Thursday, February 2, 2023

సనాతన ధర్మం అందులో దాగి ఉన్న విజ్ఞానం

భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)

ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే

భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.

ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)

మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది.  ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.

విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)

అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.

అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |

వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |

"దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.

అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.

విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.

4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).

సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |

                   
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.

విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)

భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)

గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)

రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)

కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)

DNA గురించి చెప్పిన (బోధిధర్మ)

మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)

మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)

సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)

మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.

మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
య ఏతం దేవమేకవృతం వేద


మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
య ఏతం దైవ మేకవృత్తం వేద

మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
య ఏతం దైవమేకవృతం వేద


1 2 3 4 5 6 7 8 9 10

Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)

చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.

అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.

ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉🚩🚩

సనాతన ధర్మ కాల గణనం

Atom ⚛️ _అణు_ ....

About కాలం .....
“Kaalo asmi loka kshaya kritpraviddho” ( Chapter 11 shloka 32).

పరమాణువు
శ్రీమద్ మహా భాగవత పురాణం మూడవ స్కంధం 349 శ్లోకం నుంచి.....

సూర్యుని కాంతి కిటికీలోనుండి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే చిన్న చిన్న
రెణువులలో ఆరవభాగానికి
పరమాణువు అని పేరు. ఆ పరమాణువుపై ఒక ప్రక్కనుండి మరియొక్క ప్రక్కకు
సూర్యకిరణం పయనించే కాలానికి
సూక్ష్మకాలం అని పేరు. అంటే కాంతి ఒకసెకనుకు 3 లక్షల కి.మి. ప్రయాణం చేస్తుంది. అంత వేగమంతమైన కాంతి ఒ క చిన్న పార్టికల్‌ పొడవులో ట్రావెల్‌ చేసే సమయంలో
ఆరవ వంతు అన్నమాట. దీనిని కేవలం ఊహించుకోవలసిందే అదియే మిక్కిలి
అత్యల్పమైన కాలము.


ఆ అత్యల్ప సమయం నుంచి గణనం
రెండు పరమాణువులు కలిపి -ఒక అణువు
3 అణువులు - 1 త్రసరేణువు

3 త్రసరేణువులు - 1 త్రుటి

100 త్రుటులు - 1 వేధ

3 వేధలు - 1 లవం

3 లవాలు - 1 నిమిషం

3 నిమిషాలు - 1 క్షణం

5 క్షణాలు - 1 కాష్ట

10 కాస్టలు - 1 లఘవు

15 లఘువు - 1 నాడి
2 నాడులు - 1 ముహుర్తం

6.5 ముహుర్తం - 1 ప్రహరం/జాము

4 జాములు - 1 పగలు + 4 జాములు - రాత్రి

పగలు/ రాత్రి -1 రోజు

15 రోజులు - 1 పక్షం (శుక్ల, కృష్ణ )

2 పక్షాలు -1 నెల

2 నెలలు - 1 బుతువు

3 బుతువులు - 1 ఆయనం (ఉత్తరాయణం, ధక్షిణాయణం)
2 ఆయనాలు - 1 సంవత్సరం

(ఈ ఒక్క మనుష్య సంవత్సరం దేవతలకు 1 రోజు)
ఈ సంవత్సరాలను కలిపితే
4,32,000 - 1 కలియుగం
8,64,000 - 1 ద్వాపరయుగం
12,96,000 - 1 త్రేతాయుగం
17,28,000 - 1 కృతయుగం
ఈ నాలుగు యుగాలని కలిపి 1 మహాయుగం
Total 43,20,000
అంటారు.
(ఈ లెక్కలో 71 మహాయుగాలను కలిసి 1 మన్వంతరం అంటారు. దీనికి అథిపతులే మనువులు.
ఈ నునువులే బ్రహ్మ మానస పుత్రులుగా పుట్టి సృష్టి ఉత్పత్తి చేస్తారు. మనం ఇప్పుడు ఉంటున్నది. స్వాయంభువ
మనువులో. ఆ మనువు పుత్రిక దితి, అతిధి సంతానమే దేవతలు, మనుష్యులు, జంతువులు, పక్షులు
మొదలయినవి. ఈ మనువులో ఉంటున్న జీవులు మరియొక మనువులో మారిపోతుంటాయి.
ఎత్తు, ఆకారం, జాతి వగైరా... ఇప్పుడు ఉన్న శిలాజాలు అప్పటివే....) 
ఇటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మాదేవునికి 1 పగలు
1000 మహాయుగాలు బ్రహ్మాదేవునికి 1 రాత్రి. అటువంటి 365 రోజులు ఒక సంవత్సరం అటువంటి వంద సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక్క ఆయుః ప్రమాణం.
43,20,000 X 2000 X 365 X 100 =
31,53,60,00,00,00,000 ఇన్ని మనుష్య సంవత్సరాలు సాక్షాత్ ఒక బ్రహ్మదేవుని ఆయుర్దాయం..
ఈ లెక్కలు దాటి ఇంకా ఉంది. అది విష్ణు పురాణాల్లో మనం చూడొచ్చు.
ఇప్పటివరకు మనం కాల ప్రమాణంలో బ్రహ్మదేవుని ఆధారం చేసుకొని మాట్లాడం జరిగింది‌. ఎందుకంటే బ్రహ్మ దేవుని పైన ఉన్న ఈశ్వరునిలో కాలం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే బ్రహ్మ అనేది ఒక పదవి ఆ పదవిలో అర్హత కలిగిన ఈశ్వరుని నిర్ణయింపబడిన వారు ఉంటారు. అటువంటి బ్రహ్మ కాలం తీరగానే ఆ బ్రహ్మ కపాలాలను దయతో ఈశ్వరుడు మెడలో వేసుకొని ఉంటాడు. ఆయన మెడలో ఉన్నవి అవే. ఎందుకంటే కాలం పరిధిలో బ్రహ్మ వీరంతా ఉంటారు. కాని కాలం ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది. అందుకే "మహా కాలుడు" అని నామం ఆయనకు మాత్రమే. 
సృష్టిలో ఒక్క బ్రహ్మదేవుడు మాత్రమే ఉంటాడా అని అడిగితే కాదు ఎంతో కొన్ని వేల బ్రహ్మదేవుళ్ళు ఏకకాలంలో తమ పరిధిలో ఉన్న విశ్వానికి సృష్టి కర్తలై వెలుగుతుంటారు. 
1.మన ఈ కథని బ్రహ్మ విమోహన లీలలో చూడవచ్చు భాగవతంలో... శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి తన అవతారంలో లీలలో భాగంగా ఈ సృష్టిలో ఉన్న బ్రహ్మదేవులందరూ ఆయనకు కనబడేలా చేస్తాడు. అందులో ఒక్కొక్క బ్రహ్మదేవుడు రెండు శిరస్సులతో ఇంకొకరు మూడు శిరస్సులతో, ఇంకొకరు అనేక వేల శిరస్సులతో శ్రీహరిని స్తుతిస్తూ కనబడతారు.
Ref:bhagavatam
Parallel universe కి ఇదే అతిపెద్ద ఆధారం.
2. ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీ విష్ణు సందర్శనార్థం వైకుంఠ వెళ్ళినప్పుడు అంతకు మునుపే ఒక బ్రహ్మదేవుడు ఆయన దర్శనం చేసుకుని వస్తుంటాడు. ఆయనకి లెక్క పెట్టడానికి వీలు లేనన్ని చేతులు అనంతమైన అనంతమైన శిరస్సులు ఉన్నాయి. అంటే అది భౌతికంగా మనుష్య రూపమే కాకపోవచ్చు సృష్టిలో వివిధ లోకాలకు చెందిన వాతావరణానికి తగ్గట్టుగా జీవులు ఉండడం తెలిసినదే. కాబట్టి ఈ అనంతమైన విషయంలో ఏఏ లోకాల్లో ఉన్న జీవులకి పరమాత్ముడు అదే రూపంలో కనబడడం మామూలే. ఆయన కాలానికే ఆయుష్షు నిర్ణయించేవాడు. వేదం స్పష్టంగా చెప్పింది ఈ అనంతమైన భువన బ్రహ్మాండంలో అనేక కోటానుకోట్ల గ్రహాల్లో జీవులు పుట్టడం పెరగడం గతించడం జరుగుతుందని. ఉదాహరణకి అతల, సుతల, పాతాళ, భూతల , స్వర్గ....
3. అలాగే సృష్టిలో వివిధ లోకాల్లో టైం వేరుగా ఉంటుంది దానినే టైం డైలేషన్ అని అంటారు. ఇందుకు సంబంధించిన కథలు మనం రామాయణంలో భాగవతంలో వివిధ పురాణాల్లో చాలానే ఉన్నాయి. అవి తర్వాత చెప్పుకుందాం.

ఏది ఏమైనా సృష్టిలో లేనిది ఎప్పుడూ సృష్టించబడదు. ఉన్నది ఎప్పుడూ నాశనం కాదు కానీ రూపం మారుతుంది అంతే. అది శుద్ధ చైతన్య రూపమైన పరమాత్ముని యొక్క లీలా విలాస వైభవం. సత్యాన్ని మరుగుపరిచేదే మాయ. ఆయన అనుగ్రహం తోనే మాయ తొలగి సత్యాన్ని గ్రహించినప్పుడు తాను ఎవరో తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకుని జీవన్ముక్తులు అవుతారు 'యద్భావం తద్భవతి. శాశ్వతమైన పదార్థము నుంచి వచ్చిన వారు ఎవరైనా శాశ్వతులే..
that's why we are Eternal...
There is neither birth nor death..
Atma 🔅

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...