఉన్నది.
పూరి:?
విజయ్:నాకు కనీసం ఇది 200 కోట్లను కొల్లగొట్టాలని ఆశగా ఉన్నది..నా ప్రభంజమునకు అదియే ఫలితము
పూరి : అలాగా.. సరియే దీనికి మన వద్ద సోమ్ములేదు కావునా నా ప్రేయసిని అడిగితిని.. అవును అనెను. ఉదయమే కబురంపితిని. ఇవ్పటికే రావాలి కదా...?
డోర్ బెల్ : ట్రింగ్...ట్రింగ్.....
పూరి: నీకు వందయేండ్లు అయుష్షు
ఛార్మి... ఇప్పుడే నీ గురించి చర్చించుకుంటున్నాము....రా ఒళ్ళో కూర్చొనుము,,
ఛార్మి:అది సరే...
విజయ్: ఛార్మి గారు నన్ను దీవించండి...అని కాళ్ళు మ్రొక్కెను.
ఛార్మి: నీవు వంద యేండ్లు వర్ధిల్లు
పూరి కథ చెప్పెను : ఇది కథ చార్మి దీనికి నీవే నిర్మాతవు. కాని మన విజయ్ కి ఒక కోరిక ఉండినది. అది 200 కోట్లు వనూళ్ళు
ఛార్మి: కథ పాత కాలం నాటి మంచి విలువలున్న మంచి కథ.. కాని బాగున్నది. కాని ఆ వసూళ్ళు ఈ తెలుగులో సాథ్యపడదు కావున మనం ఉత్తరమున కూడా విడుదల చేయవలె దానికి మనకి ఓక మంచి పంపిణీదారు కావాలి. అది మన కరణ్ జోహార్ అన్నయ్య అయితే బాగుంటుంది. ఆయనే కదా భుజబలిని మంచి వనూళ్ళకు పరిగెత్తించినది ఉత్తరమున...
అతనిని పిలిపించెదము...
వారం తరువాత...
పూరి మళ్ళీ కథ చెప్పెను :ఇది కరణ్ విషయము. ఏమి అందువు...
కరణ్ జోహార్: ఇది కథ అందురా?...
పూరి:అవును మంచి సంప్రదాయ కష్టే ఫలి గాథ...
కరణ్: ఏం దాయం
పూరి: సంప్రదాయం..సంప్రదాయం..
కరణ్ : నేను వెళ్లి వచ్చెదా...
పూరి : కరణ్ నీకు ఏమి లోటు అయినది చెప్పుము..
కరణ్: దీనిని బల్లివుడ్ లో ప్రవేశము పెట్టెదను కాని కథలో మార్పులు చేయవలె...
పూరి: సరే చచ్చిన పామును ఇంక చంపకుము. డబ్బులు లేవు అన్న నా పరిస్థితిని హస్తము చేనుకొనకుము. కానివ్వుము.
కరణ్: వారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చెదరు.
పూరి:కరీంనగరు నుండి భాగ్యనగరుకు..
కరణ్:చిత్రమును ఉత్తరమున ప్రవేశపెట్టాలంటే వారిని కూడా ఉత్తరంన ప్రవేశపెట్టాలి. కావున దానిని ముంబైకు మార్చుము.
పూరి:సరే!...
కరణ్:హిరోయిన్
పూరి :పల్లవి సాయి
కరణ్ : పూరి నీకు మతి చెడినదా!... మనము ముంబై నుండి మంచి భామలను ఎంచుకొందుము. నాకు తెలిసిన ఒక చక్కని భామ ఉంది. పేరు అనన్య పాండే...
పూరి:ఆమె ప్రతిభ ఏమి?
కరణ్: ఒహో...చాలానే ఉన్నవి..ఆమె చక్కగా నాలుకతో..తన నాసికను బహు సునాయాసముగా అందుకొనును...
పూరి: బాగు బాగు అలాంటి చక్కటి వ్రతిభావంతులే మనకు కావలసినది..ఖాయము చేయుము..
కరణ్: మరి కధా నాయకుడు మరియు వారి అమ్మ ఉద్యోగ నిమిత్తము కాకుండా వారు పొట్ట కూటి కొసం తేనీరు బండి మాస్ ఏరియాలో పెట్టెదరు. అప్పుడు మనం చక్కగా నాలుగు చక్కటి బూతులు ఇరికించవచ్చు. అలాగే కధానాయకికి జారిపోయిన బట్టలతో స్వేచ్చగా తిరుగుతూ పబ్బులకు పోయే అలవాటు ఉన్నదిలాగా చేయుము. అలాగే హిరో అమ్మకి కూడా కొన్ని బూతులు తగిలించుము..
వూరి: సరే..సరే..(మనన్సులో...నీ స్వలింగ నంవర్క జాతి చెడ)
కరణ్: అలాగే హిరోకి మంచి సంభాషణలు తీనివేయుడు.. దానికి బదులుగా అతనికి నత్తిని తగిలించుము..
పూరి : ఏంటి...నీ మ..మతి దొబ్బినదా...
కరణ్ : చూశావా ఇలాగే నత్తి ద్వారా నాలుగుకి. నలభై బూతులు తగిలించవచ్చు.. తాను మొదటి అక్షరం తర్వాత మాట్లాడడానికి వ్రయత్నించే లోపే దానిని జనం వేరేలా అర్ధం
చేసుకొనెదరు. కాబట్టి సెన్సారు నమస్య ఉండదు. మరియొకటి ఈ చిత్రమును పాశ్చాత్య దేశమున కూడా ప్రవేశపెట్టుదుము.
విజయ్: అప్పుడే.....దె...దె...దె...దె...దేశ దేశాలలో దేవర గాడి దండయాత్ర...ఇది..దేవరకొండ గాడి దండయాత్ర...
పూరి: ఓహో విజయ్... అప్పుడే పాత్రలో జీవించుచుంటివి. బాగున్నది చాలించుము అత్యుత్సావాము పనికిరాదు.... అణిగినకొద్దీ..ఒదిగి ఉండాలి...
ఛార్మి: అది ..అణిగనకొద్దీ..ఒదిగి ఉండాలి..కాదు పూరి..ఎదిగినకొద్దీ! ఒదిగి ఉండాలి...
పూరి: అటులనా.. అది చెప్పినది నా కోసము...
కరణ్: అటులనే గీతాలలో ఏంటి కోకిల..జన్మభూమి..విజయం...
వాన వర్షం అని అసభ్య పదజాలము
మార్చుము ముందుగా దానిని కూడా మార్చుము..
1.అక్కడా ..ఇక్కడా..నా జన్మభూమి గొప్పను చాటించు..
అనే ఈ పాటను అకిడి పకిడి కింద మార్చుము..
దీనిని అమ్మ సెంటిమెంటు అను రసవత్తరమైన సన్నివేశము తర్వాత పెట్టుము.
దానిని జనాలు బాగా ఇష్టపడుదురు...ఎందుకంటే జనాలు పిచ్చివారు (నవ్వుతూ.)
2.కొకిలమ్మ ఇచ్చెను కొండంత అండ... కోక 2.0
3.వాన లాగ దూసుకుపో...
దీనిని వాట్ లగా దేంగే... గా సరిదిద్దుము..
అలాగే చిత్రములో ఓక పాశ్చాత్య నటుడిని కూడా ప్రవేశ పెట్టుము.
పూరి:దానికి కధాంశము పరంగా మైక్ టైసన్ అయితే చక్కగా ఉంటుంది.
కరణ్: నీది చక్కటి ఆలోచన... కాని అతను ప్రతినాయకుడు కాదు..అంటే (విలన్)
పూరి: మరి విలన్?
కరణ్: అది... జనాలే.. వారిని చావబాదెదము కదా హాలులో (నవ్వుకుంటూ)
పూరి:అది సరే కాని కధానాయకుడు ఆ యొక్క మైక్‌ని కొడుతుంటే మరీ హాస్యాస్పదముగా ఉంటుంది కదా?
కరణ్:జనాలు పిచ్చివారు..
______________________________
మొత్తానికి చిత్రము పూర్తి అయినది...దానిని దేశము మొత్తము ప్రచారం గావించిరి.
దాని మీద వారి ఆశలు మెండుగా ఉన్నవి. ఆ అత్యుత్సావాములో అందరూ సంబరాలు చేసుకొంటిరి.
----------------------------------
దేశములో ఇలాంటి కళా ఖండము రాలేదు--మౌళిరాజా
ఇది ప్రపంచ పటములో మనల్ని నిలిపే చిత్రము--వివిధ కథానాయకులు
--------------------------------
దీనికి ఒక అర్ధమూహూర్తపు కాల నటనకు టైసను 25 కొట్లు బహు మొత్తము వసూలు చేసెను. అయినా కూడా చిత్ర ప్రచారం చేయకున్నను మొన్న ఏదో సభలో
ప్రసంగిస్తూ ఆ చిత్రమును
నేను ఎప్పుడు చేస్తినో గుర్తులేదు అనెను అది విని మన దర్శకుడు తీవ్ర కోపావేశములకు లొనయ్యెను.
---------------------------------
సరియే దానిని వక్కన పెట్టెదము విడుదల తేది రోజు పండుగ వాతావరణము వెల్లివిరిసినది
-----------------
విడుదల అయిన మొదటి ఆట తర్వాతే రెండవ ఆట వేయకుండా తిప్పిపంపిరి.....
జనాలకు రక్తకన్నీరు కారినది..కడుపు మండినది..నెత్తిమీద పిడుగు పడినది...
కధానాయకుడు పెట్టె హింస ఒకవైపు కథా నాయిక సంప్రదాయ నటన ఒకవైపు భరింపలేక...
ఎవ్వరూ లేని చోట రైలు గుద్దివెళ్ళిన దున్నపోతువలె అరవ సాగిరి....భాధ భరింవలేక...
_______________________________
అదియును కాక ఇందులో హిరోయిన్ నటన అనేది ఏదో వెలగపెట్టిందని బయట టాక్...
పూరి మళ్ళీ మాడినది... కొండ పగిలినది...
మన దర్శకుడికి తెలివి వచ్చినది. దుష్టులకు దూరంగా ఉండాలని...
--------------------------------
చివరగా దర్శకులు. నిర్మాతలు. తదితర వ్యక్తులకు గుణపాఠము అయినది . జనాలు చాలా తెలివైన వారు అని తెలుసుకొంటిరి
___________________________ ..సమాప్తం..
నేను ధూమ శకటం కింద పడి చచ్చెద-కరణ్ జోహార్...
____________________________OKS
No comments:
Post a Comment