Tuesday, March 27, 2018

Health tips

ఒబేసిటీ మరియు డయాబెటిస్ ను మందులు మరియు వ్యాయామం చేయకుండా ఏ విధముగా ఆహారపు అలవాట్లు మార్చుకొనుట ద్వారా నియంత్రించవచ్చో తెలియచేసినారు. ఆ విషయాలను క్రింద వివరించారు. నచ్చిన వాళ్ళు ప్రయత్నించవచ్చు. ఈ విషయాలు వారికిఉన్న సమస్యను బట్టి 15 నుండి 30 రోజులు
ఆచరించాలి. తరువాత పొట్ట మరియు వెయిట్ తగ్గిన తరువాత కొద్దీ పాటి జాగ్రత్తలతో అన్ని తినవచ్చు.

*1st రూల్.*
రోజుకు 70 గ్రామ్ - 100 గ్రామ్ ల ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ కొరకు వాడాల్చిన నూనెలు.
(a)వంట కొబ్బరి నూనె
(b)నాటు ఆవు నెయ్యి
(c)అలివ్ ఆయిల్
(d)పాల మీద మీగడ లేదా వెన్న లేదా బట్టర్ .
ఫ్యాట్ కి సంబందించి పైన నూనెలు మాత్రమే పైన చెప్పిన క్వాంటిటీ లో తీసుకోవాలి.

*2 వ రూల్*
రోజు కు 3 నిమ్మకాయలు వాడాలి. పల్చటి మజ్జిగలో ఉప్పు లేకుండా ఈ నిమ్మరసం రోజులో ఎదో ఒక టైంలో త్రాగవచ్చు.

*3 వ రూల్*
రోజుకు నాలుగు లీటర్ల మంచినీరు త్రాగాలి.

*4 వ రూల్*
రోజు రాత్రి ఒక Multi విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి.
పై నాలుగు రూల్స్ అనుసరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు.
1. పైన పేర్కొన్న నాలుగు రకాల ఆయిల్స్ తప్ప ఎటువంటి రిఫైనెడ్ ఆయిల్స్ వాడరాదు.
2. సముద్రపు కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి.
3. చింతపండు వాడరాదు.
4. Tasting సాల్ట్ వాడరాదు.
5. ఈ ఎనిమిది రకాల కూరగాయలు పూర్తిగా నిషిద్ధం. బంగాళదుంప, చిలకడ దుంప,చెమ దుంప,పెండలం, కంద, బీట్రూట్, అరటి మరియు బీన్స్.
6.ఉల్లి,క్యారెట్ మరియు టమోటో లు రోజుకి ఒకటీ వాడవచ్చు.
7. మిగిలిన కూరగాయలు unlimited గా తీసుకోవచ్చు.
8.vegtables అన్ని ఉప్పు నీళ్ల లో కడిగి వండాలి.
9.డీప్ ఫ్రై ల కు ఆలివ్ ఆయిల్ వాడరాదు.
10. పై నాలుగు రూల్స్ పాటించేటప్పుడు..
*(రైస్,ధాన్యాలు, స్వీట్స్, ఫ్రూట్స్ మరియు కూల్డ్రింక్స్ అసలు తినరాదు)*
11.Eggs విత్ yellow తినవచ్చు.
12. Non veg రోజుకు 250 గ్రామ్స్ - 300 గ్రామ్స్ వరకు తినవచ్చు.
13. మటన్ బోన్స్ సూప్ త్రాగవచ్చు.
14.chicken తాండూరి,tikka, కబాబ్, గ్రిల చికెన్ లను కలర్ మరియు కార్న్ లేకుండా తినవచ్చు.
15.పన్నీర్ రోజుకు 100 గ్రామ్స్ వరకు తినవచ్చు.
16.పెరుగు వాడరాదు.
17. పల్చటి మజ్జిగ వాడవచ్చు.
18.కొబ్బరి నీళ్లు త్రాగరాదు.
19.పాలు త్రాగరాదు.
20.గ్రీన్ టీ త్రాగవచ్చు.
20.షుగర్ , హనీ వాడరాదు.
21. కూరల్లో కొద్దిగా పాలు పోసుకొని వండుకోవచ్చు.
22.ఈ పద్ధతి లో మూడు రకాలైన నట్స్ వాడాలి. బాదంపప్పు, పిస్తా పప్పు, వాలనట్స్ రోజుకు 10 చొప్పున తినాలి.
23.ఈ పద్దతి లో కొన్ని రకాలైన గింజలు కూడా తీసుకోవాలి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు water melon సీడ్స్ రోజుకు 4- 5 స్పూన్స్ తినవచ్చు.
24.తెల్ల నువ్వులు మరియు ఆవిసే గింజలు powder గా mix చేసి రోజు 2 స్పూన్స్ తినాలి.
25.ముల్లంగి, సొర, బీర, కీరా వంటి ఫైబర్ వుండే వాటిని కూడా తీసుకోవాలి.
25.ఆకలి వేసినప్పుడూ మాత్రమే ఏదయినా తినాలి.
26. ఆకలి తీరెవరకు తినాలి.

*ఇది కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా avoid చేసి ఫాట్ అండ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకొని డయాబెటిస్, బి.పి, కోలేష్ట్రల్ వంటి వాటిని నియంత్రించే పద్దతి అని చెపుతున్నారు. చాలా మంది ఈ పద్దతి పాటించి బెనిఫిట్ పొందామని చెపుతున్నారు.*
*నమ్మకం కలిగితే ఆచరించి చూడండి.*

Wednesday, March 21, 2018

Health tips telugu lo

[21/3 6:42 [PM]] Siva Kumar: ఆరోగ్య సూత్రాలు :
🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..b కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ
Share Pls...........
[21/3 6:42 [PM]] Siva Kumar: పెరుగు వలన కలిగే ఫలితాలు
************************
పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్బుత ఫలితాలు పొందండి.

1. కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 
2. కొద్దిగా నల్ల ఉప్పును పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపు కుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి తగ్గుతాయి. 

 3. కొద్దిగా పెరుగులో మిశ్రి కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తిఅందు తుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు పోతాయి. 
4. కొంత వాము,నల్లుప్పు తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి. 

5. ఓ కప్పు పెరుగులో కొంత జీలకర్ర పొడి, మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

Thursday, September 14, 2017

Story

గంప కింద పువ్వు కథ

అనగనగా ఒక  వూరిలో,
ఒక  కోడి  వుండేది, ఆ  కోడిని  ఎటు  వెళ్లనివ్వకుండా  ఒక  గంప  దాన్ని  ఎప్పుడు  మూసి  పెట్టేది, బయటకు  వెళ్లాలని  ఎంత  ప్రయత్నించినా ,
గంప  దాన్ని  వదిలేది  కాదు..

ఆ గంపకు  పక్కనే  ఎదిగిన  మొక్క  లో  పూచినా  పువ్వు,
ఇదంతా గమనించి,
ఓ గంపా, ఎందుకు  ఆ  కోడిని  అలా  మోసి పెట్టి,
దాని స్వేచ్ఛను, ఎదుగుదలను అడ్డుకుంటున్నావ్?
పాపం కదా, అంది.

పువ్వు మాటలకు,
అహంకారం తో నిండిన మనసుతో, ఆ గంప..
"నా  గుణం అంతే, నాకు  నచ్చిన దాన్ని మోసుకెళ్తాను
నా  ఇష్టం  వచ్చిన  దాన్ని  మూసి పెడతాను"
అని బదులిచ్చింది.

గంప  మాటలు  విన్న  పువ్వు, చిన్ననవ్వు నవ్వి
అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి అని విర్రవీగకు,
అంది పువ్వు,
హ హ హ అవునా, సరే , ఇప్పుడు నిన్ను కూడా మూసి పెడతాను,
చూస్తావా,, అని, ఆ గంప, పువ్వును కూడా తన కింద మూసి పెట్టుకుంది,,

అయితే, గంప ఆ పువ్వును బంధించింది, కానీ, ఆ పువ్వు వెదజల్లే, పరిమళాన్ని మాత్రం
బంధించలేకపోయింది,
ఆ సుమగంధాలన్నీ అనుసరిస్తూ, అక్కడికి వచ్చిన ఒక పసిపాప,
గంపను తీసి, పక్కన పడేసి, ఆ పువ్వును తీసుకెళ్లి, దేవుని పాదాల వద్ద వుంచింది..

ఈ కథ లో లాగే, జీవితం లో ఎదగుతున్న వారిని చూసి,
ఓర్వలేక, తమ కింద ఉండాలని తొక్కి పెట్టాలని కుటిల పన్నాగాలు పన్నే వారికి,
ఏదో ఒక సందర్భం లో, పరాభవం తప్పదు,
నేను ఎదగాలి అనుకోవడం లో తప్పు లేదు, కానీ
నేనే ఎదగాలి అని అనుకోవడం అంటే, అది మూర్ఖత్వం అవుతుందని
ఈ గంప కథలోని నీతి!!......

Story


అందమైన జీవితం:
*🌸 కథ 🌸*

కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు.
ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది.
పూజారి బయటకు వచ్చి చూడగా..
పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా..
దానిపై
‘నా భక్తుని కొరకు’
అని రాసి ఉంది.
ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు.
పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే..
అది మట్టిపాత్రగా మారిపోయింది.
విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది.
ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది.

ఒక్కో భక్తుడు రావడం..
పళ్లాన్ని ముట్టుకోవడం..
అది మట్టిపాత్రలా మారిపోవడం.. ఇదే తంతు!

విషయం కాశీ రాజుకు తెలిసింది.
రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు.
జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు.
అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు.. నలుపు రంగులో కనిపించింది.
తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.

ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు.
మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు.
కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు.
‘విశ్వనాథా! ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’
అని మొరపెట్టుకున్నాడు.
మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు.
ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు.
స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది.
ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు.
దూరంగా నిల్చుని చూస్తున్నాడు.
తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి..
‘ఓ పెద్దాయన.. నువ్వూ వచ్చి ముట్టుకో.. రోజూ గుడికొస్తావ్‌గా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది’
అని హేళనగా అన్నాడు.

పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు.
అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది.
అందరూ ఆశ్చర్యపోయారు.
అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు.

*ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి.*

అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!

నేను శక్తిని అడిగాను -
భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.

నేను సంపదను అడిగాను -
భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.

నేను ధైర్యాన్ని అడిగాను -
భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.

నేను వరాలు అడిగాను -
భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.

నేను ఆయన ప్రేమను అడిగాను-
భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.

నేను జ్ఞానాన్ని అడిగాను -
భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.

నేను పురోగతి అడిగాను -
భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.

నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను -
భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.

నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను -
భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.

నేను పాపాలు క్షమించమని అడిగాను -
భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.

అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు -
నాకు కావలసిందే నేను పొందాను.

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.

చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.
మీరు కూడాఅర్ధం చేసుకోండి.

జరిగేది అంతా మన మంచికే..

లోకా సమస్తా సుఖినోభవ౦తు..🙂🙂🙂🙂

Tuesday, September 5, 2017

Story

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన #గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది #మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ #అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.

ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు. ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత #ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.

రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, #హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.

హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?
“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా #సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం) రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు. మన భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. #అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, #oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

ఒకానొకప్పుడు అంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు అక్కడ వున్న తెగను దునుమాడి, వారిని హతమార్చి,  అక్కడ శిధిలాల నిర్మితమైన నవ శకం నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరకా. ఇత:పూర్వం నివశించేవారిని నేటివ్ ఇండియన్స్ అని, ఇండియన్ అమెరికన్ అని, నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. ఇప్పటికీ #హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. చరిత్రలో మరొక ఐతీహ్యం కూడా చెప్పబడుతూ వున్నది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. #Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు(sorcism ) నమ్ముతారు చేస్తారు. #ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది.) . అలాగే అర్జున, పాతాళ యువరాణి ఉలుపివృత్తాంత౦ కూడా వారి వాంగ్మయంలో చిల్లి పెప్పర్ man గా కనబడుతుంది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్యవలసిన అవసరం వున్నది.

ఒకసారి నడిచే దేవుడు కంచి #పరమాచార్య వారు ఒక israel దేశస్తుడిని ఉద్దేశించి వారి మంత్రాలకు మన మంత్రాలకు వున్న సంబంధం వివరిస్తారు. వారు అన్నారు ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. అప్పుడు సంస్కృతానికి పూర్వం వున్న దేవభాష గురించి చెబుతారు. అప్పుడు వారన్నారు మీకందరికీ తాళం కనబడుతోంది. కేవలం మా ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా వున్నాయి అని. ఎంత సత్యమో కదా !!!

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...