Monday, April 24, 2017

Peaceful thoughts

తల్లిదండ్రులను   ద్వేషించకండి .

అంత కన్నా  మహా పాపం  మరొకటి  లేదు .

వారి  కన్నా  మేలు కోరే  వారు  ఈ జగత్తులో   ఎవరూ  ఉండరు .

అత్త వారింటికి  అప్పుడప్పుడు   వెడుతుంటేనే  గౌరవ మర్యాదలు  కల కాలం  నిలుస్తాయి .

అక్కడే  తిష్ట వేస్తే  చీత్కారాలే .

తల్లిదండ్రులు   తమ  పిల్లలను  ఇతరుల  ముందు  పొగిడితే పిల్లలకు  ఆయుక్షీణం .

భారవి  కధ .
***********

💐 *కనువిప్పు*💐

పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. వూర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. భారవి తండ్రి తో నీ కొడుకు చాలాబాగా వ్రాస్తాడయ్యా అనేవారు.  ఆయన  మాత్రం వాడింకా చిన్నవాడు యింక నేర్చు కోవలిసింది
చాలా వుంది. ఏదో వ్రాస్తాడు. అనేవాడు. భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి. తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు. అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు. ఎన్నాళ్ళు పోయినా ఆయన ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రి మీద కసి పుట్టింది ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది. భారవి ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు. అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని చిన్నబుచ్చినట్టు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా తనను మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట. అప్పుడు తండ్రి నవ్వి  *"పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?*

*తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు! అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి ఆటంక మవుతుంది*.
*ఇంకా  యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంత వాడు లేడని .విర్రవీగుతాడు.దానితో వాడి అభివృద్ధి ఆగిపోతుంది.."అన్నాడు*

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది. పశ్చాత్తాపం తో రగిలి పోయాడు.

వెంటనే బండ అక్కడ పారవేసి లోపలి వెళ్లి తండ్రి పాదాల  మీద పడి భోరున ఏడ్చాడు.

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

పశ్చాత్తాపం తో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నావినకుండా  తనకు శిక్షపడాలని పట్టు బట్టాడు.

తండ్రి సరే అలాగయితే మీ అత్తగారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ చివరికి నీ భార్యకు కూడా ఏమీ చెప్పకుండా వుండి రా అన్నాడు.

ఇంత  చిన్న శిక్షనా అన్నాడు భారవి. తండ్రి నవ్వి *అది చాల్లే*వెళ్ళు అన్నాడు.

భారవికి చిన్నతనం లోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.. వాళ్ళు అల్లుడు వచ్చాడని చాలా మర్యాద చేశారు. రోజుకో పిండివంట చేసి ఆదరించారు.

నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు. చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు.మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.

భారవి భార్యకు చాలా బాధగా వుండేది.భర్తకు ఆవిడ మీరు మీ వూరు వెళ్లిపోండని  యెంతో చెప్పి చూసింది. భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు. ఇలా సంవత్సరం గడిచింది.

అప్పుడు భారవి యింక నేను  మా వూరికి పోయి వస్తానని బయల్దేరాడు.

ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
భార్యకు,అత్తామామలకూ  విషయం వివరించి నా శిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు. ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.

*మీ అభివృద్ధిని* కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు!

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి..

అదంతా మీరు బాగు పడాలనీ వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!
.*

Sunday, April 23, 2017

Peaceful thoughts


అనగనగా ఒక ఊరు,
ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు.
అతని దగ్గర ఒక ఆవు ఉండేది.
అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది.
అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది.

చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని,
ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను.

ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.
అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.

ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.
ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు.
పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు.

ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది,
తరువాత అరవకుండా ఉండిపోయింది.
అమ్మయ్య ఆనుకున్నాడు.
కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు.
తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నిలబడి పైకి రాసాగింది.
అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది.
బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది.

ఆవు తెలివికి మెచ్చిన అతను, తన తప్పు తెలుసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

ఈ ఆవులాగే మనమీద కూడ ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు.
కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.🙏

Peaceful thoughts

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది .
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు .
.
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది .
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
.
ఎందుకలా జరిగింది ?
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.
THIS IS EXACTLY WHAT IS HAPPENING NOW IN THIS SOCIETY!!!

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...