Thousands of telugu pdf books. Such as stories. Novels. Science. Purana. Etihasa. And many more coming soon.
Monday, April 24, 2017
Peaceful thoughts
విమానం లో భోజనం
.
విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .
సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .
ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .
" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .
అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .
నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.
నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .
నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు
నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.
ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "
ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !
ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
Peaceful thoughts
ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.
చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............
చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.
డైరెక్టరు : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?
యువకుడు: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లె అన్ని ఫీజులు కట్టెవారు.......
డైరెక్టరు: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?
యువకుడు: ఖాళీ-సిసలు పాత-ఇనుము వెస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ చిన్న-చిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా మార్చుకొని నన్ను చదివించారు.......
డైరెక్టరు: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.
యువకుడు: తన చేతులను చూపించాడు........
అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్త్తగా ఉన్నాయి.
డైరెక్టరు: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో సహాయపడ్డావా?
యువకుడు: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.
డైరెక్టరు: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.
డైరెక్టరు: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.
యువకుడు: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.
డైరెక్టరు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....
వారు చేసే పనిని నీవు సర్రిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....
యువకుడు: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....
ఆ-చేతులు కాయలుగట్టి.........
కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చి
రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......
ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ-మూడు-రోజులు
తల్లిదండ్రుల మీద-ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.
మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చిన వాటికీ డాక్టర్-వద్ద ప్రథమ-చికిత్స చేయిన్చుకొని కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....
ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."
మీరు నా కళ్ళు తెరిపించారు సర్!
నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"
దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"
ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......
కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...
నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.
కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండాఅసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి,,,,,
Peaceful thoughts
🔔 స్వర్గం -నరకం -
👤ఒక వ్యక్తి మరణించాడు.
అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు..🚶
🕸అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది.🕸
మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. 👎
చూడ్డానికి మాత్రమ్ బక్క చిక్కిపోయి ఉన్నారు.🕴🕴
అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. 🙁🙁
ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 😕😪
ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు.😨
ఇంతలో ఒక గంట మ్రోగింది.🔔🙄
వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. 🏃🏃🏃
అతడు వెళ్ళాడు.
వెళ్ళి నిర్ఘాంతపోయాడు. 🤔
అది ఒక పెద్ద భోజనశాల.
మధ్య లో చలా పొడవైన బల్ల ఉంది. 🚧🚧🚧
దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. 😋😋
శఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. 🤒🤒🤒
మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది. 🤔🤔🤔🤔
అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. 😦😧
అవి చాలా పొడవుగా ఉన్నాయి.
అందరూ తినడానికి ప్రయత్నము చేసారు.
అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.😥
చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.😞
సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..😞
🔔ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.😞
🚶ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు.
స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.😊
అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺
పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. 🤔
మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట 🔔కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు.
అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది.
నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. 🤔
తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....😉
అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. 🙁🙁
ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...😋
చూస్తుండగానే అన్ని తినేసారు......... 😇😇
ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు తినిపించుకోన్నారు...🤒🤒
అలా కడుపునిండా తినగలిగారు..😀😀
👉మనము ఎదుటివారికి సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని, ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది.😊😊
స్వార్ధం తో నేను మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే.
☝Always help to others👏
Peaceful thoughts
🔸 *ఒక చిన్న కథ.* 🔸
ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్ళాడు.
ఆ చేపను మహారాజుగారికి సమర్పించి ఇలా అన్నాడు.
" మహారాజా! ఈ చేప చాలా ప్రత్యేకమైనది.... ఇది మీదగ్గర ఉంటేనే
బాగుంటుంది." అన్నాడు.
చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకుని అతనికి
5000 వరహాలు ఇచ్చాడు.
అదిచూసిన మహారాణికి చిన్న చేపకు
5000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు.రాజుగారితో ఇలా అంది.
" మహారాజా! చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5000 వరహాలు ఇవ్వడం
నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కు తీసుకోండి"
దానికి మహారాజు ఇలా అన్నాడు.
" ఒక చేపలు పట్టి బ్రతుకుతున్న వ్యక్థికి ఇచ్చిన కానుకను వెనక్కి
తీసుకోవడం మంచిదికాదు. ఆ ఆలోచన మానుకో "
కానీ రాణి ససేమిరా ఒప్పుకోలేదు.
ఎలాగైనా వరహాలను వెనక్కు
తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడిచేసింది.
చేసేదేంలేక రాజుగారు
ఒప్పుకుని ఎలా వెనక్కుతీసుకోవాలో చెప్పమని రాణినే అడిగారు.
దానికి రాణి ఇలా అన్నది.
" చేప ఆడదో ...మగదో అడిగి తెలుసుకోండి...
వాడు ఆడది అంటే మాకు మగ చేపకావాలి అనీ...
మగచేప అని అంటే
మాకు ఆడచేపలే కావాలని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చి
వరహాలు వెనక్కు తీసుకుందాం "
రాజుగారు ఆ చేపలు పట్టే వాణ్ణి పిలిచి
చేప ఆడదా మగదా
అని అన్యమనస్కంగా అడిగాడు .
దానికి ఆ చేపలు పట్టెవాడు ఇలా సమాధానం
ఇచ్చాడు.
" మహారాజా! ఆడచేప కాదు...మగచేపకాదు. చాలా వింతైన
చేప కాబట్టే మీకు ఇచ్చాను"
ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరొక 5000 వరహాలు ఇచ్చాడు
అలా ఇస్తున్నప్పుడు ఒక వరహా జారి కిందపడిపోయింది.
దానికోసం
అతను వెదుకుతుండగా మహారాణి మళ్ళి ఇలా అన్నది.
" చూశారా! మహారాజా! వాడి పిసినారితనం...లేకితనం..
మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టించి మరొక 5000 వరహాలు
కొట్టేశాడు. అతన్ని అడగండీ"
రాజు గారు అతన్ని ఇలా అడిగాడు
" నీకు 10000 వరహాలు వచ్చాయి కదా!
మళ్ళీ కిందపడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు."
దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పడు.
" మహారాజా!
నాకు , నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరే
నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే చాలా గౌరవం మాకు.
ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది కదా! పొరపాటునకూడా
దాన్ని ఎవరూ తొక్కడం నాకు ఇష్టంలేదు మహారాజా! అందుకే
ఆ ఒక్క వరహాను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా!
అది విన్న మహారాజు మరొక 5000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు.
🔸నీతి🔸
మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా
వేయకూడదు.......
చదువుకోకపోయినా వారికి తెలివితేటలు
ఉండవనీ.......
బాగా చదువుకున్నాము కాబట్టి బాగా తెలివి
తేటలు ఉంటాయని అభిప్రాయానికి రాకూడదు.
కొంతమందికి
జీవితమే ఎన్నో తెలివితేటలను .......అనుభవాలతో కూడిన
శక్తి యుక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి.
Peaceful thoughts
ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?
1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
Peaceful thoughts
✍✍✍✍✍✍✍
A cute story
అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ!
ఆ రోజు పొద్దుపోయి... చీకట్లు ముసురువేళ.. ఎవరికి వాళ్లు పని ముగించికొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు!
అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిజేస్తూ లోపలే ఉండిపోయాడు! దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసారు!
గాలి చొరబడని శీతలగిడ్డంగిలో తాను అనుకోకుండా బంధీనైనాని గ్రహించాడు!
గంటలు గడుస్తున్నాయి! బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో....
.......
....
ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి...
ఆశ్చర్యం...
టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు!
బయటకు వచ్చేటపుడు ఈ అధ్భుత ఘటన నుండి తేరుకుంటూనే
"నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్ఛారు?"
అడిగాడు గార్డ్ ని!
"ఎవ్వరూ చెప్పలేదు సార్!
ఈ సంస్థలో 50 మందికి పైనే పని చేస్తున్నారు... కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ ఉదయం 'హలో' అని.. సాయింత్రం ఇంటికి వెళ్తూ 'బై' అని చెప్పి పలకరించేది మీరొక్కరే సర్!
ఈరోజు ఉదయం 'హలో' అని పలకరించిన మీరు.. సాయింత్రం 'బై' చెప్పలేదు.. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్!"
అతనూహించలేదు..
అతనికి ముందుగా తెలియదు! భేషజం గాని బాస్'ఇజం' గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపుపూర్వక "సంజ్ఞ" కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్తాయి అని!
మనకు తెలియకపోవచ్చు అటువంటి అధ్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని!
నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటి వారి వైఖరి ఉంటుంది! అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రామాణికం కాదు! ఇది మంచి పోస్ట్!
చాలామంది దీనిని ఫార్వర్డ్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా!
కానీ ఎంత మంది పాటిస్తున్నారు? ఎంతసేపూ ఎదుటివారే పలుకరించాలనే అహమే ఎక్కువగా కనిపిస్తుంది.
నిజంగా ఈ పోస్ట్ లోలాగా పలుకరించేవారుంటే వారందరికీ నమస్కారం! నిజంగా "అహం" లేకుండా పాటిస్తూ ఫార్వర్డ్ చేసేవారికి శతాధిక నమస్సులు!
👏🏻👏🏻👏🏻
garuda story inner meaning
How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...
-
How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...
-
Download sampoorna mahabharatam telugu pdf download ... download here ...
-
"అక్షౌహిణి అంటే?" 17-01-2024 ఒక యుగంలో లేదా ఒక కాలంలో ఆ ప్రజల జీవన విధానాలు మరియు ఆచార వ్యవహారాలతో పాటుగా అనేక అం...