నారదా! ఇదంతా మహామాయా విలాసం. సర్వప్రాణికోటికీ శరీరాల్లో అనేక దశాభేదాలు ఉంటాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు కాక నాల్గవ దశ ఒకటి ఉంది. అదే మరణానంతరం మరొక శరీరాన్ని పొందడం. ఇందులో సందేహించవలసింది ఏమీ లేదు. నిద్రపోయిన మానవుడు ఏమీ వినలేడు, తెలుసుకోలేడు, చెయ్యలేడు. మెలకువగా ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు. అన్నీ తెలుసుకుంటాడు. నిద్రలోకూడా చిత్తానికి కదలికలుంటాయి. అవే స్వప్నచలనాలు. అవన్నీ మనోభేదాలూ, రకరకాల మనోభావాలూను. ...
నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్నసంభవాః ॥ నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః ॥
11
(30 - 41)
ఏనుగు నన్ను చంపడానికి స్తోంది. ఎదిరించలేను, ఎటూ పారిపోలేను. ఏమి చెయ్యాలి అంటూ స్వప్నంలో దుఃఖిస్తాడు. అలాగే కొన్ని కలల్లో సుఖాలు అనుభవిస్తాడు. మేల్కొన్నాక అవన్నీ గుర్తు తెచ్చుకుని జనాలకి వివరంగా చెబుతాడు. కలకంటున్నంతసేపూమాత్రం ఇది భ్రమ అని ఎవరూ అనుకోరు. ఇలాంటిదే ఇహజన్మానుభవమూను. సంసారంలో ఉన్నంతకాలమూ ఇది భ్రమ అనిపించదు. (మరొక జన్మ పొందాక, గతజన్మ స్మృతిని నిలుపుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ మాయావిలసనం) అలా అనిపించకపోవడమే మాయావిభవం. అది చాలా దుర్గమం సుమా! #from SRI DEVI BHAGAVATAM
No comments:
Post a Comment