Thursday, February 2, 2023

సనాతన ధర్మ కాల గణనం

Atom ⚛️ _అణు_ ....

About కాలం .....
“Kaalo asmi loka kshaya kritpraviddho” ( Chapter 11 shloka 32).

పరమాణువు
శ్రీమద్ మహా భాగవత పురాణం మూడవ స్కంధం 349 శ్లోకం నుంచి.....

సూర్యుని కాంతి కిటికీలోనుండి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే చిన్న చిన్న
రెణువులలో ఆరవభాగానికి
పరమాణువు అని పేరు. ఆ పరమాణువుపై ఒక ప్రక్కనుండి మరియొక్క ప్రక్కకు
సూర్యకిరణం పయనించే కాలానికి
సూక్ష్మకాలం అని పేరు. అంటే కాంతి ఒకసెకనుకు 3 లక్షల కి.మి. ప్రయాణం చేస్తుంది. అంత వేగమంతమైన కాంతి ఒ క చిన్న పార్టికల్‌ పొడవులో ట్రావెల్‌ చేసే సమయంలో
ఆరవ వంతు అన్నమాట. దీనిని కేవలం ఊహించుకోవలసిందే అదియే మిక్కిలి
అత్యల్పమైన కాలము.


ఆ అత్యల్ప సమయం నుంచి గణనం
రెండు పరమాణువులు కలిపి -ఒక అణువు
3 అణువులు - 1 త్రసరేణువు

3 త్రసరేణువులు - 1 త్రుటి

100 త్రుటులు - 1 వేధ

3 వేధలు - 1 లవం

3 లవాలు - 1 నిమిషం

3 నిమిషాలు - 1 క్షణం

5 క్షణాలు - 1 కాష్ట

10 కాస్టలు - 1 లఘవు

15 లఘువు - 1 నాడి
2 నాడులు - 1 ముహుర్తం

6.5 ముహుర్తం - 1 ప్రహరం/జాము

4 జాములు - 1 పగలు + 4 జాములు - రాత్రి

పగలు/ రాత్రి -1 రోజు

15 రోజులు - 1 పక్షం (శుక్ల, కృష్ణ )

2 పక్షాలు -1 నెల

2 నెలలు - 1 బుతువు

3 బుతువులు - 1 ఆయనం (ఉత్తరాయణం, ధక్షిణాయణం)
2 ఆయనాలు - 1 సంవత్సరం

(ఈ ఒక్క మనుష్య సంవత్సరం దేవతలకు 1 రోజు)
ఈ సంవత్సరాలను కలిపితే
4,32,000 - 1 కలియుగం
8,64,000 - 1 ద్వాపరయుగం
12,96,000 - 1 త్రేతాయుగం
17,28,000 - 1 కృతయుగం
ఈ నాలుగు యుగాలని కలిపి 1 మహాయుగం
Total 43,20,000
అంటారు.
(ఈ లెక్కలో 71 మహాయుగాలను కలిసి 1 మన్వంతరం అంటారు. దీనికి అథిపతులే మనువులు.
ఈ నునువులే బ్రహ్మ మానస పుత్రులుగా పుట్టి సృష్టి ఉత్పత్తి చేస్తారు. మనం ఇప్పుడు ఉంటున్నది. స్వాయంభువ
మనువులో. ఆ మనువు పుత్రిక దితి, అతిధి సంతానమే దేవతలు, మనుష్యులు, జంతువులు, పక్షులు
మొదలయినవి. ఈ మనువులో ఉంటున్న జీవులు మరియొక మనువులో మారిపోతుంటాయి.
ఎత్తు, ఆకారం, జాతి వగైరా... ఇప్పుడు ఉన్న శిలాజాలు అప్పటివే....) 
ఇటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మాదేవునికి 1 పగలు
1000 మహాయుగాలు బ్రహ్మాదేవునికి 1 రాత్రి. అటువంటి 365 రోజులు ఒక సంవత్సరం అటువంటి వంద సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక్క ఆయుః ప్రమాణం.
43,20,000 X 2000 X 365 X 100 =
31,53,60,00,00,00,000 ఇన్ని మనుష్య సంవత్సరాలు సాక్షాత్ ఒక బ్రహ్మదేవుని ఆయుర్దాయం..
ఈ లెక్కలు దాటి ఇంకా ఉంది. అది విష్ణు పురాణాల్లో మనం చూడొచ్చు.
ఇప్పటివరకు మనం కాల ప్రమాణంలో బ్రహ్మదేవుని ఆధారం చేసుకొని మాట్లాడం జరిగింది‌. ఎందుకంటే బ్రహ్మ దేవుని పైన ఉన్న ఈశ్వరునిలో కాలం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే బ్రహ్మ అనేది ఒక పదవి ఆ పదవిలో అర్హత కలిగిన ఈశ్వరుని నిర్ణయింపబడిన వారు ఉంటారు. అటువంటి బ్రహ్మ కాలం తీరగానే ఆ బ్రహ్మ కపాలాలను దయతో ఈశ్వరుడు మెడలో వేసుకొని ఉంటాడు. ఆయన మెడలో ఉన్నవి అవే. ఎందుకంటే కాలం పరిధిలో బ్రహ్మ వీరంతా ఉంటారు. కాని కాలం ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది. అందుకే "మహా కాలుడు" అని నామం ఆయనకు మాత్రమే. 
సృష్టిలో ఒక్క బ్రహ్మదేవుడు మాత్రమే ఉంటాడా అని అడిగితే కాదు ఎంతో కొన్ని వేల బ్రహ్మదేవుళ్ళు ఏకకాలంలో తమ పరిధిలో ఉన్న విశ్వానికి సృష్టి కర్తలై వెలుగుతుంటారు. 
1.మన ఈ కథని బ్రహ్మ విమోహన లీలలో చూడవచ్చు భాగవతంలో... శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి తన అవతారంలో లీలలో భాగంగా ఈ సృష్టిలో ఉన్న బ్రహ్మదేవులందరూ ఆయనకు కనబడేలా చేస్తాడు. అందులో ఒక్కొక్క బ్రహ్మదేవుడు రెండు శిరస్సులతో ఇంకొకరు మూడు శిరస్సులతో, ఇంకొకరు అనేక వేల శిరస్సులతో శ్రీహరిని స్తుతిస్తూ కనబడతారు.
Ref:bhagavatam
Parallel universe కి ఇదే అతిపెద్ద ఆధారం.
2. ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీ విష్ణు సందర్శనార్థం వైకుంఠ వెళ్ళినప్పుడు అంతకు మునుపే ఒక బ్రహ్మదేవుడు ఆయన దర్శనం చేసుకుని వస్తుంటాడు. ఆయనకి లెక్క పెట్టడానికి వీలు లేనన్ని చేతులు అనంతమైన అనంతమైన శిరస్సులు ఉన్నాయి. అంటే అది భౌతికంగా మనుష్య రూపమే కాకపోవచ్చు సృష్టిలో వివిధ లోకాలకు చెందిన వాతావరణానికి తగ్గట్టుగా జీవులు ఉండడం తెలిసినదే. కాబట్టి ఈ అనంతమైన విషయంలో ఏఏ లోకాల్లో ఉన్న జీవులకి పరమాత్ముడు అదే రూపంలో కనబడడం మామూలే. ఆయన కాలానికే ఆయుష్షు నిర్ణయించేవాడు. వేదం స్పష్టంగా చెప్పింది ఈ అనంతమైన భువన బ్రహ్మాండంలో అనేక కోటానుకోట్ల గ్రహాల్లో జీవులు పుట్టడం పెరగడం గతించడం జరుగుతుందని. ఉదాహరణకి అతల, సుతల, పాతాళ, భూతల , స్వర్గ....
3. అలాగే సృష్టిలో వివిధ లోకాల్లో టైం వేరుగా ఉంటుంది దానినే టైం డైలేషన్ అని అంటారు. ఇందుకు సంబంధించిన కథలు మనం రామాయణంలో భాగవతంలో వివిధ పురాణాల్లో చాలానే ఉన్నాయి. అవి తర్వాత చెప్పుకుందాం.

ఏది ఏమైనా సృష్టిలో లేనిది ఎప్పుడూ సృష్టించబడదు. ఉన్నది ఎప్పుడూ నాశనం కాదు కానీ రూపం మారుతుంది అంతే. అది శుద్ధ చైతన్య రూపమైన పరమాత్ముని యొక్క లీలా విలాస వైభవం. సత్యాన్ని మరుగుపరిచేదే మాయ. ఆయన అనుగ్రహం తోనే మాయ తొలగి సత్యాన్ని గ్రహించినప్పుడు తాను ఎవరో తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకుని జీవన్ముక్తులు అవుతారు 'యద్భావం తద్భవతి. శాశ్వతమైన పదార్థము నుంచి వచ్చిన వారు ఎవరైనా శాశ్వతులే..
that's why we are Eternal...
There is neither birth nor death..
Atma 🔅

No comments:

Post a Comment

వేద విజ్ఞానం

3. వేద విజ్ఞానం వేదాలలో చాలా విజ్ఞాన విషయాలు గోచరిస్తాయి. కాని పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం విచ్ఛిత్తి పొందడం వల్ల చాలా విషయాలలో వినియోగ ...