3. వేద విజ్ఞానం
వేదాలలో చాలా విజ్ఞాన విషయాలు గోచరిస్తాయి. కాని పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం విచ్ఛిత్తి పొందడం వల్ల చాలా విషయాలలో వినియోగ విధానాలు స్పష్టపడటం లేదు. స్మృతి, ఇతిహాస, పురాణాలతో ప్రాచీన వైద్యాది శాస్త్ర గ్రంథ విషయాలతో వీటిని పోల్చి పరిశీలిస్తే ఈ రహస్యాలు వ్యక్తం కావచ్చు. వేదం తెలిపిన కొన్ని విజ్ఞాన విషయాల నీ వ్యాసంలో గమనిద్దాం.
నీరు పోస్తే నిప్పు ఆరిపోతుంది. కాని నీటిలో నిప్పు ఉందనే విషయం వేదం తెలిపింది. నీరు ఔషధం గూడా. అగ్నికి 'అపాంనపాత్' అని పేరు. 'న పాత యత్యుదక మధ్యే గూఢతయా స్థితోపి తదుదకం నవినాశయ తీతి నపాత్. అపాం నపాత్ ఇతి వహ్ని విశేషస్య సంజ్ఞా' (నీటిలో గూఢంగా ఉన్నా ఆ నీటిని నశింపచేయనిది అనే అర్థంలో నీటిలో ఉండే అగ్నికి అపాంనపాత్ అని పేరేర్పడింది. 'దేవీ రాపో అపాంనపాత్' అని వేద ప్రయోగము. (శ్రీకృష్ణ యజుర్వేద సాయణ భాష్యం - 451 పుట).
''అప్సు మే సోమో అబ్రవీ దన్త ర్విశ్వాని భేషజా అగ్నిఞ్చవిశ్వ శమ్భువమ్'' (అథర్వ - 1 కాం. 1 అను. 6 సూ. 2 మం.)
(నీటిలోపల అన్ని రోగాలను తొలగించే ఓషధులున్నాయని, విశ్వానికి సుఖం కలిగించే అగ్ని ఉన్నదని సోముడు మాకు ఉపదేశించాడు.)
మేఘాలలో విద్యుత్తును మనం చూస్తాం. ఇపుడు వాటర్ థెరపీ అనే వైద్య విధానం వాడుకలోకి వస్తోంది.
పానీయం శీతలం రూక్షం హన్తి పిత్త విషభ్రమమ్
దాహా జీర్ణ శ్రమచ్ఛర్ది మోహ మూర్ఛా మదాత్యయాన్
మూర్ఛా పిత్తోష్మ దాహేషు విషేరక్తే మదాత్యయే
భ్రమ క్లమాతి సారేషు మార్గోత్థ వమథౌ తథా
ఊర్ధ్వగే రక్త పిత్తేచ శీతమంభః ప్రశస్యతే
- బృహన్నిఘంటు రత్నాకరం - 3 భాగం-438, 439 పుటలు
(చన్నీరు రూక్షమైనది. అది పిత్తం, విషభ్రమం, దాహం అజీర్ణం, శ్రమ, ఛర్ది, మోహం, మూర్ఛ, మద్యం వల్ల కలిగిన వికారం తొలగిస్తుంది. పిత్తం వల్ల వేడి, దాహం, రక్తం విషమవడం, భ్రమ, క్లమం, అతీసారం, ప్రయాణం వల్ల కలిగిన కక్కులు, పై భాగంలో వచ్చే రక్త పిత్తం అనే రోగాలలో చల్లని నీరు రోగి కివ్వడం మంచిది.)
శ్లో|| యత్య్వాథ్యమానం నిర్వేగం నిష్ఫేనం నిర్మలం భ##వేత్
అర్ధావశిష్టం భవతి తదుష్ణోదక ముచ్యతే
కఫ మేదోనిలా మఘ్నం దీపనం బస్తి శోధనమ్
కాస శ్వాస జ్వర హరం పథ్యముష్ణోదకం సదా
తప్తం పాథః పాదభాగేన హీనం పథ్యం ప్రోక్తం వాత జాతా మయఘ్నమ్
తప్తాయః పిండ సంసిక్తం లోష్ట నిర్వాపితం జలమ్
సర్వదోష హరం పథ్యం సదా నైరుజ్యకారకమ్
- బృహన్నిఘంటు రత్నాకరం, జ్వరప్రకరణం - 1291 పుట
(కాచిన నీరు వేగం, నురుగు లేనిదే నిర్మలమవుతుంది. సగానికి మరగ కాచిన నీరు ఉష్ణోదకం. ఇది కఫం, మేదస్సు (మేధ కాదు) వాయువు, ఆమం తొలగిస్తుంది. ఉదరాగ్నిని దీపింపజేస్తుంది. పెద్ద ప్రేగును శుద్ధం చేస్తుంది. కాస, శ్వాస దోషాలను జ్వరాన్ని తొలగిస్తుంది. ఇది ఎప్పుడూ పథ్యం. కాచగా నాల్గవ వంతు తగ్గిన నీరు వాత దోషాలను పోగొడుతుంది. సగం తగ్గేదాకా కాచిన నీరు వాత పిత్త దోషాలను తొలగిస్తుంది. 4వ వంతు మిగిలిన నీరు వాత పిత్త శ్లేష్మ దోషాలను తొలగిస్తుంది. కాచిన ఇనుప గుండుపై వేసిన నీరు మట్టికుండతో కాచిన నీరు ఎప్పుడూ అన్ని దోషాలను హరిస్తుంది. అనారోగ్యాలను తొలగిస్తుంది.)
ఇలా ఆయుర్వేద విషయాలను అథర్వణ వేదంలో సమన్వయించుకోవలసి ఉన్నందు వలననే, ఆయుర్వేదాన్ని అథర్వణ వేదానికి ఉపవేదంగా పేర్కొంటారు.
హృదయనేత్రం
హృదయ నేత్రం వేదంలో కనబడుతోంది.
శ్లో|| ఘోరా ఋషయో నమో అస్త్వేభ్య
శ్చక్షు ర్యదేషాం మనసశ్చ సత్యమ్
బృహస్పతయే మహిష ద్యుమన్నమో
విశ్వకర్మన్ నమస్తే పాహ్య స్మాన్
- అథర్వ. 2 కాం. 6 అ. 35 సూ. 4 మం.
(తేజస్వంతాలయిన ప్రాణాలకు నమస్కారం. ఈ ప్రాణ మనోమధ్యంలో ఉన్న సత్యదర్శియైన చక్షువుకు నమస్కారం. ప్రకాశవంతుడైన బృహస్పతికి నమస్కారం. ఓ విశ్వకర్మా! నీకు నమస్కారం. మమ్ము పాలించు.)
'హృది ప్రాణో గుదేపానః' అని అమరసింహుడు హృదయం ప్రాణానికి స్థానమని చెప్పారు. (అమరం - 1 కాం. 63 శ్లో.) ఇక్కడ ప్రాణ మనస్సుల మధ్య 'కన్ను' ప్రసంగం ఉంది.
ఈ విషయాన్ని సర్వసార సంగ్రహోపనిషత్తు మరింత స్పష్టం చేసింది. 'బిందౌ మనోలయం కృత్వా దూరదర్శన మాప్నుయాత్ (బిందువు నందు మనోలయం చేసి దూరదర్శనం పొందాలి.)
దక్షిణాచార సంప్రదాయంలో హృదయ మందు శ్రీచక్రాన్ని భావిస్తారు. శ్రీ చక్రంలో మధ్య ఉండే స్థానమే బిందువు. సమయాచార పద్ధతిలో అంతర్యాగంలో హృదయ మందు అనాహత చక్రంలో చతుర్దశారాన్ని భావిస్తారు. ఇది చతుర్దశ భువనాత్మకం. మహామాయా స్వరూపం. (శ్రీవిద్యాసముచ్చయం - 117 పుట). కనుక ఇక్కడ మనస్సును లయం చేస్తే ప్రపంచంలో తనకు కావలసిన విషయం గోచరించటం సమంజసమే.
ఈ విషయాన్ని నిరూపించడమెలా ? సాధన ద్వారా నిరూపించుకోవడం మొదటి పద్ధతి. దీనివల్ల తనకు సత్యం తెలిసినా ఇతరులు సత్యంగా గుర్తించడం కష్టం. నమ్మకం ఉన్నవారికివేమీ అవసరం లేదు. ఇది వ్యక్తిగతం. సాధకుల జీవితోదంతాల నుదాహరణంగా గ్రహించడం మరొక పద్ధతి. ఇది ఎక్కువ మంది ఆస్తికులకు విశ్వాస యోగ్యంగా ఉంటుంది. షిర్డీ సాయిబాబా దాసుగణు అనే భక్తునితో నామ సప్తాహం చేయమన్నారు. అతడు చేయడానికి అంగీకరించి విఠలుడు ప్రత్యక్షం కావాలని కోరాడు. ఆయన 'భక్తి ఉంటే ప్రకటమవుతా' డని చెప్పారు. సప్తాహ సమాప్తి తరువాత దాసుగణుకు, ధ్యానం చేస్తున్న మరొక భక్తునికి విఠలుని దర్శనం కలిగింది. చిత్రమేమంటే దీక్షితుకు ధ్యానంలో కనబడిన విఠల రూపం గల చిత్ర పటాలు ఆ దినం షిరిడీకి అమ్మకానికి వచ్చాయి. దీక్షితు తాను ధ్యానంలో దర్శించిన మూర్తి చిత్రపటంగా కనబడడం వలన ఆశ్చర్యపడి ప్రీతితో ఒక పటం తీసుకుని పూజలో ఉంచుకున్నాడు. (శ్రీసాయి సచ్చరిత - 4వ అధ్యాయం).
మరొకసారి దీక్షితు సాయి నామ స్మరణ చేస్తుంటే అతనికి లింగ దర్శన మయ్యింది. ఇంతలో మేఘ అనే భక్తుడు అక్కడికి వచ్చి ''కాకా! బాబా లింగాన్నిచ్చారు చూడు'' అని చూపించాడు. దీక్షితు విస్మితుడయ్యాడు. 'ఇంతకు ముందు తనకు ధ్యానంలో కనబడిన లింగమే అది.' (శ్రీసాయి సచ్చరిత 28 వ అధ్యాయం).
శ్రీ షిర్డీ సాయిబాబావారి కాలంలో వారిని సేవిస్తూ వారి జీవిత చరిత్ర వ్రాసిన హేమాడ్ పంతు తెలిపిన విషయాలివి. కనుక వేదమాత తెల్పిన హృదయ నేత్రానికీ వృత్తాంతాలు నిదర్శనాలు.
ఈ విషయాన్ని యోగశాస్త్రం గూడా చెబుతోంది.
'భువన జ్ఞానం సూర్యే సంయమాత్' (సూర్యుని విషయంలో సంయమనం వల్ల సకల లోక విషయక జ్ఞానం కలుగుతుంది).
- సాఙ్గ యోగదర్శనం, 3 వ పా. 26 సూ.
శ్లో. అనన్తా రశ్మయ స్త్వస్య దీపవద్యః స్థితోహృది,
ఊర్ధ్వ మేక స్థిత స్తేషాం యోభిత్వా సూర్యమణ్డలమ్
బ్రహ్మలోక మతిక్రమ్య తేన యాతి పరాంగతిమ్
(హృదయంలో దీపం వలె ఉన్న సూర్యస్థానానికి అనంతమైన రశ్ములున్నాయి. అందులో ఊర్ధ్వంగా ఉండే నాడి ద్వారా వెళ్ళిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకొని బ్రహ్మలోకాన్ని దాటి పరమగతిని పొందుతారు). అనే స్మృతివాక్యం ఆ స్థానం హృదయమందున్నదని స్పష్టం చేస్తోంది.
కనుక వేద మంత్రాల తత్త్వం తెలుసుకోవాలంటే వేదాఙ్గాలలో, ఉపవేదాలలో, పురాణతిహాసాలలో, మంత్రయోగ శాస్త్రాలలో ఆ మంత్రానికి దేనితో సంబంధం ఉందో గమనించాలి.
మూలాధార గ్రంథాలయం
వాసిష్ఠ గణపతి ముని హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయానికి ప్రారంభం చేస్తూ మూలాధార గ్రంథాలయాన్ని తెరవాలి. అపుడే బాగా విజ్ఞానం కలుగుతుందని సూచించారని వారి జీవిత చరిత్ర తెలుపుతుంది. (నాయన)
మంత్రశాస్త్ర సంప్రదాయంలో ఉషఃకాలంలో రశ్మిమాలా జపంలో మూలాధార స్థానంలో చక్షుష్మతీ విద్యను ఉపాసిస్తారు. అది దూరదృష్టిని ప్రసాదిస్తుందని అక్కడ ఉంది. ఆ విద్య 16 మంత్రాల సమిష్టి రూపం. అందులో తాంత్రిక మంత్రాలతో పాటు ఈ వేద మంత్రం కూడా ఉంది.
వయస్సుపర్ణా ఉపసేదు రింద్రమ్ప్రియ మేధా ఋషయోనాధమానాః
అపధ్వాన్త మూర్ణుహి పూర్ధి చక్షుర్ముముగ్ధ్య స్మాన్ నిధయేవ బద్ధాన్
- ఋగ్వేదం - 10 మం. 73 సూ. 11 మం.
(గమనశీలం, సుఖదాయకం అయిన సూర్యకిరణాలు ఇంద్రుని చేరాయి. యజ్ఞప్రియులు ద్రష్టలు అయిన ఋషులతో సమానంగా ప్రార్థన చేశాయి. దేవా! మా అంధకారాన్ని దూరం చెయ్యి. కంటికి ప్రకాశాన్ని నింపు. త్రాళ్ళతో కట్టబడిన మమ్ము బంధన విముక్తుల్ని చెయ్యి.)
ఈ మంత్రంలో ధ్వాంతాన్ని దూరం చెయ్యి, కంటికి ప్రకాశాన్ని నింపు మొదలయిన వాక్యాలను బట్టి దూరదృష్టి సాధనలో దీనిని వినియోగించే వారన్న మాట. కాని మూలాధారం తమోలోకమనీ, అక్కడ ధారణ చేయడం వల్ల ఇబ్బందులుంటాయని మంత్ర శాస్త్రంలో హెచ్చరికలున్నాయి. కనుక ఈ సాధన క్లిష్టతరమని చెప్పాలి. (సౌందర్యలహరీ, లక్ష్మీధర వ్యాఖ్య - 41 శ్లో. 352 పుట)
పైన పేర్కొన్న హృదయ నేత్ర సాధన నిరపాయమైనది.
శరీరంలో ప్రాణాయామ వృత్తుల స్థితి
శరీరంలో ప్రాణాపాన వృత్తులెలా ఉన్నాయో వేదం తెలిపింది.
విషూచీ ప్రహరతి. తస్మాద్విష్వ ఞ్చౌ ప్రాణాపానౌ
- శ్రీకృష్ణ యజుర్వేదసంహిత - 6 కాం. 3 ప్ర. 9 అ.
(వపాశ్రపణులను వ్యత్యస్తాగ్రాలుగా పడవేయాలి. శరీరంలో ప్రాణాపానాలు వ్యత్యస్తగ్రాలుగా ఉంటాయి.)
హోమం చేయడం కోసం పశువు నుండి వపను తీసి వపాశ్రపణుల పైన వేసి కాచిన తర్వాత ప్రతిప్రస్థాత ఆ వపాశ్రపణులను ఆహవనీయంలో వేయాలి. వాటిని వ్యత్యస్తాగ్రాలుగా వేయాలని చెబుతూ ప్రాణాపానాలు శరీరంలో వ్యత్యస్తాగ్రాలని వేదమాత తెలిపింది.
'ప్రాణః ఊర్ధ్వవృత్తిః అపానోధో వృత్తిరితి వ్యత్యాసః (ప్రాణం పైకి ప్రవర్తించేది, అపానం క్రిందికి ప్రవర్తించేది) అని సాయణాచార్యుల వారు దీనిని వివరించారు.
- శ్రీకృష్ణయజుర్వేద సంహితాభాష్యం - 423 పుట
అపాన మూర్ధ్వ ముత్థాప్య ప్రాణం కణ్ఠాదధోనయన్
యోగీ జరా వినిర్ముక్తః షోడశోవయసా భ##వేత్
(ఊర్ధ్వ వృత్తి అయిన ప్రాణాన్ని కంఠానికి క్రిందకి, అధో వృత్తి అయిన అపానాన్ని పైకి ప్రవహింపజేయడం వల్ల ముసలితనాన్ని నిరోధించి ¸°వనాన్ని పొందవచ్చని సర్వసార సంగ్రహోపనిషత్తు చెబుతోంది. కనుక ప్రాణాపాన వృత్తుల గురించి తెలిసికోవడం చాలా లాభకరం.)
మేదస్సు వల్ల పశువులకు రూపం
మేదస్సు వల్ల రూపం కలుగుతుందని వేదం తెలుపుతోంది. ''మేదసాస్రుచౌ ప్రోర్ణోతి మేదోరూపావైపశవః రూపమేవ పశుషు దధాతి'' (మేదస్సు చేత జుహు, ఉపభృత్తు అనే స్రుచాలను ఆచ్ఛాదించాలి. పశువులు మేదస్సే రూపంగా కలవి. కనుక రూపాన్ని పశువుల యందు కలిగించుచున్నాడు. 6 కాం. 3 ప్ర. 11 అ.)
ఈ మంత్రాన్ని వ్యాఖ్యానిస్తూ సాయణాచార్యుల వారు 'సతిమేదో బాహుల్యే పశూనాం రూపవత్త్వమ్ (మేదస్సు అధికంగా ఉంటే పశువులందంగా ఉంటాయి) అని తెలిపారు. జీర్ణమయిన బట్ట వంటిది, హృదయానికి కప్పి ఉండే పొరకు మేదస్సని పేరు.
అశ్వపర్శువును కత్తిగా ఉపయోగించడం
'అశ్వపర్శ్వా బర్హిరచ్ఛైతి. ప్రాజాపత్యోవా అశ్వస్సయోనిత్వాయ. ఓషధీనా మహిగ్ంసాయై' (అశ్వపర్శువుతో బర్హిస్సును సంపాదించడం కోసం వెళ్ళాలి. అశ్వం ప్రజాపతికి చెందింది. కనుక ప్రజాపతికి చెందిన అశ్వపర్శువుతో కోయాలి. సృష్టికర్త అయిన ప్రజాపతి ఓషధుల కణుపులను ఎరుగును. దర్భకు కణుపుల దగ్గర భేదం జరగడం వల్ల వాటికి హింస కలుగ కుండా చేస్తాడు.)
- శ్రీకృష్ణయజుర్వేద సాయణాచార్య భాష్యం - 37 పుట
ఈ వాక్యాల వల్ల జన్మ సంబంధం, ఆత్మీయత కలచోట హింస చేయవలసి ఉన్నా వీలయినంత హింస తగ్గే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. అశ్వపర్శువును కత్తిగా ఉపయోగించి బర్హిస్సును కణుపుల దగ్గర కోసేవారని స్పష్టం. 'పర్శుః పార్శ్వ గతాస్థి ఖండమ్' (సాయణ భాష్యం - 36 పుట) పార్శ్వంలోపల ఉన్న ఎముక ముక్కకు పర్శువని పేరు.
అన్నపానాలు శరీరాదులను చేరే తీరు
''అన్నమశితం త్రేధా విధీయతే
తస్యయః స్థవిష్ఠో ధాతు స్తత్పురీషం భవతి
యో మధ్యమః తన్మాగ్ంసమ్ యోణిష్ఠ స్తన్మనః
ఆపః పీతాస్త్రేధా విధీయన్తే
తాసాం యస్థవిష్ఠో ధాతుస్తన్మూత్రం భవతి
యోమధ్యమస్తల్లోహితం, యోణిష్ఠ స్స ప్రాణః''
(తిన్న ఆహారం జఠరాగ్నిచే పక్వమై మూడు విధాలుగా విభజింపబడుతుంది. బాగా స్థూలమైన భాగం మలమవుతుంది. స్థూలం, సూక్ష్మము కాని భాగము రసాదులుగా పరిణమించి మాంసమవుతుంది. బాగా సూక్ష్మమయిన భాగం హృదయాన్ని చేరి హితమనే సూక్ష్మ నాడులలో ప్రవేశించి వాక్కు మొదలయిన ఇంద్రియాలకు స్థితిని కలిగిస్తూ మనస్సవుతుంది. ఇలా ఆహారం మనస్సుకు బలం కలిగిస్తుంది. కనుక మనస్సు కూడా భౌతికమే.
(త్రాగిన నీళ్ళు మూడు విధాలుగా అవుతున్నాయి. వాటిలో స్థూల భాగం మూత్రం, మధ్యమ భాగం రక్తం, అతిసూక్ష్మ భాగం ప్రాణమూ అవుతున్నాయి.)
- బృహదారణ్యకోపనిషత్తు - 6 అ. 5 ఖం. 1, 2 మంత్రాలు
ఒక ఔషధం స్థూల రూపంలో తినినపుడు ఏ లక్షణాలను కలిగిస్తుందో అదే ఔషధాన్ని సూక్ష్మరూపంలో తీసుకుంటే ఆ లక్షణాలు గల రోగాన్ని తగ్గిస్తుందనేది హోమియోపతి వైద్య మూల సూత్రం. ఆ వైద్యానికి చెందిన ఔషధ తత్త్వ శాస్త్రంలో ప్రతి ఔషధాల లక్షణ వర్ణనల్లో మానసిక లక్షణాలను ప్రత్యేకంగా వ్రాస్తారు. దీనివల్ల తినిన పదార్థాలలో సూక్ష్మాంశం మనస్సును చేరుతూ దానిలో తన లక్షణాలను కలిగిస్తోందనే విషయం నిరూపిత మవుతోంది.
'తేజోశితం త్రేధా విధీయతే. తస్యయః స్థ విష్ఠోధాతు స్తదస్థి భవతి, యో మధ్యమః సమజ్జా. యోణిష్ఠస్సావాక్' (తేజోభూత లక్షణాలు కలిగిన నేయి, నూనె మొదలయినవి తింటే అవి మూడు విధాలుగా అవుతాయి. వాటిలో స్థూలభాగం ఎముక, మధ్యమ భాగం మజ్జ అవుతుంది. ఎముకలో ఉండే నూనె వంటి పదార్థం మజ్జ. అతి సూక్ష్మ పదార్థం వాక్ అవుతుంది. నూనె, నేయి మొదలయినవి తింటే వాక్కుస్ఫుటంగా మాట్లాడడానికి సమర్థమవుతుంది.
- బృహదారణ్యకం - 6 అ. 5 ఖం. 3 మం.
నూనె, నెయ్యి మొదలయిన వాటివల్ల దీపాలు వెలుగుతున్నాయి. కనుక వాటిని తోజోభూత భాగాలుగా తెల్పారు.
వేదంలో ఇనుము, కర్ర, మట్టిపాత్రలు - వెండి, బంగారం వినియోగం
వేదంలో ఇనుప పాత్రలు, దారు పాత్రలు, మట్టి పాత్రలు, వెండి, బంగారం కూడా వాడుకలో ఉన్నాయి.
''నమృన్మయే నాపి దధ్యాత్. య న్మృన్మయే నాపి దధ్యాత్. పితృదేవత్యగ్గ్ స్యాత్. అయస్పాత్రేణవా దారుపాత్రేణ వాపి దధాతి. తద్ధిసదేవమ్''
(హోమం కోసం పిదికిన పాలను కాచి తోడు పెట్టి దానిపైన మట్టి మూకుడును వేయరాదు. మట్టి మూకుడు మూతగా వేస్తే ఆ పదార్థం పితృదేవతలకు సంబంధించిన దవుతుంది. ఇనుప పళ్ళెం గాని, కర్ర పళ్ళెం కాని మూత వేయాలి. అది దేవతలకు సంబంధించిన దవుతుంది.)
- తైత్తిరీయ బ్రాహ్మణం - 3 కాం. 2 ప్ర. 3 అ. 26, 27 పనస
పై వాక్యాల వల్ల మట్టి, ఇనుము, కర్రల మూతలు వాడుకలో ఉన్నట్లు స్పష్టం.
తస్మాద్రజతగ్ హిరణ్యమదక్షిణ్యమ్ (అందువల్ల వెండిని దక్షిణగా ఇవ్వరాదు)
- శ్రీకృష్ణ యజుస్సంహిత - 1 కాం. 5 ప్ర. - 1 అనువాకం
వెండి వాడుకలో లేనపుడు వెండి యజ్ఞంలో దక్షిణగా పనికి రాదనే నిషేధం బయలు దేరదు కదా!
సోమయాగానికై సోమలత సిద్ధం చేసినపుడు అంచనా సరిగా లేక సోమం చాలకపోతే ప్రాయశ్చిత్తం చెప్పారు.
''యస్య సోమఉపదస్యేత్. సువర్ణగ్ం హిరణ్యం ద్వేధా విచ్ఛిద్య. ఋజీషేన్యదా ధూనుయాత్. జుహుయా దన్యత్. సోమమేవాభి షుణోతి. సోమం జుహోతి''
''ఏ యజమానునికి దంచబడిన సోమరసం సమగ్ర హోమాలకు చాలలేదో అతడు బంగారాన్ని రెండు భాగాలుగా జేసి ఒక శకలం సోమలత పిప్పిలో వేసి మరలా దంచాలి. రెండవ ముక్క చమస పాత్రలో వేసి సోమరసంలో హోమం చేయాలి. అలా చేస్తే సోమమే దంచినట్లు సోమమే హోమం చేసినట్లు అవుతుంది.'' అని శ్రుతి చెబుతోంది.
- శ్రీకృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ బ్రాహ్మణం - 1 కాం. 4 ప్ర. 7 అను. 42 ప.
ఇలా చాలా చోట్ల బంగారం ప్రసక్తి వేదంలో ఉంది.
నేల, నింగి, నీటిల్లో నడిచే వాహనాలు
ఋగ్వేదంలోనే నేలమీద, అంతరిక్షంలోను, నీటిలో పయనించే వాహనాలు పేర్కొనబడ్డాయి.
తుగ్రో హ భుజ్యు మశ్వినో దమేఘే
రయింన కశ్చిన్మ మృవాం అవాహాః, తమూహథు ర్నౌభి రాత్మన్వతీభి
రంతరిక్ష పృద్భి రపోదకాభిః
తిస్రః క్షపస్త్రి రహా తి వ్రజద్భి
ర్నా సత్యా భుజ్య మూహథు పత ఙ్గైః
సముద్రస్య ధన్వ న్నార్ధ్రస్య పారే
త్రిభీరథై శ్శత పద్భి ష్షడశ్వైః
దీనికి శ్రీ దయానంద స్వామి వ్యాఖ్యాసారమిది.
'యః కశ్చిద్ధనాభిలాషీ భ##వేత్ స (రయిం) ధనం కామయమానో (భుజ్యుం) పాలన భోగమయం ధనాది పదార్థ భోగ మిచ్ఛన్ విజయం చ, పదార్థ విద్యయా స్వాభిలాషం ప్రాప్నుయాత్. సచ (అశ్వినా) పృథివీ మయైః కాష్ఠలోష్ఠాదిభిః పదార్థైః నావం రచయిత్వా అగ్నిజలాది ప్రయోగేణ (ఉదమేఘే) సముద్రే గమయే దాగమయే' చ్చ. తేన ద్రవ్యాది సిద్ధిం సాధయేత్. ఏవం కుర్వన్ (నకశ్చిత్ మమృవాన్) యోగక్షేమ విరహస్సన్ న మరణం కదాచిత్ ప్రాప్నోతి కుతః? తస్య కృత పురుషార్థత్వాత్. అతో నావం (అవాహాః) అర్థాత్ సముద్రే ద్వీపాన్తర గమనం ప్రతినావో వాహనా వహనే పరమ ప్రయత్నేన నిత్యం కుర్యాత్. కౌ సాధయిత్వా (అశ్వినా) ద్యౌరితి ద్యోత నాత్మకాగ్ని ప్రయోగేణ (పృథివ్యా) పృథివీ మయే నాయస్తామ్ర రజత ధాతు కాష్ఠాది మయేన చేయం క్రియా సాధనీయా. అశ్వినౌ యువాంతౌ సాధితౌ ద్వౌ నావాదికం యానం (ఊహాథుః) దేశాన్తర గమనం సమ్యక్ సుఖేన ప్రాపయతః పురుష వ్యత్యయేనాత్ర ప్రథమ పురుష స్థానే మధ్యమ పురుష ప్రయోగః. కథం భూతై ర్యానైః (నౌభిః ఆత్మన్వతీభిః) స్వయం స్థితాభిర్వా. రాజ పురుషై ర్వ్యాపారిభిశ్చ మనుషై#్య ర్వ్యవహారార్థం సముద్ర మార్గేణ తాసాం గమనా గమనే నిత్యం కార్యే ఇతిశేషః. తథాతాభ్యా ముక్త ప్రయత్నాభ్యాం భూయాం స్య న్యాన్యపి విమానాదీని సాధనీయాని. ఏవమేవ (అంతరిక్ష ప్రుద్భిః) అంతరిక్షం ప్రతి గంతృభిః విమానాఖ్య యానైః సాధితై స్సర్వైర్మనుషై#్యః పరమైశ్వర్యం సమ్యక్ ప్రాపణీయమ్. పునః కథం భూతాభిర్నౌభిః (అపోదకాభిః) అపగతం దూరీకృతం జలలేపో యాసాంతాః అపోదకానావః అర్థాత్ సచ్చిక్కనాః తాభిః ఉదరే జలాగమన రహితాభిశ్చ సముద్రే గమనం కుర్యాత్. అత్రప్రమాణం - తత్కావశ్వినౌ ద్యావా పృథివ్యా విత్యేకే. అశ్వినౌ యద్వ్యశ్నువాతే సర్వమ్. రసేనాన్యోజ్యోతిషాన్యో అశ్వైరశ్వినా విత్యౌర్ణవాభః (నిరు - అధ్యా. 12. ఖం 1) ఏతైః ప్రమాణౖరేతత్సిద్ధ్యతి. వాయు జలాగ్ని పృథివీ వికార కలా కౌశల సాధనేన త్రి విధం యానం రచనీయమితి.
(తిస్రః క్షప స్త్రిరహా) కథం భూతై ర్నావాదిభిః తసృభీ రాత్రిభిః ర్దినైః (ఆర్ద్రస్య) జలేన పూర్ణస్య సముద్రస్య తథా (ధన్వనః) స్థూలస్య అంతరిక్షస్య పారే (అతి వ్రజద్భిః) అత్యన్త వేగవద్భిః, పునః కథమ్భూతైః (పతఙ్గైః) ప్రతిపాతం వేగేన గన్తృభిః తథా (త్రిభీరథైః) త్రిభీరమణీయ సాధనైః (శతపద్భిః) శ##తేనా సంఖ్యాతేన వేగేన పద్భ్యాం యథా గచ్ఛేత్ తాదృశై రత్యంత వేగవద్భిః (షడశ్వైః) షడశ్వా ఆశు గమన హేతవః యన్త్రాణ్యగ్ని స్థానానివా యేషు తాని షడశ్వాని తైఃత్రిషు మార్గేషు సుఖేన గన్తవ్యమితి శేషః, తేషాం యానానాం సిద్ధిః కేనద్రవ్యేణ భవతీత్యత్రాహ (నాసత్యా) పూర్వోక్తాభ్యా మశ్విభ్యాం నాసత్యౌ ద్యావా పృథివ్యౌ' తాని యానాని ఊహథుః ఇత్యత్ర పురుష వ్యత్యయేన ప్రథమ స్యస్థానే మధ్యమః. అత్ర ప్రమాణం 'వ్యత్యయో బహుళమ్' (అష్టాధ్యాయీ - అ. 3, పా. 1, సూ. 85).
ఈ రథములకు చెందిన వర్ణన మరికొన్ని మంత్రములందు కలదు (ఋగ్వేదం - 1 అష్ట, 8 అ, వర్గం 8, 9, మంత్రం 5, 1). (ఋగ్వేదాది భాస్యభూమికా - 198 నుండి 207 పుటలు).
(ధనాన్ని కోరేవాడు పదార్థ విద్యచే తన కోరిక తీర్చుకోవాలి. అతడు కర్రలు మొదలయిన పదార్థాలతో నావను తయారుచేసి అగ్ని, నీరు మొదలయిన వాటిని ప్రయోగించి సముద్రంలో రాకపోకలు చేయాలి. దానివల్ల ధనాదులు లభిస్తాయి. ఇలా మంచి సాధనం ద్వారా సముద్రయానం చేసినవాడు మరణించడు. అంటే గొప్ప ప్రయత్నంతో నిరంతరం ఓడ ప్రయాణాలు సాగించాలన్న మాట. అగ్ని, ఇనుము, రాగి, వెండి, కర్రలు వీటి నుపయోగించి నావ ప్రయోగాలు చేయాలి. అశ్వినీ దేవతలారా! మీరీ నావలు మొదలయిన వాటిని దేశాంతరానికి చేరుస్తారు. ఆ నావలు స్వయంగా ఉండేవి. వీటి నుపయోగించి అధికారులు వ్యాపారులు సముద్రంలో గమనాగమనాలు చేయాలి.
నావకుపయోగించిన ద్రవ్యాదులతో విమానాలు గూడా సాధించాలి విమానాల వల్ల మానవులు పరమైశ్వర్యాన్ని పొందాలి. పైన పేర్కొన్న నావలలోనికి నీరు రాకూడదు. వాయువు నీరు అగ్ని భూమి వీటికి చెందిన సాధనాలతో కళాకౌశలంతో మూడు విధాలయిన వాహనాలను నిర్మించాలి.
ఇవి వేగంగా మూడు రాత్రింబవళ్ళలో సముద్రాన్ని, భూమిని అంతరిక్షాన్ని దాటతాయి. వీటిలో వేగంగా వెళ్ళడానికి వంద యంత్రాలు అగ్నితో కూడి ఉంటాయి.
ఈ వ్యాఖ్య ప్రకారం ధనం కోరేవారు సముద్రంలో ప్రయాణించే ఓడలను, ఆకాశం మీద ఎగిరే విమానాలు తయారు చెయ్యాలనీ, అవి తయారు చెయ్యడానికి స్థూలంగా విధానాన్ని తెల్పడం జరిగింది.
శ్రీ సాయణాచార్యుల వారు పై మంత్రాల నిలా వ్యాఖ్యానించారు. 'అత్రేద మాఖ్యాయికా. తుగ్రో నామాశ్వినోః ప్రియః కశ్చిద్రాజర్షిః సచ ద్వీపాంతర వర్తిభి శ్శత్రుభి రుపద్రుతః సన్ తేషాం జయాయ స్వపుత్రం భుజ్యుం సేనయా సహనావా ప్రాహైషీత్. సాచనౌర్మధ్యే సముద్రమతి దూరం గతా వాయువశేన భిన్నాసీత్. తదానీం స భుజ్యురశ్వినౌ తుష్టావ. తౌచ స్తుతౌ సేనయా సహిత మాత్మీయాసు నౌష్వారోప్య పితుస్తుగ్రస్య సమీపం త్రిభిరహోరాత్రైః ప్రాపయామాసతురితి. అయమర్థః ఇదమాదికేన తృచేన ప్రతిపాద్యతే. (మంత్ర విషయంలో ఈ వాస్తవ వృత్తం ఉందిఅశ్వినీ దేవతలకు ప్రియుడైన తుగ్రుడొకానొక రాజర్షి. ద్వీపాంతరంలో ఉండే శత్రువుల వల్ల ఉపద్రవం పొందిన అతడు వారిని జయించడానికి తన కుమారుడైన భుజ్యువును సేనతో కూడా ఓడపై పంపాడు. అది సముద్రంలోకి చాలా దూరం వెళ్ళి వాయువు వలన పగిలి పోయింది. అపుడు భుజ్యువు అశ్వినీ దేవతలను స్తోత్రం చేశాడు. వారు తమ ఓడలందు సేనతో కూడా భుజ్యుని ఎక్కించుకొని మూడు రాత్రింబవళ్ళలో అతని తండ్రి దగ్గరకు చేర్చారు. ఈ విషయం ఈ పై మూడు ఋక్కులచే ప్రతిపాదింపబడుతుంది.) ''హ శబ్దఃప్రసిద్ధౌ. తుగ్రః ఖలు పూర్వం శత్రుభిః పీడితః సన్ తజ్జయార్థముదమేఘే ఉదకైర్మిహ్యతే సిచ్యత ఇత్యుదక మేఘ స్సముద్రః. తస్మిన్ భుజ్యు మేత త్సంజ్ఞ మవాహాః నావాగంతుం పర్యత్యాక్షీత్. తత్ర దృష్టాంతః మమృవాన్ మ్రియామాణస్సన్ ధనలోభీ కశ్చిన్మనుష్యో రయింన యథా ధనం పరిత్యజతి తద్వత్. హే అశ్వినౌ తంచ భుజ్యుం మధ్యే సముద్రం నిమగ్నం నౌభిః పితృసమీప మూహథుః. యువాం ప్రాపిత వన్తౌ. కీదృశీభిః ఆత్మన్వతీభిరాత్మీయాభిః యువయోః స్వభూతాభిరిత్యర్థః యద్వా ధృతిరాత్మా ధారణ వతీభి రిత్యర్థః అతి స్వచ్ఛత్వా దంతరిక్షే జలస్యోపరిష్టాదేవ గంతృభిః, అపోదకాభిః సుశ్లిష్టత్వా దప గతోదకాభిః అప్రవిష్టోదకాభిరిత్యర్థః.
(హ శబ్దం ప్రసిద్ధార్థాన్ని తెలుపుతుంది. తుగ్రుడు పూర్వం శత్రువులచే పీడింపబడిన వాడై వారిని జయించడం కోసం సముద్రం మీదికి తన కుమారుడైన భుజ్యువును ఓడతో పంపాడు. మరణించే ధనలోభి ధనాన్ని ఎంత శ్రమమీద వదలుతాడో అంత బాధపడుతూ పంపాడు. అశ్వినులారా! సముద్ర మధ్యంలో మునిగే భుజ్యువును నీటికి పైనే వెళ్ళేవీ, లోపల నీరు ప్రవేశించనివీ అయిన మీ వాహనాలతో అతనిని తండ్రి దగ్గరకు చేర్చారు.
హేనాసత్యౌ! సేనయా సహోదకే నిమగ్నం భుజ్యుం తిస్రః క్షపః త్రిసంఖ్యాకా రాత్రిః త్రిరహా త్రివార మావృతాన్యహాని చాతివ్రజద్భిరతిక్రమ్య గచ్ఛద్భి రేతావంత కాలమతి వ్యాప్య వర్తమానైః పతఙ్గైః పతద్భి స్త్రిభి స్త్రి సంఖ్యాకై రథై రూహథుః యువా మూఢవన్తౌ. క్వేతిచేదుచ్యతే సముద్రస్యాంబురాశేర్మధ్యే, ధన్వన్ ధన్వని జలవర్జితే ప్రదేశే, ఆర్ద్రస్యోదకే నార్ద్రభూతస్య సముద్రస్య పారే తీర దేశేచ కథం భూతై రథైః శతపద్భిః శత సంఖ్యాకైశ్చక్ర లక్షణౖః పాదై రుపేతైః షళ##శ్వైః షడ్భిరశ్వై ర్యుక్తైః.
- ఋగ్వేదం - 1 మం - 17 అ. 116 సూ, 3, 4 మంత్రాలు
(ఓ అశ్వినీ దేవతలారా! సేనతో కూడా నీటిలో మునిగిన భుజ్యువును సముద్రం మీద, బురదమీద, నేలమీద మూడు రాత్రులు, మూడు పగళ్ళు ప్రయాణం చేసినట్టి, వంద చక్రాలు, ఆరు గుర్రాలు కల్గినట్టి ఎగిరే మూడు రథాల మీద మీరు తీసుకువచ్చారు.)
ఈ వ్యాఖ్య వల్ల మూడు రాత్రింబవళ్ళు నీటిపైన, బురదపైనా, నేలపైనా ఎగురుతూ నీరంటకుండా ప్రయాణించే వాహనాలను ఋగ్వేదం పేర్కొందని తెలుస్తుంది.