Thursday, January 5, 2023

Mahabharatam and behind science

*🧬శాస్త్రవేత్తలకే అంతుచిక్కని🤷🏻‍♂️ సైన్స్ మహాభారతంలో*
 *ఏంటో 🤔చూద్దాం పదండి*

👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

 *5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంసృుతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.*

👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి *5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏదీ రాకపోవడం విచిత్రం.*

👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ కనుక్కోని విషయాలను ఎన్నో మనకు మహాభారతం చెపుతుంది. 

వాటిలో కొన్ని:

*👉మహాభారతంలోని ఆదిపర్వంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.*

👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు *నియోగ ధర్మం* ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి *విదురుడు జన్మించడం.*

*👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా.?*

👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది. మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.
*1974లో  అయోవ యూనివర్సిటీలో *డోనాల్డ్ లాకె* అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, *స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితులే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.*

👉నేడు మనం వాడే *స్పెర్మ్ డొనేషన్* ఆనాటి
 *నియోగపద్ధతి ఒకటే.*

గాంధారి కుంతిపై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది.
👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ ప్రేమ; స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.

*👉 వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.*

 పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.*స్లైసింగ్ ఎంబ్రియో*

2.*ఆర్టిఫిషియల్ యూటర్నెస్* కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 

3. *మదర్ టచ్*

*👉 టెస్ట్ ట్యూబ్ బేబీలుగా పుట్టిన వారు - వశిష్ఠుడు, అగస్త్యుడు, ద్రోణాచార్యుడు, క్రుతుడు, కృపి. 

అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి, గర్భాశయం బయట చుట్టూ పోషకాలనుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా.!

*👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు* అంటే ప్రత్యేకమైన కుండలో పుట్టినవాడు అని అర్థం.

ఇక శిఖండి పాత్ర :-
 *Transgender*  *Trans sexual* *లింగ మార్పిడి*
మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముడిని చంపేందుకు అంబ శిఖండిగా మారింది. మొదటి ఆడ పిల్లగా పుట్టి; మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే *Transsexualism* ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు *సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది.* అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.

*బృహన్నల పాత్ర :-
*Temporary Trans-sexualisum* ఇప్పటి మోడర్న్ సైన్స్ లో *hermaphroditism*
అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.

*ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు :-
యోగ మాయ ద్వారా *రోహిణి గర్భం లోకి మార్పు  చేయ బడిన ఎంబ్రీయో ద్వారా ఇది సాధ్య పడింది.

దీనికి నేటి సైన్సు వివరణ :-
*Effortless reciprocal IVF* అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ *3 నవంబర్ 2018 ఈనాడు పేపర్* తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ ఇద్దరు యువతులే కదా ఎలా కంటారు, ప్రకృతి ఒప్పుకోదు కదా.! 

కాని దీనిని *Bedford hospital in Texas* వాళ్ళు చేశారు.
IVF ద్వారా ఎంబ్రియో - కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో; మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో; పెరిగిన బిడ్డను కన్నారు.

*జరాసంధుడు పాత్ర*-
 జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.

ఈమధ్య మోడ్రన్ మెడిసిన్ లో *Replantation surgery* యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.

*1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని అతికించారు, award కూడా పొందాడు.*

*అర్జునుడు ప్రయోగించిన "సమ్మోహనాస్త్రం" మరొక విచిత్రం. దీనిని ఉత్తర కుమారుడితో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయంలో తను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. (నర్తనశాల సినిమాలో మనకు చూపించారు).
 
ఇలాటిదే మనకు 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, (ఆంధ్రప్రదేశ్), PC సర్కార్ లాంటి వాళ్ళు చేసి చూపారట.

*మహాభారత యుద్దం సమయంలో ఇలాటివే అనేక అస్త్ర, శాస్త్రాలూ ఉపయోగించారన్నది మనం చదివాము. 
ఉదా:- బ్రహ్మాస్త్రం,  నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం etc*

ఇలాటిదే  world war-02 లో 06-Aug-1945 హీరోషిమా; నాగసాకిపై జరిపిన అణు విస్ఫోటనం*

👉  Physics సూత్రాలు 
*నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః* అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాన్ని  పుట్టించలేం.

👉పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. E=mc2

*👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే, గీతలో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.*
 ఆటంబాంబ్ విస్ఫోటనంతో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం. అంధుడైన  ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపాన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అంధులకు కూడా కనిపించేంత శక్తి అదీ. 

మహాభారతంలో *భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు.  

ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది వేల సం॥ క్రితమే మన పూర్వులు చేసారు.

*AA Garbosky అనే scientists* హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు
ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. *మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు. కానీ, వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు, అని చెప్పారు.*

*👉 మాక్రో, మైక్రో  వైజేశన్ -- శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల (పెద్ద), సూక్ష్మ (చిన్న) రూపం.*

*ఎందరో విదేశీయులు మహాభారతంలో గుర్తించిన విషయాలను మన దేశంలోని ప్రస్తుత తరం వారు  గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్; టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.*

*ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, అని చెప్తారు. ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.*

*మన దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కనుక్కున్నాము అని నమ్మిస్తే మనం కూడా వారికి జైజైలు కోడుతున్నాము.*

*ఇప్పటికైనా  ఆలోచిద్దాం భావితరాలకు మన పురాణ ఇతిహాసాల లోని గొప్పదనాన్ని వివరిద్దాము.*

                    *🚩జై హింద్🤝జై భారత్🇮🇳*
                               శుభోదయం
పిల్లాడి రుద్రయ్య
      
                   🌹🙏🌹🪔🪔🪔🌹🙏🌹

Saturday, December 3, 2022

మన చుట్టూ పెరిగే మొక్కల ఔషధ గుణాలు వాటి ఆధ్యాత్మిక విలువలు

మన చుట్టూ పెరిగే మొక్కల ఔషధ గుణాలు వాటి ఆధ్యాత్మిక విలువలు  pdf file

https://drive.google.com/file/d/1arsEvUMyiEpR5VLJw5AWvntgQPzb4f2Y/view?usp=share_linkDownload

 

Sunday, September 4, 2022

లైగర్ రివ్యూ liger telugu review

లైగరు చిత్రముపై నా యొక్క సమీక్ష....

లైగరు చూని నా పొగరు అణిగినది. రక్తకన్నీరు కారినది...

ఈసారి పూరన్న. పూరి మాడగొట్టిండు...

మరి విషయమునలోకి వచ్చెదము...

ట్రింగ్‌..ట్రింగ్‌..

అఖిల భారత పూరి అభిమాన సంఘ అథ్యక్షుడు: అయ్యా పూరి గారు ఏంటి అండి ఈ మధ్య ఖళాఖండములు
తీయుట లేదు తమరు!

పూరి : లేదు లేదు... నాలో చిత్ర దర్శకుడు ఇంకను చావలేదు. ఈసారి ఒక గొప్ప ఖళాఖండముతో వచ్చెద...
కాచుకొనుము:

అ.భా.పూ.అ.న.అ: బాగు బాగు ఈసారి మాకు పండగే అన్నమాట. ఇంక సెలవు. 100 రోజుల విజయ నభలో
కలిసెదము.

పూరి:నా అభిమానులను అలరించని ఈ బ్రతుకు వ్యర్థము. వెంటనే ఒక ముత్యమునకు శ్రీకారము చుట్టెద.
వెంటనే నేను ధాయిలాండు అను ప్రదేశమునకు వెళ్ళి సముద్ర ఓడ్డున ఓక కథను వండెదను.
కావున భార్య దగ్గరకు వెళ్ళి ధనమును సమకూర్చెదను.

 ఓ..శ్రీమతి నేను మరియొక కళాఖండమునకు
తీయుట సంకల్పించితిని. 
కావున నాకు ధనము ఇవ్వుము.

భార్య: బాగు బాగు ఇంకను మీరు తీసిన చిత్రములు చాలు. వెళ్ళుము...

పూరి: హకటా! ఎంత కష్టము వచ్చినది. భార్య..పుత్రుడు నన్ను ఛీ..కొట్టిరి..ధనము లేదు కావున ఈసారి
బ్యాంకాక్‌ లో .. కాకుండా... బ్యాంక్‌ ప్రక్కన ఉన్న సత్రము గది లో ఉండి. రాసెద....

కథ: కధానాయకుడిది ఓక కరీంనగరులోని ఓక కుగ్రామము. వారి పూర్వికులు ఉన్న ఆస్తిని కష్టపడి కరిగించిరి. 
దానిని చూచి వారి నాన్న కాలము చేసిరి.
కథానాయకుడి  అమ్మ
మంచి సంప్రదాయ వ్యక్తి కుమారుడికి మంచి మాటలు చెప్పి చక్కగా పెంచెను. అతనికి అన్ని శతకములు కంఠస్థము. పెద్దవాడయ్యెను అలాగే ఆమె మంచి తెనుగింటి సంప్రదాయబద్ద
అమ్మాయిని చూచి పెళ్ళి చేసినది.
కొడుకు మరియు కోడలు చక్కగా ఉండును. ఆమె కోడలు వచ్చిన అతిధిలను సేవించుకొని దానము ధర్మమును చక్కగా నిర్వర్తించుకొను చక్కటి ఇల్లాలు.
ఇంక కొడుకు ఉద్యోగ నిమిత్తము వారు అందరూ కుటుంబముతో సహా భాగ్యనగరమునకు విచ్చేసిరి. కథానాయకుడికి అన్ని కోరికలు తీరినవి కాని అతనికి చిన్ననాటి కోరిక మాత్రము తీరలేదు అది బాక్సింగ్‌ చేయాలని
అందులో ఉత్తీర్ణుడు కావాలని. దానిని చూచిన వారి అమ్మ కడు ఆవేదనకు లోను అయ్యెను. దానితో ఆమె దగ్గర ఉన్న బంగారము తనఖా పెట్టి ఆ సొమ్ముతో అతనికి తగు అభ్యాసమును ఇప్పించి కుమారుడిని బాక్సింగు రింగు లోకి పంపించి అతను మహామహులనే ఓడించి అతని జీవిత కాల కోరికను నెరవేర్చుకొని మరియు అతని కుటుంబమునకు మరియు తాను పుట్టిన గ్రామమునకు మంచి పేరొసెంగెను. ఇది సంయుక్తము గా కథ.

పాటలు కొన్ని : 1.అక్కడా ..ఇక్కడా..జన్మభూమి గొప్పను చాటించు...

2.కొకిలమ్మ ఇచ్చెను కొండంత అండ...

3.వాన లాగ దూసుకుపో...

కథ పూర్తి అయినది. ఇక నటీ నటులు కావాలి. దానికి ఈమద్య ప్రాచుర్యం పొందిన విజయ్‌ దేవరకొండను పరిగణలోకి తీసుకొంటా...కధా నాయకి పల్లవి సాయి బహు ముచ్చటగా
ఉండును. అమ్మ పాత్రకు అన్నవూర్ణమ్మ అయితే బాగుంటుంది.

ఇక కథను చర్చించెదము....

 

తరువాతి వారము....ఒక హోటల్‌ గదిలో

  

పూరి: ఇది కధ విజయ్‌ ఎలా ఉన్నది

విజయ్‌: బాగానే ఉన్నది కాని ఇది ఇప్పటి కాలమునకు చెందినది లాగా లేదు. అలాగే మానవతా విలువలు కూడా ఉన్నవి లాగ కనిపించుచున్నది. కావున ఇది ఇవ్పూటి కుర్రకారుకి నచ్చేది లాగ లేదు.

పూరి:లేదు లేదు.. మంచి కథని ప్రజలు ఎవ్పుడూ స్వీకరించెదరు. ఇందులో మంచి కథ.. సమాజమునకు ఉపయోగపడు సంభాషణలు అలాగే జీవితంలో కష్టపడి పైకివచ్చే వ్యక్తిత్వం
ఉన్న పాత్రలు మరియు ఎన్నో మంచి విషయములు ఉన్నవి కావున ఇది నాకు కూడా విరుద్ధం అయినా కూడా నేను ఈ విథంగా వ్రాసితిని. కాబట్టి మనము దీనిని తెరక్కెక్కించెదము.

విజయ్‌:ఎంతో అనుభవం ఉన్న మీరు చెప్తున్నారు కాబట్టి నేను కాదనగలనవాడినా? కాని నా కోరిక ఒకటి ఉన్నది.

పూరి:?

విజయ్‌:నాకు కనీసం ఇది 200 కోట్లను కొల్లగొట్టాలని ఆశగా ఉన్నది..నా ప్రభంజమునకు అదియే ఫలితము

పూరి : అలాగా.. సరియే దీనికి మన వద్ద సోమ్ములేదు కావునా నా ప్రేయసిని అడిగితిని.. అవును అనెను. ఉదయమే కబురంపితిని. ఇవ్పటికే రావాలి కదా...?

డోర్‌ బెల్‌ : ట్రింగ్‌...ట్రింగ్‌.....

పూరి: నీకు వందయేండ్లు అయుష్షు

 ఛార్మి... ఇప్పుడే నీ గురించి చర్చించుకుంటున్నాము....రా ఒళ్ళో కూర్చొనుము,,

ఛార్మి:అది సరే...

విజయ్‌: ఛార్మి గారు నన్ను దీవించండి...అని కాళ్ళు మ్రొక్కెను.

ఛార్మి: నీవు వంద యేండ్లు వర్ధిల్లు

పూరి కథ చెప్పెను : ఇది కథ చార్మి దీనికి నీవే నిర్మాతవు. కాని మన విజయ్‌ కి ఒక కోరిక ఉండినది. అది 200 కోట్లు వనూళ్ళు

ఛార్మి: కథ పాత కాలం నాటి మంచి విలువలున్న మంచి కథ.. కాని బాగున్నది. కాని ఆ వసూళ్ళు ఈ తెలుగులో సాథ్యపడదు కావున మనం ఉత్తరమున కూడా విడుదల చేయవలె దానికి మనకి ఓక మంచి పంపిణీదారు కావాలి. అది మన కరణ్‌ జోహార్‌ అన్నయ్య అయితే బాగుంటుంది. ఆయనే కదా భుజబలిని మంచి వనూళ్ళకు పరిగెత్తించినది ఉత్తరమున...
అతనిని పిలిపించెదము...

వారం తరువాత...

పూరి మళ్ళీ కథ చెప్పెను :ఇది కరణ్‌ విషయము. ఏమి అందువు...

కరణ్‌ జోహార్‌: ఇది కథ అందురా?...

పూరి:అవును మంచి సంప్రదాయ కష్టే ఫలి గాథ...

కరణ్‌: ఏం దాయం

పూరి: సంప్రదాయం..సంప్రదాయం..

కరణ్‌ : నేను వెళ్లి వచ్చెదా...

పూరి : కరణ్‌ నీకు ఏమి లోటు అయినది చెప్పుము..

కరణ్‌: దీనిని బల్లివుడ్‌ లో ప్రవేశము పెట్టెదను కాని కథలో మార్పులు చేయవలె...

పూరి: సరే చచ్చిన పామును ఇంక చంపకుము. డబ్బులు లేవు అన్న నా పరిస్థితిని హస్తము చేనుకొనకుము. కానివ్వుము.

కరణ్‌: వారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చెదరు.

పూరి:కరీంనగరు నుండి భాగ్యనగరుకు..

కరణ్‌:చిత్రమును ఉత్తరమున ప్రవేశపెట్టాలంటే వారిని కూడా ఉత్తరంన ప్రవేశపెట్టాలి. కావున దానిని ముంబైకు మార్చుము.

పూరి:సరే!...

కరణ్‌:హిరోయిన్‌

పూరి :పల్లవి సాయి

కరణ్‌ : పూరి నీకు మతి చెడినదా!... మనము ముంబై నుండి మంచి భామలను ఎంచుకొందుము. నాకు తెలిసిన ఒక చక్కని భామ ఉంది. పేరు అనన్య పాండే...

పూరి:ఆమె ప్రతిభ ఏమి?

కరణ్‌: ఒహో...చాలానే ఉన్నవి..ఆమె చక్కగా నాలుకతో..తన నాసికను బహు సునాయాసముగా అందుకొనును...

పూరి: బాగు బాగు అలాంటి చక్కటి వ్రతిభావంతులే మనకు కావలసినది..ఖాయము చేయుము..

కరణ్‌: మరి కధా నాయకుడు మరియు వారి అమ్మ ఉద్యోగ నిమిత్తము కాకుండా వారు పొట్ట కూటి కొసం తేనీరు బండి మాస్ ఏరియాలో పెట్టెదరు. అప్పుడు మనం చక్కగా నాలుగు చక్కటి బూతులు ఇరికించవచ్చు. అలాగే కధానాయకికి జారిపోయిన బట్టలతో స్వేచ్చగా తిరుగుతూ పబ్బులకు పోయే అలవాటు ఉన్నదిలాగా చేయుము. అలాగే హిరో అమ్మకి కూడా కొన్ని బూతులు తగిలించుము..
వూరి: సరే..సరే..(మనన్సులో...నీ స్వలింగ నంవర్క జాతి చెడ)

కరణ్‌: అలాగే హిరోకి మంచి సంభాషణలు తీనివేయుడు.. దానికి బదులుగా అతనికి నత్తిని తగిలించుము..

పూరి : ఏంటి...నీ మ..మతి దొబ్బినదా...

కరణ్‌ : చూశావా ఇలాగే నత్తి ద్వారా నాలుగుకి. నలభై బూతులు తగిలించవచ్చు.. తాను మొదటి అక్షరం తర్వాత మాట్లాడడానికి వ్రయత్నించే లోపే దానిని జనం వేరేలా అర్ధం
చేసుకొనెదరు. కాబట్టి సెన్సారు నమస్య ఉండదు. మరియొకటి ఈ చిత్రమును పాశ్చాత్య దేశమున కూడా ప్రవేశపెట్టుదుము.

విజయ్‌: అప్పుడే.....దె...దె...దె...దె...దేశ దేశాలలో దేవర గాడి దండయాత్ర...ఇది..దేవరకొండ గాడి దండయాత్ర...

పూరి: ఓహో విజయ్‌... అప్పుడే పాత్రలో జీవించుచుంటివి. బాగున్నది చాలించుము అత్యుత్సావాము పనికిరాదు.... అణిగినకొద్దీ..ఒదిగి ఉండాలి...

ఛార్మి: అది ..అణిగనకొద్దీ..ఒదిగి ఉండాలి..కాదు పూరి..ఎదిగినకొద్దీ! ఒదిగి ఉండాలి...

పూరి: అటులనా.. అది చెప్పినది నా కోసము...

కరణ్‌: అటులనే గీతాలలో ఏంటి కోకిల..జన్మభూమి..విజయం...
వాన వర్షం అని అసభ్య పదజాలము 
మార్చుము ముందుగా దానిని కూడా మార్చుము..

1.అక్కడా ..ఇక్కడా..నా జన్మభూమి గొప్పను చాటించు..
అనే ఈ పాటను అకిడి పకిడి కింద మార్చుము..
దీనిని అమ్మ సెంటిమెంటు అను రసవత్తరమైన సన్నివేశము తర్వాత పెట్టుము.
దానిని జనాలు బాగా ఇష్టపడుదురు...ఎందుకంటే జనాలు పిచ్చివారు (నవ్వుతూ.)

2.కొకిలమ్మ ఇచ్చెను కొండంత అండ... కోక 2.0

3.వాన లాగ దూసుకుపో... 
దీనిని వాట్‌ లగా దేంగే... గా సరిదిద్దుము..

అలాగే చిత్రములో ఓక పాశ్చాత్య నటుడిని కూడా ప్రవేశ పెట్టుము.

పూరి:దానికి కధాంశము పరంగా మైక్‌ టైసన్‌ అయితే చక్కగా ఉంటుంది.

కరణ్‌: నీది చక్కటి ఆలోచన... కాని అతను ప్రతినాయకుడు కాదు..అంటే (విలన్)

పూరి: మరి విలన్‌?

కరణ్‌: అది... జనాలే.. వారిని చావబాదెదము కదా హాలులో (నవ్వుకుంటూ)

పూరి:అది సరే కాని కధానాయకుడు ఆ యొక్క మైక్‌ని కొడుతుంటే మరీ హాస్యాస్పదముగా ఉంటుంది కదా?
కరణ్‌:జనాలు పిచ్చివారు..
______________________________

మొత్తానికి చిత్రము పూర్తి అయినది...దానిని దేశము మొత్తము ప్రచారం గావించిరి. 
దాని మీద వారి ఆశలు మెండుగా ఉన్నవి. ఆ అత్యుత్సావాములో అందరూ సంబరాలు చేసుకొంటిరి.
----------------------------------
దేశములో ఇలాంటి కళా ఖండము రాలేదు--మౌళిరాజా

ఇది ప్రపంచ పటములో మనల్ని నిలిపే చిత్రము--వివిధ కథానాయకులు
--------------------------------
దీనికి ఒక అర్ధమూహూర్తపు కాల నటనకు టైసను 25 కొట్లు బహు మొత్తము వసూలు చేసెను. అయినా కూడా చిత్ర ప్రచారం చేయకున్నను మొన్న ఏదో సభలో
ప్రసంగిస్తూ ఆ చిత్రమును
నేను ఎప్పుడు చేస్తినో గుర్తులేదు అనెను అది విని మన దర్శకుడు తీవ్ర కోపావేశములకు లొనయ్యెను.
---------------------------------
సరియే దానిని వక్కన పెట్టెదము విడుదల తేది రోజు పండుగ వాతావరణము వెల్లివిరిసినది

 -----------------

విడుదల అయిన మొదటి ఆట తర్వాతే రెండవ ఆట వేయకుండా తిప్పిపంపిరి.....

జనాలకు రక్తకన్నీరు కారినది..కడుపు మండినది..నెత్తిమీద పిడుగు  పడినది...

కధానాయకుడు పెట్టె హింస ఒకవైపు కథా నాయిక సంప్రదాయ నటన ఒకవైపు భరింపలేక...

ఎవ్వరూ లేని చోట రైలు గుద్దివెళ్ళిన దున్నపోతువలె అరవ సాగిరి....భాధ భరింవలేక...
_______________________________
అదియును కాక ఇందులో హిరోయిన్‌ నటన అనేది ఏదో వెలగపెట్టిందని బయట టాక్‌...

పూరి మళ్ళీ మాడినది... కొండ పగిలినది...
మన దర్శకుడికి తెలివి వచ్చినది. దుష్టులకు దూరంగా ఉండాలని...
--------------------------------
చివరగా దర్శకులు. నిర్మాతలు. తదితర వ్యక్తులకు గుణపాఠము అయినది . జనాలు చాలా తెలివైన వారు అని తెలుసుకొంటిరి
___________________________ ..సమాప్తం..

   

 

నేను ధూమ శకటం కింద పడి చచ్చెద-కరణ్‌ జోహార్‌...

____________________________OKS

Saturday, May 7, 2022

universe

సప్తర్షులు ఎవరు

అసలు వీరు ఆకాశమందు గొప్ప వెలుగు గల చుక్కలవలె మనకు కనబడుచున్నారు. ఈ వెలుగునకే దేవభాషయందు "జ్యోతి" అనుపేరు కలదు. ఇట్టి జ్యోతిస్సులను గూర్చి విచారించు శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రము. అందులో వీరి పేర్లు అనేక విధములుగా వర్ణింపబడినవి. వీరు ఒక మన్వంతరము కాలము అనగా 71 మహాయుగముల కాలము వరకు మాత్రమే ఒక నియతమార్గమునందు తిరుగుదురు. ఆకాలముపైన వీరు పరమేశ్వరునిలో లీనమవుదురు. తిరిగి మరియొక మండల స్థానమునకు వచ్చి మరియొక మన్వంతరకాలము ఇట్లే సంచరించెదరు. ఈ అభిప్రాయము మత్స్య పురాణము నందు బాగుగా విచారించబడినది. అందులో మొదటి స్వయంభువు మన్వంతర కాలములో సప్తర్షుల పేర్లు మన సంప్రదాయం ప్రకారం చెప్పబడిన ఏడుగురు ఋషులే ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారు. ఆ సప్తర్షులు...

మరీచి
అత్రి
అంగిరసు
పులస్త్యుడు
పులహుడు
క్రతువు
వశిష్ఠుడు

Monday, April 25, 2022

SRI DEVI (AMMAVARI) KATHALU TELUGU PDF FREE DOWNLOAD

  DEVI KATHALU TELUGU PDF FREE DOWNLOAD 

శ్రీ దేవి కథలు 

DOWNLOAD FROM HERE

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...