Thursday, September 14, 2017

Story

గంప కింద పువ్వు కథ

అనగనగా ఒక  వూరిలో,
ఒక  కోడి  వుండేది, ఆ  కోడిని  ఎటు  వెళ్లనివ్వకుండా  ఒక  గంప  దాన్ని  ఎప్పుడు  మూసి  పెట్టేది, బయటకు  వెళ్లాలని  ఎంత  ప్రయత్నించినా ,
గంప  దాన్ని  వదిలేది  కాదు..

ఆ గంపకు  పక్కనే  ఎదిగిన  మొక్క  లో  పూచినా  పువ్వు,
ఇదంతా గమనించి,
ఓ గంపా, ఎందుకు  ఆ  కోడిని  అలా  మోసి పెట్టి,
దాని స్వేచ్ఛను, ఎదుగుదలను అడ్డుకుంటున్నావ్?
పాపం కదా, అంది.

పువ్వు మాటలకు,
అహంకారం తో నిండిన మనసుతో, ఆ గంప..
"నా  గుణం అంతే, నాకు  నచ్చిన దాన్ని మోసుకెళ్తాను
నా  ఇష్టం  వచ్చిన  దాన్ని  మూసి పెడతాను"
అని బదులిచ్చింది.

గంప  మాటలు  విన్న  పువ్వు, చిన్ననవ్వు నవ్వి
అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి అని విర్రవీగకు,
అంది పువ్వు,
హ హ హ అవునా, సరే , ఇప్పుడు నిన్ను కూడా మూసి పెడతాను,
చూస్తావా,, అని, ఆ గంప, పువ్వును కూడా తన కింద మూసి పెట్టుకుంది,,

అయితే, గంప ఆ పువ్వును బంధించింది, కానీ, ఆ పువ్వు వెదజల్లే, పరిమళాన్ని మాత్రం
బంధించలేకపోయింది,
ఆ సుమగంధాలన్నీ అనుసరిస్తూ, అక్కడికి వచ్చిన ఒక పసిపాప,
గంపను తీసి, పక్కన పడేసి, ఆ పువ్వును తీసుకెళ్లి, దేవుని పాదాల వద్ద వుంచింది..

ఈ కథ లో లాగే, జీవితం లో ఎదగుతున్న వారిని చూసి,
ఓర్వలేక, తమ కింద ఉండాలని తొక్కి పెట్టాలని కుటిల పన్నాగాలు పన్నే వారికి,
ఏదో ఒక సందర్భం లో, పరాభవం తప్పదు,
నేను ఎదగాలి అనుకోవడం లో తప్పు లేదు, కానీ
నేనే ఎదగాలి అని అనుకోవడం అంటే, అది మూర్ఖత్వం అవుతుందని
ఈ గంప కథలోని నీతి!!......

No comments:

Post a Comment

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...